Jump to content

నందాదేవి ప్లుటోనియం యాత్ర

వికీపీడియా నుండి
నందాదేవి ప్లుటోనియం యాత్ర
Type గూఢచర్యం
Location నందాదేవి
Planned 1965
అందించినవారు సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ, భారత ఇంటిలిజెన్స్ బ్యూరో
కార్యక్రమ ఉద్దేశ్యము {{{objective}}}
తేదీ 1965 అక్టోబరు
నిర్వహించినవారు సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ
తుదకు తేలినది యాత్ర విఫలమైంది
ప్లుటోనియం జనరేటరు పోయింది

నందాదేవి ప్లుటోనియం యాత్ర అనేది అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఏ), భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లు సంయుక్తంగా చేసిన ఆపరేషను. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో జరుగుతున్న అణు పరిణామాలపై పెట్టిన నిఘా ఆపరేషనది. ఉత్తరాఖండ్ గర్వాల్ హిమాలయాలలోని నందా దేవి శిఖరంపై అణుశక్తితో నడిచే రిమోట్ సెన్సింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి ఈ రెండు ఏజెన్సీలు 1965 అక్టోబరులో పరస్పరం సహకరించుకున్నాయి.[1]

బలమైన మంచు తుఫాను కారణంగా ప్లూటోనియంతో నడిచే రేడియో ఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్ ఆ పర్వతాలలో పోయింది. దాంతో యాత్ర విఫలమైంది.[2]

యాత్ర

[మార్చు]

చైనా చేస్తున్న అణ్వాయుధాల అభివృద్ధి పట్ల 1965 లో పెంటగాన్, సిఐఏలు ఆందోళన చెందాయి. చైనా, రహస్య కేంద్రాల్లో అణు పరీక్షలు నిర్వహించేది.[3] అప్పటికే వియత్నాం యుద్ధం ముదురుతోంది, చైనా నుండి రాగల ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా వద్ద గూఢచార సమాచారం లేదు.

అంతకు రెండు సంవత్సరాల ముందు, అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక ఉన్నతాధికారి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు. షేర్పాలను నియమించుకుని, శిఖరాగ్రంలో రిమోట్ సెన్సింగ్ స్టేషన్‌ను స్థాపించుకోవాలని అతను పెంటగాన్‌కు సూచించాడు. అయితే ఎవరెస్ట్ పర్వతం చైనా సరిహద్దులో ఉండటంతో ఈ ఆలోచనపై వెనక్కి తగ్గారు. భారత అధికారులతో సంప్రదింపుల తర్వాత పెంటగాన్, 25,645 అడుగులు (7,817 మీ.) ఎత్తున భారత భూభాగంలోని నందాదేవి శిఖరంపై రిమోట్ సెన్సింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.[4]

1965 అక్టోబరులో సిఐఏ, భారత ఇంటెలిజెన్స్ బ్యూరోతో కలిసి యాత్ర ప్రారంభించింది. సభ్యులు 8-10 అడుగుల ఎత్తైన యాంటెన్నా, రెండు ట్రాన్స్‌సీవర్ సెట్‌లు, ప్లూటోనియం శక్తితో పనిచేసే రేడియో ఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటరు, దాని ఏడు ప్లూటోనియం క్యాప్సూల్స్‌ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాత్ర నాలుగవ శిబిరానికి చేరుకున్నప్పుడు, మంచు తుఫాను తాకింది. బృందం నాయకుడైన మన్మోహన్ సింగ్ కోహ్లీ, వెనక్కి వెళ్లాలని నిర్ణయించాడు. పరికరాన్ని మంచు లోని పగులులో కట్టివేసి, బృందం తమ బేస్‌కు తిరిగి వెళ్లింది.[5][6]

అనంతర పరిణామాలు

[మార్చు]

1966 మే వసంత ఋతువులో పరికరాన్ని, దాని లోని ప్లూటోనియం క్యాప్సూల్‌నూ తిరిగి తెచ్చేందుకు భారత బృందం నాలుగవ క్యాంపుకు యాత్ర చేసింది. ఆ బృందానికి, జనరేటరు దాని క్యాప్సూల్‌ల సంకేతాలూ కనిపించలేదు.[7] తరువాత, ఆ పరికరాన్ని తెచ్చేందుకు అమెరికన్ పర్వతారోహకుల బృందం కూడా వెళ్ళింది. నందాదేవి ప్రాంతాన్ని న్యూట్రాన్ డిటెక్టర్లతో స్కాన్ చేశామని, అయితే ప్లూటోనియంకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని ఆ బృందంలోని సభ్యుడూ డేవ్ డింగ్‌మన్ తెలిపాడు. కొండచరియలు విరిగిపడినపుడు పరికరమూ, దాని క్యాప్సూలూ కిందికి కొట్టుకుపోయి ఉంటాయని ఆ బృందం నిర్ధారించింది.[8]

1967 లో సిఐఏ, 22,000 అడుగుల ఎత్తులో నందా కోట్ శిఖరం దగ్గర అణుశక్తితో నడిచే సిగ్నల్ పరికరాన్ని స్థాపించగలిగింది. ఆ పరికరం కొన్ని నెలల పాటు పనిచేసింది. ఆ సమయంలో చైనీయుల వద్ద సుదూర పరిధి అణు బాంబు లేదని నిర్ధారించారు.[1]

దావాలు, నమ్మకాలు

[మార్చు]

ది వాస్ట్ అన్‌నోన్: అమెరికాస్ ఫస్ట్ ఎసెంట్ ఆఫ్ ఎవరెస్ట్ పుస్తక రచయిత బ్రౌటన్ కోబర్న్, ఆ స్ప్రింగ్ యాత్రకు ముందే భారత గూఢచార సంస్థ రహస్యంగా అక్కడకు చేరుకుని పరికరాన్ని సేకరించి ఉంటుందని రాసాడు. బహుశా దానిని అధ్యయనం చేయడానికి, ప్లూటోనియంను సేకరించేందుకూ ఇది చేసి ఉంటారని అని అతను రాసాడు.[9]

పర్వతంపై ఆ న్యూక్లియర్ క్యాప్సూల్ ఉండటం వల్ల వరదలు, మంచు పెళ్ళలు విరిగి పడడం పెరిగాయని ఈ ప్రాంతంలో నివిసించే ప్రజలు అంటారు.[10][11]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Beckhusen, Robert. "Inside the CIA Mission to Haul Plutonium Up the Himalayas". Wired (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 1059-1028. Retrieved 2021-11-05.Beckhusen, Robert. "Inside the CIA Mission to Haul Plutonium Up the Himalayas". Wired. ISSN 1059-1028. Retrieved 2021-11-05.
  2. "James Bond in the Himalayas: The buried secret of Nanda Devi". The Economic Times. Retrieved 2021-11-05.
  3. "How Did India Lose A Nuclear Device On A Glacier? Here's The Nanda Devi Conspiracy". The Better India (in ఇంగ్లీష్). 2021-05-03. Retrieved 2021-11-05.
  4. Namita Devidayal (Aug 9, 2018). "'CIA kept changing story on losing the nuclear device in Nanda Devi' | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-05.
  5. Bag, Shamik (2015-04-18). "The Nanda Devi mystery". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-11-05.
  6. Mizokami, Kyle (2021-02-26). "In 1965, the CIA Lost Plutonium in the Himalayas, and Indian Villagers Think It Caused Deadly Floods". Popular Mechanics (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-07.
  7. Times, William Borders Special to The New York (1978-04-18). "Desai Says U.S.-Indian Team Lost Atomic Spy Gear'". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2021-11-05.
  8. "Nanda Devi's Nuclear Secret and a Botched CIA Operation". Live History India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-05.
  9. Coburn, Broughton (2013). The Vast Unknown: America's first ascent of Everest. Crown Publishers. ISBN 978-0-307-88716-0. OCLC 843125877.
  10. "Did nuclear spy devices in the Himalayas trigger India floods?". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-02-20. Retrieved 2021-11-05.
  11. Team, ThePrint (2021-02-16). "How Chamoli flood brings back focus on nuclear device IB-CIA operation lost at Nanda Devi". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-05.