తెలంగాణ పోలీసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ
తెలంగాణ రాష్ట్ర పోలీసు లోగో
తెలంగాణ రాష్ట్ర పోలీసు బ్యాడ్జి
మామూలుగా పిలిచే పేరుతెలంగాణ పోలీసు శాఖ
పొడిపదాలుటి.ఎస్.పి.
నినాదంకర్తవ్యం, గౌరవం, కరుణ
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటు2 జూన్ 2014
(10 సంవత్సరాల క్రితం)
 (2014-06-02), హైదరాబాదు
పూర్వజ సంస్థ
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు
ఉద్యోగులు50,000
వార్షిక బడ్జెట్టు4,621 crore (US$580 million) (2019-20 est.)[1]
అధికార పరిధి నిర్మాణం
కార్యకలాపాల అధికార పరిధితెలంగాణ, భారతదేశం
తెలంగాణ పోలీసు అధికార పరిధి
పరిమాణం114,840 చదరపు కిలోమీటర్లు (44,340 చ. మై.)
జనాభా35,193,978
చట్టపరమైన అధికార పరిధితెలంగాణ రాష్ట్రం
పరిపాలన సంస్థతెలంగాణ ప్రభుత్వం
సాధారణ స్వభావం
కార్యాచరణ నిర్మాణం
స్థూలంగా పరిశీలించేదితెలంగాణ ప్రభుత్వం
ప్రధాన కార్యాలయంసైఫాబాద్, హైదరాబాదు -500004
బాధ్యత వహించే Elected officer
  • రేవంత్ రెడ్డి
ఏజెన్సీ అధికారులు
మాతృ ఏజెన్సీహోం శాఖ, తెలంగాణ ప్రభుత్వం
పిల్ల agencies
చట్ట అమలుతెలంగాణ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్
Facilities
పోలీసు స్టేషన్లుs709
కార్లుమహేంద్ర బొలేరో 44,[2] టయోట ఇన్నోవా ~20
మోటర్ సైకిల్స్హీరో మోటోకార్ప్ 50[3]
జీపులురక్షక్ జీపులు ~50
జంతువులుకుక్కలు
Notables
Anniversary
  • 2 జూన్
Awards

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ, తెలంగాణ రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. ఇది రాష్ట్రంలోని 33 రెవెన్యూ జిల్లాలతో అధికార పరిధిని కలిగి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి ఈ తెలంగాణ పోలీసు యంత్రాంగం ఏర్పాటయింది. ఈ శాఖకు డా. జితేందర్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) నాయకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఈ పోలీసు శాఖ ప్రధాన కార్యాలయం ఉంది.

నిర్మాణం, సంస్థ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు

[మార్చు]

రిక్రూట్‌మెంట్‌కు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బాధ్యత వహిస్తుంటుంది. ఈ బోర్డుఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తోంది, తమ డిపార్ట్‌మెంట్‌కు ఉత్తమమైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటుంది. డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలో దాదాపు 50,000 మంది క్రియాశీల సిబ్బందిని కలిగి ఉంది.[4]

జిల్లాలు

[మార్చు]

ప్రతి రెవెన్యూ జిల్లాకు తన పరిధి ఉంటుంది. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) ఈ జిల్లా వ్యవస్థకు నేతృత్వం వహిస్తుంటాడు. ప్రతి జిల్లాలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్-డివిజన్లు, అనేక సర్కిల్‌లు, పోలీస్ స్టేషన్‌లు ఉంటాయి.

ఉపవిభాగాలు

[మార్చు]

సర్కిల్‌లు

[మార్చు]

ఒక సర్కిల్ లో అనేక పోలీసు స్టేషన్లను కలిగి ఉంటుంది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ సర్కిల్‌కు బాధ్యత వహిస్తాడు.

స్టాంప్ ఆఫ్ ఇండియా - 2017 - కోల్నెక్ట్ 909901 - పోలీస్ డే - తెలంగాణ రాష్ట్ర పోలీస్

స్టేషన్లు

[మార్చు]
తెలంగాణ పోలీస్ ఎస్‌యూవీ వాహనం

ఇన్‌స్పెక్టర్ (సబార్డినేట్ ర్యాంక్) పోలీసు స్టేషన్‌కు బాధ్యత వహిస్తాడు. పోలీస్ స్టేషన్ అనేది పోలీసింగ్ వ్యవస్థలోని ప్రాథమిక విభాగం. నేరాలను నిరోధించడం, గుర్తించడం, పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ, చట్టాన్ని అమలు చేయడం, రక్షణ విధులను నిర్వహించడం, రాజ్యాంగ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల కోసం భద్రతా ఏర్పాట్లు చేయడం వంటి బాధ్యతలను ఈ పోలీసు స్టేషన్లు కలిగి ఉంటాయి.

కమిషనరేట్

[మార్చు]

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో చట్టాన్ని అమలు చేసేందుకు పోలీస్ కమిషనరేట్ అనే సంస్థ ఏర్పాటు చేయడమైనది. పోలీసు కమిషనర్‌ నేతృత్వంలో కమిషనరేట్‌లో విధుల నిర్వహణ జరుగుతుంటుంది. హైదరాబాదు నగర పోలీసులు, సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ మొదలైనవి వరుసగా హైదరాబాదు, వరంగలు నగరాలకు స్థానికంగా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఉన్నాయి.

రాచకొండ పోలీస్ కమిషనరేట్, కరీంనగర్ పోలీస్ కమీషనరేట్, ఖమ్మం పోలీస్ కమీషనరేట్, నిజామాబాద్ పోలీస్, రామగుండం పోలీస్ కమీషనర్, సిద్ధిపేట పోలీస్ కమీషనరేట్ ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

ర్యాంకులు

[మార్చు]

హైదరాబాదు నగరంలోని డిజిపి ప్రధాన కార్యాలయంలో ఉన్న పోలీస్ డైరెక్టరేట్ నుండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తన విధులు నిర్వహిస్తుంటాడు. పోలీసు అదనపు డిజి, ఐజి స్థాయి నుండి అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏఐజి - ర్యాంక్, పోలీసు సూపరింటెండెంట్ హోదాలో సమానమైన పోస్ట్) వరకు సీనియర్ అధికారుల బృందం అతనికి సహాయం చేస్తుంటుంది.

పోలీసు ర్యాంకులు

[మార్చు]
2023 జూన్ 22న జరిగిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనం

తెలంగాణ పోలీసు కింది ర్యాంకులను అందిస్తుంది:

  • డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)
  • అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడిజిపి)
  • ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి)
  • డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి)
  • సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి.)
  • అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏ.ఎస్.పి.)
  • అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏ.ఎస్.పి.) (ఐపిఎస్)
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డి.ఎస్.పి.)

సబ్-ఆర్డినేట్లు

  • సర్కిల్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సిఐ)
  • సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ)
  • అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్ఐI)
  • హెడ్ పోలీస్ కానిస్టేబుల్ (హెచ్.సి.)
  • పోలీస్ కానిస్టేబుల్ (పిసి)
  • హోమ్ గార్డ్ (హెచ్.జి.)

పోలీస్ కమిషనరేట్ (సిటీ పోలీస్)లో పోస్టులు

[మార్చు]

"కమీషనర్ ఆఫ్ పోలీస్" అనేది ఎస్పీ, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఐ.పి.ఎస్ అధికారి నిర్వహించగల పదవి.

  • కమీషనర్ ఆఫ్ పోలీస్ (సిపి)
  • అదనపు పోలీసు కమిషనర్
  • జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (జె.సి.పి)
  • డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) (ఎస్పీ స్థాయి అధికారి)
  • అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఎ.సి.పి) (డీఎస్పీ స్థాయి అధికారి)

సబ్-ఆర్డినేట్లు

  • సర్కిల్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సిఐ)
  • సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ)
  • అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్ఐI)
  • హెడ్ పోలీస్ కానిస్టేబుల్ (హెచ్.సి.)
  • పోలీస్ కానిస్టేబుల్ (పిసి)
  • హోమ్ గార్డ్ (హెచ్.జి.)

మాజీ డీజీపీలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]
  1. డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల దర్యాప్తులో అనుసరిస్తున్న వ్యూహాలు, సిబ్బందిని సైబర్ వారియర్స్ గా మార్చే విధానంలో తీసుకునే చర్యలకు సంబంధించి డీఎసీసీఐ ఎక్సలెన్స్ అవార్డు 2021లలో పోలీస్ ఏజెన్సీల సామర్ధ్యాల పెంపుదలలో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్ని చేతుల మీదుగా రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నాడు.
  2. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకటించిన అవార్డులలో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం అమలు విధానంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో మూడోస్థానం వచ్చింది. ఈ అవార్డును హెూంశాఖ కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ ఎం మహేందర్ రెడ్డి సంయుక్తంగా స్వీకరించారు.[7]
  3. తెలంగాణ పోలీసులు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ హ్యాకథాన్‌ అండ్‌ సైబర్‌ ఛాలెంజ్‌ 2022 పురస్కారాన్ని దక్కించుకున్నారు. సైబర్‌ నేరాల నియంత్రణకు రాష్ట్ర పోలీసులు వినియోగిస్తున్న సైబర్‌క్రైమ్‌ అనాలసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టమ్‌ (సైక్యాప్స్‌) ఐటీ అప్లికేషన్‌ దేశంలోనే తొలిస్థానం సాధించింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ), సైబర్‌ పీస్‌ ఫౌండేషన్‌ (సీపీఎఫ్‌) సంస్థలు సంయుక్తంగా 2022 మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 25వరకు ఈ పోటీల్ని నిర్వహించాయి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telangana Budget Analysis 2019-20" (PDF). prsindia.org. 2019.[permanent dead link]
  2. "Photos of Police Vehicles". Nizamabad PoliceNizamabad.nic.in. Retrieved 2022-01-06.
  3. "Blue Colts Cops Get New Bikes". Gonizamabad.com. 2015-04-22. Archived from the original on 2015-06-24. Retrieved 2022-01-06. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Telangana Police Recruitment 2017".
  5. Sakshi (10 April 2018). "పూర్తి స్థాయి డీజీపీగా మహేందర్‌రెడ్డి". Archived from the original on 5 January 2022. Retrieved 2022-01-06.
  6. The Hindu (3 December 2023). "Ravi Gupta appointed new DGP of Telangana" (in Indian English). Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
  7. "తెలంగాణ పోలీస్‌ శాఖకు 2 జాతీయ అవార్డులు". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-16. Archived from the original on 2021-12-17. Retrieved 2022-01-11.