Jump to content

దినుకా హెట్టియారాచ్చి

వికీపీడియా నుండి
దినుకా హెట్టియారాచ్చి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దినుక్ సులక్షణ హెట్టియారాచ్చి
పుట్టిన తేదీJuly 15, 1976 (1976-07-15) (age 48)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 86)2001 మార్చి 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 1 234 136 19
చేసిన పరుగులు 1,691 377 51
బ్యాటింగు సగటు 9.55 7.69 8.50
100లు/50లు 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 48* 33 25
వేసిన బంతులు 162 46,465 5,991 317
వికెట్లు 2 1,000 208 26
బౌలింగు సగటు 20.50 23.54 19.08 11.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 71 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 18 0 0
అత్యుత్తమ బౌలింగు 2/36 8/26 6/43 3/0
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 55/– 15/– 1/–
మూలం: ESPNcricinfo, 2017 మార్చి 31

దినుకా హెట్టియారాచ్చి, శ్రీలంక మాజీ టెస్ట్ క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా రాణించాడు. 2001 నుండి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడనప్పటికీ, శ్రీలంక దేశీయ సీజన్‌లలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు. 234 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో సరిగ్గా 1,000 వికెట్లు తీశాడు. ముత్తయ్య మురళీధరన్, రంగనా హెరాత్ తర్వాత మైలురాయిని సాధించిన శ్రీలంక మూడవ బౌలర్ గా రికార్డు సాధించాడు.

జననం

[మార్చు]

దినుకా హెట్టియారాచ్చి 1976, జూలై 15న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[2]

దేశీయ క్రికెట్

[మార్చు]

1995లో తమిళ్ యూనియన్ తరపున క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అండర్-13 నుండి అండర్-19 వరకు, సీనియర్ స్థాయివరకు ప్రతి స్థాయిలో క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్లు, ఇన్వెంటివ్ బ్యాటింగ్ తో కొలంబో కోల్ట్స్‌లో రాణించాడు. అయిన్నప్పటికీ సెలెక్టర్లు హెరాత్, నిరోషన్ బండారతిల్లెకే వైపు మొగ్గు చూపారు. 2004, ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

1997 శ్రీలంక పర్యటనలో, 1998 దక్షిణాఫ్రికా పర్యటనలో, 1999లో అబుదాబిలో పాకిస్థాన్‌తో జరిగిన ట్రై-సిరీస్‌లో హెట్టియారాచ్చికి అవకాశం లభించింది. జింబాబ్వేతో ఆడిన తరువాత దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లతో ఆడటానికి ఎంపికయ్యాడు. 2001లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో తన ఏకైక టెస్టు మ్యాచ్ లో ఆడాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Dinuka Hettiarachchi Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  2. "Dinuka Hettiarachchi Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  3. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-18.
  4. "SL vs ENG, England tour of Sri Lanka 2000/01, 3rd Test at Colombo, March 15 - 17, 2001 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.

బాహ్య లింకులు

[మార్చు]