Jump to content

తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2019)

వికీపీడియా నుండి
సాహితీ పురస్కారాలు (2019)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2018
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2018సాహితీ పురస్కారాలు (2019)2020

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2019 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపిక చేసిన 10 ఉత్తమ గ్రంథాల వివరాలు 2022 జూన్ 13న ప్రకటించబడ్డాయి.[3] 2022, జూలై 7వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన ఆచార్య ఆర్‌.లింబాద్రి ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[4] ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, జె.ఎన్.టి.యూ. ఉపకులపతి డా. కట్టా నర్సింహారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి సాయన్న, తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్‌, రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.[5]

క్రమ

సంఖ్య

గ్రంథం పేరు గ్రంథకర్త పేరు ప్రక్రియ దాత
1 రహస్యభూతము డా. ఎం. పురుషోత్తమాచార్యులు పద్య కవిత
2 ఆకాశం కోల్పోయిన పక్షి కృష్ణారావు వచన కవిత
3 ఈ అడమి మాది ఎం. కష్ణకుమారి బాల సాహిత్యం
4 తప్ష డా. సిద్దెంకి యాదగిరి కథానిక
5 కాలనాళిక రామా చంద్రమౌళి కథా సంపుటి, నవల
6 అక్షరన్యాసం ప్రొ. జి. చెన్నకేశవరెడ్డి నవల, సాహిత్య విమర్శ
7 అశోకపథం చిట్టిప్రోలు వెంకటరత్నం నాటకం/నాటిక
8 రాధాకృష్ణన్ జీవిత చరిత్ర టంకశాల అశోక్ అనువాదం
9 అవని జయరాజు వచన రచన
10 అమ్మ బంగారు కల అనురాధ సుజలగంటి రచయిత్రి ఉత్తమ గ్రంథం

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 2023-01-27.
  2. "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు". EENADU. 2022-07-31. Archived from the original on 2022-08-06. Retrieved 2023-01-27.
  3. "2019కి తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". EENADU. 2022-07-14. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.
  4. telugu, NT News (2022-07-08). "సమాజాన్ని జాగృతం చేసిన రచయితలకు సత్కారం". www.ntnews.com. Archived from the original on 2022-07-08. Retrieved 2023-08-24.
  5. "తెలుగు వర్సిటీ-2019 సాహితీ పురస్కారాల ప్రదానం.. సీనియర్ జర్నలిస్టు కృష్ణారావుకు పురస్కారం". Prabha News. 2022-07-07. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.