Jump to content

ధమ్మిక ప్రసాద్

వికీపీడియా నుండి
ధమ్మిక ప్రసాద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరియవాసం తిరానా గమగే ధమ్మిక ప్రసాద్
పుట్టిన తేదీ (1983-05-30) 1983 మే 30 (వయసు 41)
రాగమ, శ్రీలంక
మారుపేరుదమ్మి
ఎత్తు5 అ. 10 అం. (1.78 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 110)2008 ఆగస్టు 8 - ఇండియా తో
చివరి టెస్టు2015 అక్టోబరు 22 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 130)2006 ఫిబ్రవరి 25 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2015 జనవరి 25 - న్యూజీలాండ్ తో
ఏకైక T20I (క్యాప్ 41)2011 ఆగస్టు 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002/03–presentSinhalese Sports Club
Basnahira North
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I
మ్యాచ్‌లు 25 24 1
చేసిన పరుగులు 476 129
బ్యాటింగు సగటు 12.86 21.50
100s/50s 0/0 0/0
అత్యధిక స్కోరు 47 31*
వేసిన బంతులు 4,327 1,015 18
వికెట్లు 75 32 0
బౌలింగు సగటు 35.97 30.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/50 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 1/– 0/–
మూలం: Cricinfo, 2015 అక్టోబరు 26

కరియవాసం తిరానా గమగే ధమ్మిక ప్రసాద్ (జననం 1983, మే 30), శ్రీలంక మాజీ క్రికెటర్, నేపాల్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రస్తుత బౌలింగ్ కోచ్.[1] కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 క్రికెట్‌లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, బస్నాహిరా నార్త్ తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.[2]

చీలమండ, వెన్ను, స్నాయువులకు అనేక గాయాల కారణంగా ప్రసాద్ జట్టు నుండి నిరంతరం తొలగించబడేవాడు. 2015లో వెస్టిండీస్ పర్యటన తర్వాత ఎలాంటి క్రికెట్ ఆడలేదు.[3][4][5] 2021 ఫిబ్రవరిలో 37 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[6][7]

దేశీయ క్రికెట్

[మార్చు]

టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ ఆడటం ప్రారంభించిన ప్రసాద్ ఆ తరువాత ఫాస్ట్ బౌలర్ గా మారాడు. 2002 అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2006 ఫిబ్రవరిలో దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వికెట్‌కు సగటున 23 పరుగుల కంటే తక్కువ చొప్పున బౌలింగ్ చేసిన తర్వాత అతను బంగ్లాదేశ్ పర్యటన కోసం శ్రీలంక వన్డే, టెస్ట్ స్క్వాడ్‌లకు ఎంపికయ్యాడు.[8] ఆ పర్యటనలో తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌పై 78 పరుగుల తేడాతో 2/29తో విజయం సాధించాడు.[2][9]

2008 ఆగస్టు శ్రీలంక పర్యటనలో భారత్ పై మూడవ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. అందులో అతని అభిమాన ఆటగాడు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ అని ప్రసాద్ పేర్కొన్నాడు.[10][11] తరువాతి సీజన్లలో అతను టెస్టు క్రికెట్‌ను అప్పుడప్పుడు ఆడాడు. 2008 డిసెంబరులో శ్రీలంక బంగ్లాదేశ్ పర్యటనలో మొదటి టెస్ట్‌లో ఇతను నాలుగు వికెట్లు పడగొట్టాడు, కానీ రెండో టెస్ట్‌లో తొలగించబడ్డాడు.[12][13]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ప్రసాద్ కందానాలోని డి మజినోడ్ కళాశాలలో చదివాడు. అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.[14] నిహారీ కరియవాసమ్‌ను వివాహం చేసుకున్నాడు.[15] 2016 ఆగస్టు 24న తన ట్విట్టర్ ఖాతాలో తాను, తన భార్య ఒక మగబిడ్డకు తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించాడు.[16]

మూలాలు

[మార్చు]
  1. "नेपालको बलिङ कन्सलटेन्टमा धम्मिका प्रसाद नियुक्त". Online Khabar. Retrieved 2023-08-30.
  2. 2.0 2.1 "Dhammika Prasad: Sri Lanka". ESPNcricinfo. Retrieved 2023-08-30.
  3. "Uncapped Fernando to replace injured Prasad". ESPNcricinfo. Retrieved 2023-08-30.
  4. "Injured Prasad ruled out of first Test". ESPNcricinfo. Retrieved 2023-08-30.
  5. "Ford concerned about Sri Lanka's fast-bowling depth". ESPNcricinfo. Retrieved 2023-08-30.
  6. "Dhammika Prasad retires from International Cricket, will play cricket series in India next month". NewsWire. 2021-02-18. Archived from the original on 2023-08-30. Retrieved 2023-08-30.
  7. "Dhammika Prasad retires from International cricket". Bdcrictime. 2021-02-18. Retrieved 2023-08-30.
  8. Sa'adi Thawfeeq (16 February 2006). "Pace rookie Prasad only newcomer for Bangladesh". Daily News (Sri Lanka). Archived from the original on 4 August 2012. Retrieved 2023-08-30.
  9. "Sri Lanka tour of Bangladesh, 2005/06: 3rd ODI – scorecard". ESPNcricinfo. Retrieved 2023-08-30.
  10. "Sachin's wicket was special: Prasad". Sify Sports. 8 August 2008. Archived from the original on 11 April 2017. Retrieved 2023-08-30.
  11. "India tour of Sri Lanka, 2008 – 3rd Test: scorecard". ESPNcricinfo. Retrieved 2023-08-30.
  12. "Sri Lanka tour of Bangladesh, 2008/09 – 1st Test: scorecard". ESPNcricinfo. Retrieved 2023-08-30.
  13. "Sri Lanka wins toss, bats vs. Bangladesh". The Hindu. 3 January 2009. Archived from the original on 25 January 2013. Retrieved 2023-08-30.
  14. "Three grounds help De Mazenod to keep their profile in sports". The Sunday Times (Sri Lanka). 12 June 2011.
  15. "Dhammika Prasad's wedding photos". Island Cricket. 17 April 2011. Archived from the original on 8 January 2017. Retrieved 2023-08-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  16. @imDhammika (24 August 2016). "We ar blessed with baby boy few minutes to go. Really happy. Thanks almighty God. Thanks my dear loving wify. Love u a lot. May god bless u." (Tweet) – via Twitter.

బాహ్య లింకులు

[మార్చు]