Jump to content

తైదల అంజయ్య

వికీపీడియా నుండి
తైదల అంజయ్య
జననంతైదల అంజయ్య
జులై 6, 1975
India కరీంనగర్ జిల్లా, కోహెడ మండలం, నాగసముద్రాల గ్రామం, తెలంగాణ
నివాస ప్రాంతంకోహెడ మండలం, నాగసముద్రాల గ్రామం, తెలంగాణ
వృత్తికవి, రచయిత.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2021, ఏప్రిల్ 3న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ చేత సత్కారం అందుకుంటున్న తైదల అంజయ్య

తైదల అంజయ్య (జననం: జులై 6, 1975) తెలంగాణ కు చెందిన కవి, రచయిత.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

తైదల అంజయ్య 1975, జులై 6 న ఆనాటి కరీంనగర్ జిల్లా, కోహెడ మండలం లోని నాగసముద్రాల గ్రామం లో మల్లవ్వ, రాజయ్య దంపతులకు జన్మించారు. చిన్నపటి నుండే సాహిత్యం పై మక్కువ పెంచుకున్నారు. యం ఎస్సి(ఫిజిక్స్ ) బీఈడీ , యం ఏ (తెలుగు) లో పట్టభద్రులు అయ్యారు. [1]

జీవిత విశేషాలు

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న తైదల అంజయ్య

డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారి రచనకు, సాహిత్యానికి ఆకర్షితులయ్యారు. వార్త, ఆంధ్రజ్యోతి, సూర్య తదితర పత్రికల్లో ఇతని కవితలు ప్రచురితమయ్యాయి . చిక్కనవుతున్న పాట అనే కవిత సంకలనం లో ఇతను రచించిన కవిత చాటింపు పేరుతో ప్రచురితమైనది. 2006 లో వెలువరించిన పునాస కవిత సంపుటానికి రంజని కుందుర్తి ప్రశంసా పత్రం అందుకున్నారు. మంజీరా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. [2]

కవిత సంపుటాలు

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న తైదల అంజయ్య
  • పునాస - 2006
  • ఎర్రమట్టిబండి - 2012

రచనలు

[మార్చు]
  • చాటింపు
  • పొక్కిలి
  • మత్తడి
  • ఎడపాయాలు

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తైదల అంజయ్య. "తైదల అంజయ్య". www.sakshi.com. సాక్షి. Retrieved 8 November 2017.
  2. తైదల అంజయ్య. "పీడిత-ప్రజల-పక్షపాతి". తెలంగాణ మాస పత్రిక. Retrieved 8 November 2017.