తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2018)
సాహితీ పురస్కారాలు (2018) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు | |
వ్యవస్థాపిత | 1990 | |
మొదటి బహూకరణ | 1990 | |
క్రితం బహూకరణ | 2017 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 20,116 | |
Award Rank | ||
2017 ← సాహితీ పురస్కారాలు (2018) → 2019 |
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]
1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]
పురస్కార గ్రహీతలు
[మార్చు]2018 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపిక చేసిన 10 ఉత్తమ గ్రంథాల వివరాలు 2021 అక్టోరు 21న ప్రకటించబడ్డాయి.[3] 2021, అక్టోబరు 29వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[4] ఈ కార్యక్రమంలో మణిపూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తిరుపతిరావు, ఆచార్య కొలకలూరి ఇనాక్, మేడ్చెల్ జిల్లా అదనపు కలెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.[5]
క్రమ
సంఖ్య |
గ్రంథం పేరు | గ్రంథకర్త పేరు | ప్రక్రియ | దాత |
---|---|---|---|---|
1 | శ్రీకృష్ణదేవరాయ విజయప్రబంధము | మొవ్వ వృషాద్రిపతి | పద్య కవిత | |
2 | కల ఇంకా మిగిలే ఉంది | కాంచనపల్లి గోవర్ధన్ రాజు | వచన కవిత | |
3 | పాటల పల్లకి | సామిలేటి లింగమూర్తి | బాల సాహిత్యం | |
4 | ఖాకీకలం | రావులపాటి సీతారాంరావు | కథానిక | |
5 | కొంగవాలు కత్తి | డా. గడ్డం మోహన్ రావు | కథా సంపుటి, నవల | |
6 | సీమకథ అస్తిత్వం | డా. కిన్నెర శ్రీదేవి | నవల, సాహిత్య విమర్శ | |
7 | అశ్శరభ శరభ | ఎస్. నారాయణబాబు | నాటకం/నాటిక | |
8 | అశుద్ధ భారత్ | కె. సజయ | అనువాదం | |
9 | హైదరాబాద్ నుంచి తెలంగాణ దాకా | లక్ష్మణరావు | వచన రచన | |
10 | రేలపూలు | సమ్మెట ఉమాదేవి | రచయిత్రి ఉత్తమ గ్రంథం |
ఇవికూడా చూడండి
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయం
- కీర్తి పురస్కారాలు
- ప్రతిభా పురస్కారాలు
- సాహితీ పురస్కారాలు
- విశిష్ట పురస్కారాలు
- రంగస్థల యువ పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 2023-01-26.
- ↑ "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు". EENADU. 2022-07-31. Archived from the original on 2022-08-06. Retrieved 2023-01-27.
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన". EENADU. 2021-10-22. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.
- ↑ "Best Novel Award: కొంగవాలు కత్తి నవలను ఎవరు రచించారు?". Sakshi Education. 2021-10-23. Archived from the original on 2021-10-27. Retrieved 2023-01-27.
- ↑ "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". EENADU. 2021-10-30. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.