Jump to content

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం

వికీపీడియా నుండి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం
తెలంగాణ ప్రభుత్వ లోగో
ప్రభుత్వ సంస్థ అవలోకనం
స్థాపనం 29 డిసెంబరు 2017; 6 సంవత్సరాల క్రితం (2017-12-29)
అధికార పరిధి తెలంగాణ
ప్రధాన కార్యాలయం తెలంగాణ సచివాలయం, హైదరాబాదు
Minister responsible మల్లు భట్టివిక్రమార్క, (తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి)
మాతృ శాఖ తెలంగాణ ఆర్థిక శాఖ
వెబ్‌సైటు
అధికారిక వెబ్సైటు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన ఒక విభాగం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు అందించాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లను రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయడానికి ఈ సంఘం ఏర్పాటుచేయబడింది.[1]

ప్రారంభం

[మార్చు]

2017 డిసెంబరు 29న ప్రభుత్వం ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేసింది.[2]

విధులు

[మార్చు]
  • రాష్ట్రంలోని పంచాయతీల ఆర్థిక వనరులను పెంచేందుకు తగిన సిఫారసులు చేయడం
  • రాష్ట్రవ్యాప్తంగా సమర్ధవంతమైన అభివృద్ధి కార్యకలాపాల కోసం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మరిన్ని ఆర్థిక వనరులను అందజేయడానికి అవసరమైన చర్యలను సూచించడం

అయితే, ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలన్న నియమమేదిలేదు. ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు.

పరిపాలన

[మార్చు]

2017 డిసెంబరు 29న మాజీ మంత్రి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గొడిశెల రాజేశం గౌడ్ ఆర్థిక సంఘ తొలి చైర్మన్‌గానూ, రంగారెడ్డి జిల్లా కొత్తపల్లికి చెందిన రిటైర్డు జడ్పీ సిఇఓ మొండ్యాగు చెన్నయ్య కురమ సభ్యుడిగా నియమించబడ్డారు.[3][4]

2023 జూలై 6న మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి ఈ సంఘ చైర్మన్‌గానూ, గోసుల శ్రీనివాస్ యాదవ్, మొహమ్మద్ సలీంలు సభ్యులుగా నియమించబడ్డారు.[5]

సిరిసిల్ల రాజయ్యను 2024 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.[6] ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా వికారాబాద్ నుంచి మల్కూడ్ రమేష్, సూర్యాపేట నుంచి సంకెపల్లి సుధీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి నెహ్రూనాయక్ మాలోతు నియమితులయ్యారు.

మూలాలు

[మార్చు]
  1. Reddy, Suhasini (2020-02-05). "Hyderabad: Telangana State Finance Commission held a meeting with the newly elected Mayors on Wednesday". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
  2. "G Rajesham Goud to head Telangana State Finance Commission". The New Indian Express. 2017-12-29. Archived from the original on 2018-09-28. Retrieved 2023-07-07.
  3. "G Rajesham Goud to head Telangana State Finance Commission". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
  4. "రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా రాజేశంగౌడ్". andhrabhoomi.net. Archived from the original on 2022-02-26. Retrieved 2023-07-07.
  5. "వివిధ కమిషన్లకు ఛైర్మన్ల నియామకం". EENADU. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
  6. A. B. P. Desam (16 February 2024). "తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.

బయటి లంకెలు

[మార్చు]