Jump to content

దేవరాజు నాగార్జున

వికీపీడియా నుండి
దేవరాజు నాగార్జున
దేవరాజు నాగార్జున


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 ఫిబ్రవరి 3 - 2023 ఏప్రిల్ 6
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌
పదవీ కాలం
2021 అక్టోబరు 18 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1962-08-15) 1962 ఆగస్టు 15 (వయసు 62)
వనపర్తి, వనపర్తి జిల్లా, తెలంగాణ

దేవరాజు నాగార్జున, తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి. 2022, ఫిబ్రవరి 3న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[1][2]

జస్టిస్‌ దేవరాజు నాగార్జునను తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీఈఆర్‌సీ) చైర్మన్‌గా నియమిస్తూ 2024 అక్టోబర్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3][4]

జననం, విద్య

[మార్చు]

నాగార్జున 1962, ఆగస్టు 15న రామకృష్ణారావు - విమలాదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాలోని వనపర్తి పట్టణంలో జన్మించాడు. వనపర్తిలోని ఆర్ఎల్డీ కళాశాలలోబీఎస్సీ డిగ్రీ, గుల్బర్గా ఎస్ఎస్ఎల్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందాడు. గుల్బర్గాలో ఎంఎల్ పూర్తిచేసి, కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎ చేశాడు. ఆ తరువాత హైదరాబాదులో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్ పూర్తి చేశాడు.[5]

వృత్తిరంగం

[మార్చు]

1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యాక వనపర్తి కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించాడు. 1991 మే 1న జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2004లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందాడు. అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేశాడు. కొంతకాలంపాటు ఏపీ పోలీస్‌ అకాడమీకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడు.

2010లో జిల్లా జడ్జిగా, 2015లో హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌)గా, హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)గా, మధ్యలో కొద్దిరోజులు ఎంఎస్‌జేగా పదవులు నిర్వర్తించాడు. 2021 అక్టోబరు 18 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా ఉన్నాడు.[6] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[7]

ఇతర వివరాలు

[మార్చు]

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ ఏర్పాటులో అత్యంత కీలకపాత్ర పోషించాడు. 2021 డిసెంబరులో జరిగిన సెంటర్‌ ప్రారంభోత్సవ వేడుకలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్.వి. రమణ నాగార్జున సేవల గురించి ప్రశంసించాడు.

మూలాలు

[మార్చు]
  1. Vamshidhara, Vujjini (2022-02-02). "SC Collegium okays 7 advocates. 5 judicial officers as Telangana HC judges". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
  2. Andhrajyothy (8 October 2024). "టీజీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున్‌!". Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  3. NT News (29 October 2024). "ఈఆర్సీ నూతన చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున". Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
  4. "ఈఆర్‌సీ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున ప్రమాణస్వీకారం". 31 October 2024. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
  5. "Telangana High Court: హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు". EENADU. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
  6. telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
  7. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.