తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
తెలుగులో ఆధునిక ప్రమాణ భాష, తెలంగాణ భాష.. ఈ రెండు వేరు వేరు. ఆమాట కొస్తే ఈ భేదాలు దాదాపుగా ప్రతిభాషలోనూ ఉంటాయి. ఆధునిక ప్రమాణ భాష అన్నది రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల శిష్టభాష. ఈ మూస భాషలోని నుడికారాలకు, తెలంగాణ భాషలో ఉన్న నుడికారాలకు తేడా తప్పనిసరిగా ఉంటుంది. తెలంగాణ బాష జీవద్భాష. తెలంగాణ ప్రజల భాష నుడుల్లో(మాటల్లో పదాల్లో), నానుడుల్లో (సామెతల్లో),నుడికారాల్లో(జాతీయాల్లో, పదబందాల్లో)పదిలంగా ఉన్నది. శ్రమైక జీవనసౌందర్యంతో పాటు బతుకు వాసనలతో భాసిల్లుతున్న తెలంగాణ భాషలో అన్యభాష పదాలతో ఆదాన ప్రదానాలు జరిగి ఈ ప్రాంతంలోని ప్రజలు తమ జీవన వ్యవహారంలో ప్రత్యేకమైన యాసతో కూడున భాషను ఏర్పరుచుకున్నారు. అలా వారి జీవన వ్యవహారంలో నుండి వెలువడినవే పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు.[1]
ద్రవ్యమానం
[మార్చు]- దమ్మిడి - 1 పైస(దమ్మిడి లేకపోయిన దండుగలు కడుతానంటడు అనేది సామేత)
- ఒక అణా - 6 పైసలు
- బేడా - 12 పైసలు
- చారాణా - 24 పైసలు (వ్యవహారంలో 25 పైసలు)
- ఆఠాణ - 48 పైసలు (వ్యవహారంలో 50 పైసలు)
- బారాణ - 72 పైసలు (వ్యవహారంలో 75 పైసలు)
- సోలాణ - 96 పైసలు ( వ్యవహారంలో 100 పైసలు- రూపాయి)
ఘన పదార్థాల కొలమానాలు
[మార్చు]- గిద్దె - 50 గ్రాములు (దాదాపు) ఏ పదార్థాన్ని కొలిచినప్పుడు ఫలానా ఘనపరిమాణం ఫలానా బరువుకు సమానమౌతుందో చెప్పాలి. అన్ని పదార్థాలకూ అది ఒకే రకంగా ఉండదు.[విడమరచి రాయాలి]
- పిరిచిట్టి - 250 గ్రాములు (దాదాపు)
- అరసోల - 2 పిరిచిట్టిలు (500గ్రాములు)
- సోల - 1 కేజి ( దాదాపు)
- తవ్వెడు - 2 సోలలలు (2కేజీలు)
- మానెడు - 2 తవ్వలు (4కేజీలు)
- అడ్డేడు - 2 మానెడ్లు (8కేజీలు)
- కుంచెడు - 2 అడ్డెడ్లు
- ఇరుస - 2 కుంచాలు (32కేజీలు)
- తూమెడు - 4 కుంచాలు (50 కేజీలు)
- గిద్దెడు - 2 తూములు (100 కేజీలు) వేరు వేరు కొలతలు[విడమరచి రాయాలి]
ద్రవ పదార్థాల కొలమానాలు
[మార్చు]- అర్ధ పావు - 1/8లీటరు (125 మి.ల్లీ)
- పావుశేరు - 250 మి.లీ.
- అర్ధశేరు - 500 మి.లీ
- శేరు - 1000 మి.లీ
- సవశేరు - 1250 మి.లీ[2]
పొడవుల కొలమానాలు
[మార్చు]- బెత్తెడు - 3 అంగుళాలు (దాదాపు)
- జానెడు - 3 బెత్తెలు (దాదాపు9 అంగులాలు)
- మూర - 2 జానెలు (దాదాపు 18 అంగుళాలు)
- అడుగు - 12 అంగుళాలు
- గజం - 3 అడుగులు ( 1 మీటర్ కంటె తక్కువ)
భూముల కొలమానాలు
[మార్చు]బంగారం కొలమానాలు
[మార్చు]- గురిజెత్తు - 1 గ్రాము
- మాసమెత్తు - 2 గురిజలు
- విసమెత్తు - 3 గ్రాములు
- బేడెత్తు - 2 అణాలు
- చుక్కెత్తు - పావలా
- 8 అణాలు - అరతులం (6గ్రాములు)
- తులం - 11.5గ్రాములు
- తక్కెడ - 150 తులాలు
- మణుగు - 8 తక్కెళ్ళు[4]
మూలాలు
[మార్చు]- ↑ "ఈమాట – eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-27.
- ↑ తెలంగాణ పదకోశం నలిమెల భాస్కర్. 2010.
- ↑ వ్యవసాయ వృత్తి పదకోశం. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ. 1974.
- ↑ "ఆంధ్రభారతి.కామ్". Archived from the original on 2008-01-19. Retrieved 2023-02-20.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)