త్రిపుర సుందరి
స్వరూపం
త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత , రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము. సాక్ష్యాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావు షోడసి అని వ్యవహరిస్తారు.
వ్యుత్పత్తి
[మార్చు]త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.
అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో
- ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.
- * స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.
- * సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.
- * పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది.
- శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.
- * ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి
- * జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి
- * క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి
- ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే
లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి, లయలు దేవి యొక్క ఆటలు.
చిత్రమాలిక
[మార్చు]-
19వ శతాబ్దములో చిత్రీకరించబడ్డ త్రిపుర సుందరి యొక్క పటము
-
కుమారులైన గణేశుడు, స్కందునితో లలితా దేవి. ఒరిస్సా కి చెందిన ఈ శిల్పము 11వ శతాబ్దానికి చెందినది. ప్రస్తుతము బ్రిటీషు మ్యూజియంలో ఉన్నది
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- https://web.archive.org/web/20150320141304/http://www.shivashakti.com/tripura.htm
- Brooks, Douglas R. (1990). The Secret of the Three Cities: An Introduction to Hindu Sakta Tantrism. Chicago & London: The University of Chicago Press. p. 80.
- Brooks, Douglas R. (1990). The Secret of the Three Cities: An Introduction to Hindu Sakta Tantrism. Chicago & London: The University of Chicago Press. p. 97.
- Brooks, Douglas R. (1990). The Secret of the Three Cities: An Introduction to Hindu Sakta Tantrism. Chicago & London: The University of Chicago Press., 103.
- Brooks, Douglas R. (1990), The Secret of the Three Cities: An Introduction to Hindu Sakta Tantrism, Chicago & London: University of Chicago Press
- Brooks, Douglas R. (1992), Auspicious Wisdom, Albany: State University of New York Press
- Kinsley, David (1997), Tantric Visions of the Divine Feminine: The Ten Mahavidyas, New Delhi: Motilal Banarsidass, ISBN 978-0-520-20499-7
- books released by Sathguru sri seshadri swamigal brindavanam trust ( regd) web site:www.seshadri.info
ఇతర పఠనాలు
[మార్చు]- Kinsley, David. Hindu Goddesses: Vision of the Divine Feminine in the Hindu Religious Traditions. Berkeley: University of California Press, 1998.
- Dikshitar, V.R. Ramachandra. The Lalita Cult. Delhi: Motilal Banarsidass Publishers Pvt Ltd, 1991.