Jump to content

అంజనీకుమార్

వికీపీడియా నుండి
అంజనీకుమార్
అంజనీకుమార్


తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్ (డీజీపీ)
పదవీ కాలం
2022 డిసెంబరు 31 – 3 డిసెంబర్ 2023
ముందు ఎం. మహేందర్ రెడ్డి
తరువాత రవి గుప్తా

అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ ఐపిఎస్
పదవీ కాలం
2021 డిసెంబరు 24 – 2022 డిసెంబరు 30
ముందు గోవింద్ సింగ్

హైదరాబాదు నగర పోలీసు కమీషనర్
పదవీ కాలం
2018 మార్చి 12 – 2021 డిసెంబరు 24
తరువాత సివి ఆనంద్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1966-01-28) 1966 జనవరి 28 (వయసు 58)
పాట్నా, బీహార్

అంజనీ కుమార్ ఒక భారతీయ పోలీసు అధికారి, 1990 బ్యాచ్ ఐపిఎస్ అధికారి, తెలంగాణ కేడర్.[1][2] 2022 డిసెంబరు 29న తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీగా నియమించబడ్డాడు.[3] 1998 - 99లో బోస్నియాలో ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తున్నప్పుడు రెండుసార్లు ఐక్యరాజ్యసమితి శాంతి పతకాన్ని అందుకున్నాడు.[4][5]

జననం, విద్య

[మార్చు]

అంజనీకుమార్ 1966 జనవరి 28న బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జన్మించాడు. పాట్నాలోని సెయింట్ జేవియర్స్, కిరోరి మాల్ కళాశాల, ఢిల్లీ యూనివర్సిటీలలో చుదువుకున్నాడు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో, తన బ్యాచ్‌లోని ఉత్తమ హార్స్ రైడర్‌గా మహారాజా ఆఫ్ టోంక్ కప్, ఉత్తమ స్విమ్మర్‌గా ఆర్.డి. సింగ్ కప్‌ను గెలుచుకున్నాడు.[6]

వృత్తి జీవితం

[మార్చు]

1990 ఆగస్టు 20: ఐపిఎస్ గా నియమితుడై అనేక హోదాలలో పనిచేశాడు. 2021 డిసెంబరు 24[7] ఏసిబి మాజీ డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్ నుండి తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలను స్వీకరించిన అంజనీకుమార్, తన హైదరాబాదు సిటీ పోలీస్ కమీషనర్ బాధ్యతలను సివి ఆనంద్‌కు అప్పగించాడు.[8][9] నాలుగేళ్ళపాటు హైదరాబాదు సీపీగా పనిచేసిన సమయంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తనవంతు పాత్ర పోషించాడు. కరోనా సమయంలోనూ పోలీసులను సన్నద్ధం చేసి ముందుండి నడిపించాడు.

చివరికి సీనియారిటీలో ముందు వరుసలో ఉండటంతోపాటు, శాంతిభద్రతల అదనపు డీజీగా, హైదరాబాద్ సీపీగా, ఏసీబీ డీజీగా పనిచేసిన అనుభవం ఉన్న అంజనీకుమార్ ను 2022 డిసెంబరు 29న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి డిజిపిగా నియమించగా, [10] డిసెంబరు 31న బాధ్యతలు స్వీకరించాడు.[11]

నిర్వర్తించిన హోదాలు

[మార్చు]
  • 2022 డిసెంబరు 29 - 2023 డిసెంబరు 3: తెలంగాణ రాష్ట్ర డిజిపి
  • 2021 డిసెంబరు 25: డైరెక్టర్ జనరల్, యాంటీ కరప్షన్ బ్యూరో, తెలంగాణ, హైదరాబాదు నగరం
  • 2018 మార్చి 12: కమీషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ నగరం
  • అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్), తెలంగాణ
  • అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్), హైదరాబాద్ నగరం
  • ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వరంగల్ రేంజ్, తెలంగాణ
  • డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్ రేంజ్, తెలంగాణ
  • గ్రేహౌండ్స్ చీఫ్ (ఎలైట్ యాంటీ నక్సల్ యూనిట్), తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
  • కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ చీఫ్[12]
  • అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జనగాం, తెలంగాణ[13]
  • 1990 ఆగస్టు 20: ఐపిఎస్ గా నియమితులయ్యాడు

అవార్డులు

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]
  • అంజనీకుమార్ సహ రచయితగా నూపూర్ కుమార్‌తో కలిసి జర్నీ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ పోలీస్ అనే కాఫీ టేబుల్ బుక్ రచనలో సహాయం అందించాడు.[15][16] పుస్తక ప్రచురణ సమయంలో అంజనీకుమార్ హైదరాబాదు నగర, లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమీషనర్‌గా ఉన్నాడు.[17]

సస్పెన్షన్

[మార్చు]

2023 ఎన్నికల సమయంలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, 2023 డిసెంబరు డిసెంబరు 3న ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో కౌంటింగ్ పూర్తికాకముందే తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాకముందే డీజీపీ హోదాలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకరంగా కలవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.[18]

అంజనీకుమార్ పై విధించిన సస్పెన్షన్ పై ఈసీకి ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని, మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్ ఈసీకి వివరణ ఇచ్చారు. దీంతో ఆయన వివరణకు సంతృప్తి చెందిన ఈసీ అంజనీకుమార్ పై  సస్పెన్షన్ ఎత్తివేస్తూ 2023 డిసెంబరు 12న నిర్ణయం తీసుకుంది.[19]

మూలాలు

[మార్చు]
  1. "Anjani Kumar appointed as Commissioner of Police, Hyderabad". www.aninews.in (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.[permanent dead link]
  2. Details of IPS officers belonging to 1989 – 1995 batches empanelled to hold DIG and equivalent level posts under the Government of India http://mha1.nic.in/pdfs/DIG-EMPL.pdf Archived 4 ఏప్రిల్ 2018 at the Wayback Machine
  3. Namaste Telangana (30 December 2022). "ఇన్‌చార్జి డీజీపీగా అంజనీ కుమార్‌.. మొత్తం ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
  4. Mr. Anjani Kumar's BIOGRAPHY http://kenes-exhibitions.com/cybersecurity/wp-content/uploads/2017/11/Anjani-Kumar-IPS-bio.pdf Archived 2018-10-24 at the Wayback Machine
  5. "IPS : Query Form". mha1.nic.in. Archived from the original on 24 December 2016. Retrieved 2022-12-29.
  6. Mr. Anjani Kumar's BIOGRAPHY http://kenes-exhibitions.com/cybersecurity/wp-content/uploads/2017/11/Anjani-Kumar-IPS-bio.pdf Archived 2018-10-24 at the Wayback Machine
  7. https://www.siasat.com/five-days-after-promotion-anjani-kumar-takes-charge-as-dg-of-acb-2247769/ retrieved 30 November 2022
  8. Staff Reporter (2018-03-12). "Anjani Kumar is new CP of Hyderabad". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-12-29.
  9. PRO HYDERABADPOLICE (2018-03-12), Sri.Anjani Kumar,IPS,Addl.DGP is took charge as CP Hyd/PRO HYDERABADPOLICE, retrieved 2022-12-29
  10. "Telangana DGP: తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు అదనపు బాధ్యతలు". EENADU. 2022-12-29. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.
  11. telugu, NT News (2022-12-31). "తెలంగాణ డీజీపీగా అంజ‌నీ కుమార్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌". www.ntnews.com. Archived from the original on 2022-12-31. Retrieved 2022-12-31.
  12. "Anjani Kumar takes over as Hyderabad city Police Commissioner". Outlook India. Retrieved 2022-12-29.
  13. "The no-nonsense cop - Anjani Kumar". You & I (in ఇంగ్లీష్). 2016-09-09. Retrieved 2022-12-29.
  14. PRO HYDERABADPOLICE (2016-01-25), Anjani Kumar ,IPS-Addl CP L&O got of President police medal-speech, retrieved 2022-12-29
  15. "A new book chronicles Hyderabad's police system, from pre-Independence to the era of cyber crime - Firstpost". www.firstpost.com. Retrieved 2022-12-29.
  16. "Outlining the journey of city police". The Hindu (in Indian English). Special Correspondent, Special Correspondent. 2017-11-12. ISSN 0971-751X. Retrieved 2022-12-29.{{cite news}}: CS1 maint: others (link)
  17. "Chief Minister releases book on 'Journey of Hyderabad City Police'". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
  18. A. B. P. Desam (3 December 2023). "ఈసీ సంచలన నిర్ణయం, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై వేటు!". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  19. Andhrajyothy (12 December 2023). "అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.