తోలుబొమ్మలాట (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోలుబొమ్మలాట
తోలుబొమ్మలాట సినిమా పోస్టర్
దర్శకత్వంవిశ్వనాథ్ మాగంటి
రచనవిశ్వనాథ్ మాగంటి
(కథ/స్ర్కీన్ ప్లే/మాటలు)
నిర్మాతమాగంటి దుర్గా ప్రసాద్
తారాగణంరాజేంద్ర ప్రసాద్
వెన్నెల కిశోర్
విశ్వంత్ దుద్దుంపూడి
హర్షితా చౌదరి
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
సుమ దుర్గా క్రియేషన్స్[1]
విడుదల తేదీ
22 నవంబరు 2019
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తోలుబొమ్మలాట, 2019 నవంబరు 22న విడుదలైన తెలుగు సినిమా. సుమ దుర్గా క్రియేషన్స్[2] బ్యానరులో మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించాడు.[3] ఇందులో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, విశ్వంత్ దుద్దుంపూడి, హర్షితా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా,[4][5] సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చాడు.[6][7][8]

కథా నేపథ్యం

[మార్చు]

సోమరాజు/సోడాల రాజు (రాజేంద్ర ప్రసాద్)కు ఒక గ్రామంలో ఎంతో గౌరవం ఉంటుంది. అతను గ్రామస్తులతో కలిసి తన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. అతని కుమారుడు మురళి (దేవి ప్రసాద్), కుమార్తె జానకి (కల్పన) అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి చూసి వెలుతుంటారు. మనవడు రుషి (విశ్వం దుద్దంపూడి), మనవరాలు వర్ష (హర్షిత) ప్రేమ విషయం గురించి సోమరాజుకు చెప్పి, పెళ్ళి చేసే బాధ్యతను అతనికి అప్పగిస్తారు. సోమరాజు తన పిల్లలను ఒప్పిస్తాడు. అనుకోకుండా, ఆస్తి కోసం పెద్దల మధ్య జరిగిన గొడవలో సోమరాజు చనిపోతాడు. సోమరాజు ఆత్మ 12వ రోజు వేడుక పూర్తయ్యే వరకు వారి చుట్టూ తిరుగుతూ, తన కుటుంబ సభ్యుల నిజ స్వరూపాన్ని చూసి నిరాశకు లోనవుతుంది. ఆ సమయంలో, సోమరాజు తన దూరపు బంధువు సంతోష్ (వెన్నెల కిషోర్) కలుస్తాడు. సంతోష్ కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంటుంది. తన సహకారంతో, సోమరాజు పథకం చేస్తాడు. దాని ద్వారా కుటుంబంలో ఉన్న అసమ్మతిని, రిషి-వర్ష మధ్య విభేదాలను తొలగిస్తాడు. 12వ రోజు తరువాత సోమరాజు ఆత్మ వెళ్ళిపోతుంది.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled

ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా, పాటలను చైతన్య ప్రసాద్ రాశాడు. ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ ద్వారా సంగీతం విడుదల చేయబడింది.[9]

సం.పాటగాయకులుపాట నిడివి
1."గొప్పదిరా మనిషి పుట్టుక"విజయ్ యేసుదాస్4:19
2."మనసా మనసా (మేల్ వర్షన్)"సిద్ శ్రీరామ్3:14
3."ఆకాశమా"హేమచంద్ర3:58
4."మనసా మనసా (ఫిమేల్ వర్షన్)"చిన్మయి3:13
5."నీతో పోటి పడుతూ"యాజిన్ నిజార్2:56
6."మనసారా మనసారా (డ్యూయెట్)"సిద్ శ్రీరామ్, చిన్మయి3:12
7."ఎన్నెన్నో అందాలు"అనురాగ్ కులకర్ణి3:54
మొత్తం నిడివి:19:50

మూలాలు

[మార్చు]
  1. Chowdhary, Y Sunita (22 November 2019). "Tholu Bommalata' movie review: Heart-warming and entertaining". The Hindu. Retrieved 17 February 2021.
  2. "Tholu Bommalata – Old School Emotions". 123 telugu.com. Retrieved 17 February 2021.
  3. "Tholu Bommalata (Director)". indiaglitz. Retrieved 17 February 2021.
  4. "Tholu Bommalata (Overview)". Filmibeat. Retrieved 17 February 2021.
  5. "Tholu Bommalata Review – A Very Sincere But Boring Attempt". Mirchi9.com. Retrieved 17 February 2021.
  6. "Tholu Bommalata (Music)". Tollywood.Net. Retrieved 17 February 2021.
  7. "తోలుబొమ్మలాట మూవీ రివ్యూ". The Times of India. Retrieved 17 February 2021.
  8. "'తోలుబొమ్మలాట' మూవీ రివ్యూ". Sakshi.com. Retrieved 17 February 2021.
  9. "Tholu Bommalata (Songs)". gaana.com. Retrieved 17 February 2021.