Jump to content

ఇంటెలిజెన్స్ బ్యూరో

వికీపీడియా నుండి
ఇంటెలిజెన్స్ బ్యూరో
ఇంటెలిజెన్స్ బ్యూరో చిహ్నం
సంస్థ వివరాలు
స్థాపన సుమారు 1887 (1887)
ప్రధానకార్యాలయం న్యూ ఢిల్లీ
వార్షిక బడ్జెట్ 3,823.83 crore (US$478.9 million)(2024–25)[1]
Parent agency భారత హోం మంత్రిత్వ శాఖ

ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద భారతదేశపు అంతర్గత భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్ లను నిర్వహించే ఏజెన్సీ. దీన్ని 1887 లో సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్‌ పేరుతో స్థాపించారు. ఈ రకం సంస్థల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా పేరుపొందింది.[2][3]

1968 వరకు, ఇది దేశీయ, విదేశీ ఇంటెలిజెన్స్ రెండింటినీ నిర్వహించేది. ఆ తర్వాత విదేశీ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ను ఏర్పాటు చేసారు. అప్పటి నుండి, ఐబీకి ప్రధానంగా దేశీయ నిఘా, అంతర్గత భద్రతా పాత్రను కేటాయించారు.[4] 2022 జూన్ 24 న ఐబీ డైరెక్టరుగా తపన్ దేకా బాధ్యతలు స్వీకరించాడు.[5]

చరిత్ర

[మార్చు]

1885లో, మేజర్ జనరల్ చార్లెస్ మాక్‌గ్రెగర్ సిమ్లాలో భారత సైన్యానికి క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. తద్వారా దాని గూఢచార కార్యకలాపాలకు బాధ్యత వహించాడు. వాయవ్య దిశ నుండి భారతదేశంపై రాగల దాడిని నివారించడం, ఆఫ్ఘనిస్తాన్ సమీపంలో రష్యన్ దళాల మోహరింపులను పర్యవేక్షించడం ఆ సమయంలో ప్రభుత్వానికి ఉన్న ప్రధాన ఆందోళన.

ఐబీని 1887 డిసెంబరు 23 న సెక్రటరీ ఆఫ్ ఇండియా, సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్‌లోని ఉప-విభాగంగా రూపొందించారు. అయితే ఇందులో ఐబీ పనితీరుకు సంబంధించిన భారత పార్లమెంటు లేదా కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఎలాంటి చట్టం లేదు. 2013 లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఐబీ చట్టబద్ధతను సవాలు చేసారు.[6]

బాధ్యతలు

[మార్చు]

రహస్యంగా ఉండే ఐబీ, భారతదేశంలోని గూఢచార సమాచారాన్ని సేకరించేందుకూ కౌంటర్ ఇంటెలిజెన్స్ కార్యకలపాల పైన, కౌంటర్ టెర్రరిజం పనుల పైనా పనిచేస్తుంది. సంస్థలో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లేదా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS), సైనిక దళాలకు చెందిన ఉద్యోగులు ఉంటారు. అయితే, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ (ఐబీ డైరెక్టరు) ఎల్లప్పుడూ IPS అధికారే ఉంటారు. దేశీయ ఇంటెలిజెన్స్ బాధ్యతలతో పాటు ఐబీ, సరిహద్దు ప్రాంతాలలో గూఢచార సేకరణకు బాధ్యత వహిస్తుంది. 1951 నాటి హిమ్మత్ సింగ్ జీ కమిటీ (దీనిని ఉత్తర, ఈశాన్య సరిహద్దు కమిటీ అని కూడా పిలుస్తారు) సిఫార్సులను అనుసరించి, ఈ పనిని స్వాతంత్ర్యానికి ముందునుంచీ ఉన్న మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు అప్పగించారు.

భారతదేశంలోను, చుట్టుపక్కలా మానవ కార్యకలాపాలకు చెందిన అన్ని రంగాలు ఇంటెలిజెన్స్ బ్యూరో విధుల కిందికి వస్తాయి. 1951 నుండి 1968 లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏర్పడే వరకు ఐబీ బాహ్య గూఢచార బాధ్యతలను కూడా నిర్వహించింది.[7]

కార్యకలాపాలు, ఆపరేషన్లు

[మార్చు]

ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా విజయాలు సాధించింది. అయితే ఐబీ నిర్వహించే కార్యకలాపాలు చాలా అరుదుగా బహిర్గతమౌతాయి. ఏజెన్సీ చుట్టూ ఉన్న అత్యంత గోప్యత కారణంగా, దాని గురించి లేదా దాని కార్యకలాపాల గురించిన ఖచ్చితమైన సమాచారం చాలా తక్కువగా అందుబాటులో ఉంది. ఐబీ 1950 ల నుండి సోవియట్ యూనియన్ పతనం వరకు సోవియట్ KGB వద్ద శిక్షణ పొందింది.

ఐబి చేసే పని గురించి వెల్లడైనది చాలావరకు ఊహాజనితమే. చాలా సార్లు వారి కుటుంబ సభ్యులకు కూడా వారి ఆచూకీ తెలియదు. హ్యామ్ రేడియో ఔత్సాహికులకు లైసెన్సులను క్లియర్ చేయడం ఐబి గురించి తెలిసిన పనుల్లో ఒకటి. ఐబి ఇతర భారతీయ నిఘా సంస్థలకూ పోలీసులకూ నిఘా సమాచారాన్ని అందజేస్తుంది. భారత దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసే ముందు బ్యూరో వారికి అవసరమైన భద్రతా అనుమతులను కూడా మంజూరు చేస్తుంది. అరుదైన సందర్భాల్లో, సంక్షోభ సమయంలో ఐబి అధికారులు మీడియాతో సంభాషిస్తారు. ఐబి ప్రతిరోజూ సుమారు 6,000 లేఖలను అడ్డగించి తెరుస్తుందని కూడా పుకారు ఉంది. ఇది FBI యొక్క కార్నివోర్ వ్యవస్థ మాదిరిగానే ఐబీలో కూడా ఒక ఈమెయిల్ గూఢచారి వ్యవస్థ ఉంది.[8] వారెంట్ లేకుండా వైర్ ట్యాపింగ్ నిర్వహించడానికి బ్యూరోకు అధికారం ఉంది.[9]

ప్రారంభంలో ఐబీ భారతదేశ అంతర్గత బాహ్య గూఢచార సంస్థగా ఉండేది. 1962 నాటి భారత చైనా యుద్ధాన్ని అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో వైఫల్యం, ఆ తరువాత, 1965 భారత-పాకిస్తాన్ యుద్ధంలో వైఫల్యం కారణంగా, 1968 లో దాన్ని విభజించి, అంతర్గత గూఢచార బాధ్యతను మాత్రమే దానికి అప్పగించారు. బాహ్య గూఢచార కార్యకలాపాలను కొత్తగా సృష్టించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌కు అప్పగించారు.[10]

పోఖ్రాన్-II అణు పరీక్షలకు ముందు భారత అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు, కార్యకలాపాల గురించిన సమాచారాన్ని సేకరించకుండా CIA ను నిరోధించడానికి గాను ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.[11]

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఐబీ మిశ్రమ విజయాన్ని సాధించింది. ఉగ్రవాద మాడ్యూళ్లను ఛేదించడంలో ఐబీ విజయవంతమైందని 2008 లో నివేదించబడింది. ఇది హైదరాబాద్ పేలుళ్లకు ముందు పోలీసులను అప్రమత్తం చేసింది. 2008 నవంబరులో జరిగిన ముంబై దాడులకు ముందు సముద్రం గుండా ముంబైపై దాడి చేసే అవకాశం ఉందని పదే పదే హెచ్చరికలు చేసింది. అయితే, మొత్తం మీద, 2008 లో ఎడతెగని ఉగ్రదాడుల తర్వాత ఐబీ మీడియా నుండి పదునైన విమర్శలకు గురైంది. 2008 ముంబై దాడులకు దారితీసిన తీవ్రమైన లోపాల కారణంగా 26/11 దాడులు జరిగిన వెంటనే ప్రభుత్వం ఉన్నతస్థాయి ఇంటెలిజెన్స్ అధికారులను తొలగించడానికి సిద్ధపడింది.[12] రాజకీయాలు, నిధుల కొరత, ఫీల్డ్ ఏజెంట్ల కొరత ఏజెన్సీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఏజెన్సీ మొత్తం బలం దాదాపు 25,000 వరకు ఉంటుందని భావిస్తారు. మొత్తం దేశంలో 3500 వరకూ ఫీల్డ్ ఏజెంట్లు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది రాజకీయ గూఢచర్యంలో నిమగ్నమై ఉన్నారు.[13][14]

2014 నుండి, ఐబీ అనేక సంస్కరణలు, మార్పులకు గురైంది. అంతర్గత రాజకీయ గూఢచర్యానికి స్వస్తి పలకడం అతిపెద్ద సంస్కరణల్లో ఒకటి. ఏజెన్సీ తన మౌలిక సదుపాయాలను కూడా పెంచుకుని, మరింత మంది ఏజెంట్లను నియమించుకుంది.[15][16] గతంలో భారత్‌లో తరచూ జరుగుతున్న ఉగ్రదాడులను ఆపడంలో ఇది విజయవంతమైంది.[17] కౌంటర్ ఇంటెలిజెన్స్‌లో కూడా ఏజెన్సీ విజయం సాధించింది.

మీడియా చిత్రణ

[మార్చు]

ఇంటెలిజెన్స్ బ్యూరో బాద్ ఔర్ బద్నామ్ ( హిందీ, 1984), ముఖ్బీర్ ( హిందీ, 2008), వందే మాతరం ( తమిళం, 2010), కహానీ ( హిందీ, 2012), జిస్మ్ 2 ( హిందీ, 2012), ఇరు ముగన్ ( తమిళం, 2016), స్పైడర్ ( తమిళం, తెలుగు, 2017), ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ( హిందీ, 2019), ఐబీ71 వంటి చిత్రాలలో చోటు చేసుకుంది.

అమితాబ్ బచ్చన్ నటించిన సోనీ టీవీ సిరీస్ యుద్ధంలో కూడా ఐబీని చూపించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఫుట్ నోట్స్

[మార్చు]
  • "THE INDIAN POLICE SERVICE (UNIFORM) RULES". 1954. Archived from the original on 16 April 2009. Retrieved 13 September 2010.
  • "World Intelligence and Security Agencies". December 2006. Archived from the original on 5 June 2014. Retrieved 15 November 2015.

మూలాలు

[మార్చు]
  1. "Budget 2024: MHA gets Rs 2.19 trn; major chunk for CRPF, BSF, CISF". Business Standard.
  2. "Intelligence Bureau (IB) - India Intelligence Agencies". Fas.org. 30 May 2008. Archived from the original on 26 November 2012. Retrieved 9 December 2012.
  3. (2015-06-05). ""National Security" for whom?".
  4. (2015-06-05). ""National Security" for whom?".
  5. "Tapan Deka is new IB chief, RAW secretary Samant Goel gets 1-yr extension". Hindustantimes. 2022-06-24. Retrieved 2022-06-24.
  6. "Explain Intelligence Bureau's legality, HC tells Centre". The Times of India. 26 March 2012. Archived from the original on 10 May 2013.
  7. "Nehchal Sandhu new IB director". The Indian Express. 26 November 2010. Retrieved 27 March 2012.
  8. "Republic of India". Archived from the original on 3 December 2010.
  9. "The secret world of phone tapping". India Today. 9 December 2010. Retrieved 27 March 2012.
  10. Shaffer, Ryan. "Unraveling India's Foreign Intelligence: The Origins and Evolution of the Research and Analysis Wing".
  11. Richelson, Jeffrey (2007). "Pokhran Surprise". Spying on the Bomb: American Nuclear Intelligence from Nazi Germany to Iran and North Korea. W. W. Norton & Company. ISBN 9780393329827. India's success in preventing U.S. spy satellites from seeing signs of the planned tests days to weeks in advance was matched by its success in preventing acquisition of other types of intelligence. India's Intelligence Bureau ran an aggressive counterintelligence program, and the CIA, despite a large station in New Delhi, was unable to recruit a single Indian with information about the Vajpayee government's nuclear plans.
  12. "IB, R&AW brass almost got the sack after 26/11". Archived from the original on 17 July 2012.
  13. "New IB chief has his task cut out - Thaindian News". Thaindian.com. 9 December 2008. Archived from the original on 15 March 2010. Retrieved 10 August 2012.
  14. Sudha Ramachandran. "Security cracks and the remedy". Archived from the original on 6 January 2010.
  15. "1,800 Sashastra Seema Bal personnel to move to Intelligence Bureau". Economic Times. Retrieved 18 December 2018.
  16. "Immigration rush: Intelligence Bureau to hire 550 ex-CAPF personnel at airports". EconomicTimes. Retrieved 13 July 2018.
  17. "40 kilograms of explosives: Thwarting a nightmare at Pulwama". OneIndia. Retrieved 29 May 2020.