దర్శన్ సింగ్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్శన్ సింగ్ చౌదరి
దర్శన్ సింగ్ చౌదరి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 (2024-06-04)
ముందు ఉదయ్ ప్రతాప్ సింగ్
నియోజకవర్గం హోషంగాబాద్
ఆధిక్యత 431,696 (64.99%)

రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా

వ్యక్తిగత వివరాలు

జననం (1977-10-14) 1977 అక్టోబరు 14 (వయసు 46)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2017–ప్రస్తుతం)
నివాసం చందోన్ గ్రామం, బంఖెడి నర్మదాపురం
పూర్వ విద్యార్థి ప్రభుత్వ హమీదియా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల, భోపాల్ , జవహర్ నవోదయ విద్యాలయం , నర్మదాపురం
వృత్తి రాజకీయ నాయకుడు

దర్శన్ సింగ్ చౌదరి (జననం 14 అక్టోబర్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హోషంగాబాద్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దర్శన్ సింగ్ చౌదరి రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్‌ను స్థాపించి, కార్మికులను రైతులతో అనుసంధానించాడు. ఆయన రైతుల హక్కుల కోసం పోరాడుతూ న్యాయ పోరాటం చేస్తూ 7 సార్లు జైలుకు కూడా వెళ్లాడు. దర్శన్ సింగ్ చౌదరి 2017లో భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మధ్యప్రదేశ్ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.

దర్శన్ సింగ్ చౌదరి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హోషంగాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మపై 431696 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Hoshangabad". Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "नर्मदापुरम लोकसभा सीट से जीतने वाले BJP के दर्शन सिंह चौधरी कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. TimelineDaily (5 March 2024). "BJP Nominates Kisan Morcha Leader Darshan Singh Chaudhary For Hoshangabad Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.