Jump to content

దిక్కులు చూడకు రామయ్య

వికీపీడియా నుండి
దిక్కులు చూడకు రామయ్య[1]
దస్త్రం:Dikkulu Chudaku Ramaiah.jpg
దర్శకత్వంత్రికోటి
రచనత్రికోటి
నిర్మాతకొర్రపాటి సాయి
తారాగణంఅజయ్ (నటుడు)
ఇంద్రజ
నాగ సౌర్య
సనా ఖాన్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
విడుదల తేదీ
అక్టోబరు 10, 2014
భాషతెలుగు

దిక్కులు చూడకు రామయ్య 2014 అక్టోబరు 10న విడుదలైన తెలుగు సినిమా. ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన త్రికోటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమాపు పరిచయమయ్యాడు.[2]

చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు వంటి బరువు బాధ్యతలతో యవ్వనం అంతా వృధా పోవడంతో... ఒక అమ్మాయిని ప్రేమించాలి... ఆ ప్రేమ అనే అనుభూతిని ఆస్వాదించాలి అనే కోరికలు అలాగే మిగిలిపోతాయి గోపాలకృష్ణకి (అజయ్‌). బ్యాంక్‌ ఉద్యోగి అయిన గోపాలకృష్ణ తన వద్దకి లోన్‌ కోసం వచ్చే అమ్మాయిల్ని ట్రాప్‌ చేయాలని చూస్తుంటాడు. అలానే అతనికి ఒక లిటిగేషన్‌లో ఇరుక్కున్న సంహిత (సన) తారసపడుతుంది. ఆమెకి సాయం చేసే నెపంతో దగ్గరవుతాడు. తన వయసుకి ఇంకా ముప్పయ్యేనని, పెళ్లి కాలేదని నమ్మబలికి... ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. ఇదిలావుంటే... గోపాలకృష్ణ పెద్ద కొడుకు మధు (నాగ శౌర్య) కూడా సంహితని చూసి మనసు పడతాడు. తనకంటే వయసులో రెండేళ్లు పెద్దదే అయినా కానీ ఆమెని ప్రేమించేస్తుంటాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయినే తన తండ్రి కూడా ఇష్టపడుతున్నాడని తెలుసుకున్నాక మధు ఏం చేస్తాడు? ఇదే మిగిలిన కథ.[3][4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం - త్రికోటి
  • నిర్మాత - కొర్రపాటి సాయి
  • సంగీతం - ఎం. ఎం. కీరవాణి

సంగీతం

[మార్చు]

దింతనా, రచన: ఎం ఎం కీరవాణి, గానం. రాహూల్ సింప్లీ గంజ్, ఫీట్

చెంబిస్త్రీ , రచన: ఎం ఎం కీరవాణి, గానం.. ఫీట్, రేవంత్

తేలిపోతున్నా , రచన: ఎం ఎం కీరవాణి, గానం.ఫీట్ , రమ్య బెహరా

అంతే ప్రేమంతే , రచన: ఎం ఎం కీరవాణి, గానం.ఫీట్ , కాలభైరవ, మోహన భోగరాజు

అందరి రాతలు , రచన: ఎం ఎం కీరవాణి, గానం.ఫీట్ , రమేష్ వినాయగం , యామిని

దిక్కులు చూడకు రామయ్య, రచన: ఎం ఎం కీరవాణి, గానం.ఫీట్, కల్పన.

ప్రశంసలు

[మార్చు]

‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ 2014 అక్టోబరు 12, ఆదివారం నాడు ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ తన కుటుంబసభ్యులతో కలసి చూశారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు త్రికోటిని, నిర్మాత సాయి కొర్రపాటిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలి కాలంలో నేను చూసిన మంచి చిత్రమిది. ఇందులో తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని దర్శకుడు త్రికోటి తెరపై చూపించిన తీరు నన్ను కదలించింది. వారాహి బేనరు నుంచి వచ్చేవన్నీ మంచి సినిమాలే అని నిర్మాత సాయి కొర్రపాటి నిరూపిస్తున్నారు. అజయ్‌, నాగశౌర్య నటన బాగుంది’ అన్నారు. [5]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-13. Retrieved 2014-10-10.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-11. Retrieved 2014-10-10.
  3. http://www.123telugu.com/reviews/dikkulu-chudaku-ramayya-telugu-movie-review.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-11. Retrieved 2014-10-10.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-14. Retrieved 2014-10-14.