Jump to content

చర్చ:తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఘనపరిమాణం , ద్రవ్యరాశి సంబంధం

[మార్చు]
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ వ్యాసంలో కొన్ని ఘన పదార్థాల ఘనపరిమాణం నకు ద్రవ్యరాశికి సంబంధం ఉన్న కొలత విధానాలు ఉన్నవి. ఒకే ఘనపరిమాణం గల అన్ని పదార్థాలు ఒకే ద్రవ్యరాశి కలిగి ఉండవు. పదార్థ సాంద్రత ఆధారంగా ద్రవ్యరాశి మారుతుంది. ఒక లీటరు స్వేదన జలం 1 కి.గ్రా ఉంటే, 1 లీటరు పాదరసం 13.53 కిలోగ్రాములు ఉంటుంది. కనుక ఈ వ్యాసంలో తెలియజేసిన గిద్దె, పిరిసెట్టి, అరసోల,ఇరుస, తూమెడు వంటి ప్రమాణాలకు సరిపోలిన ద్రవ్యరాశిని ఇచ్చారు. అది ఏ పదార్థానికి సంబంధించినవో తెలియజేయాలి.➠ కె.వెంకటరమణచర్చ 05:18, 11 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

http://m.navatelangana.com/article/jaatara/120874 లింకులో ప్రాచీన విధానంలో ధాన్యం కొలతల గూర్చి వివరాలు ఉన్నాయి. ఇందులో ఘనపరిమాణానికి సంబధించి మత్రమే ఉన్నాయి. ఈ వ్యాసంలో కుంచెడు అనగా 16 కి.గ్రా. అని ఉన్నది. తూమెడు అనగా 4 కుంచాలు అనగా 64 కి.గ్రా. కావాలి. కానీ 50 కి.గ్రా. అని ఇచ్చారు. అంతా గందరగోళంగా ఉంది. కనుక వ్యాసంలో బ్రాకెట్లలో ఉన్న బరువులను తొలగించాలి.➠ కె.వెంకటరమణచర్చ 13:26, 13 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఔను, ఆ బ్రాకెట్లలో ఉన్న బరువులను తీసేస్తే సరిపోతుంది. __చదువరి (చర్చరచనలు) 13:52, 13 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.

--~~ramesh bethi~~ (చర్చ) 15:58, 20 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యేక వ్యాసానికి అవసరమైన సమాచారం లేదు.

[మార్చు]

@Ramesh bethi గారు, వ్యాసంలో డబ్బు కొలమానంలో పరభాషల పదాలతో ఏర్పడిన ఆఠాణ, బారాణ లాంటివి కొన్ని తప్ప, ఇతర కొలమానాలు ఆంధ్ర ప్రాంతంలోను వాడుకలో వున్నాయి. వ్యాసంలో పేర్కొన్న మూలాలు నిర్దిష్టంగా లేవు. కావున ప్రస్తుత స్థితిలో ఈ వ్యాసం తొలగించటం మంచిది. --అర్జున (చర్చ) 04:28, 2 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

"తెలంగాణ పదకోశం" గురించి విలువైన సమాచారం లభిస్తే ఆ పేరుతో వ్యాసం అభివృద్ధి చేసి ఈ వ్యాసంలోని కొన్ని వివరాలను చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 04:35, 2 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]