తినే పుట్టగొడుగులు (సహజమైనవి)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభించేవి. ప్రస్తుతం చిత్తకార్తెలో సైతం ఇవి చాలా అరుదుగా లభిస్తున్నాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా ఉండి ఉరుములు ఉరిమినప్పుడు పుట్టకూడు ఉన్న పుట్టల్లో, గుట్టల్లో, నేల నుండి ఇవి పైకి పొడుచుకువస్తాయి. ఇవి పుట్టే చోట ఉండే మట్టి వదులుగా ఉంటుంది. పుట్టగొడుగుల శిలీంధ్రం ఉన్న లోతును బట్టి మట్టిలోని సారంను బట్టి వాతావరణాన్నిబట్టి వీటి పరిమాణంలో మార్పులు ఉంటాయి. ఇవి భూమిపైకి వచ్చినప్పుడు మల్లె మొగ్గ వలె కాడను కలిగి ఉంటాయి. మల్లె మొగ్గవలె ఉన్న పుట్టగొడుగులను మొడిదలు అంటారు. భూమిపైకి వచ్చిన ఒకటి రెండు రోజుల్లో ఇవి విచ్చుకుంటాయి. వీటిని గొడుగులు అంటారు. విచ్చుకున్న పుట్టగొడుగులు తొందరగా పాడవుతాయి. సహజసిద్ధంగా పెరిగే తినే పుట్టగొడుగులు తెలుపు రంగులో ఉంటాయి. పుట్టకూడు (పుట్టగొడుగుల శిలీంధ్రం) ఉన్న నల్లరేగడి భూముల్లో ఏపుగా, లావుగా పెరుగుతాయి. పుట్టగొడుగులు పచ్చివి తినరు, కూర వండుకుని మాత్రమే తింటారు. ఇవి ఒక విధమైన వాసన కలిగి ఉంటాయి. దగ్గరగా వాసన చూసినపుడు మాత్రమే వీటి యొక్క వాసనను గుర్తించగలుగుతారు. ఇది Termitomyces జాతికి చెందినది. దీనిని చెదలు వ్యవసాయం చేస్తాయి. మనుషులు ఎంత ప్రయత్నం చేసిన దీనిని పండిచ లేకపోయారు.
మొడిదలు
[మార్చు]తినే స్థాయిలో ఉన్న పుట్టగొడుగుల మొదటి రూపం మొడిదలు. వీటిని ఇష్టంగా కూర వండుకుని తింటారు. విచ్చుకున్న పుట్టగొడుగుల రుచికన్నా ఇవి చాలా రుచిగా ఉంటాయి. మట్టిలోపల పుట్టినవి కాబట్టి మట్టితో సహ ఉన్న ఈ పుట్టగొడుగులను కాడలతో సహ బాగా కడిగి కాడలను మొడిదల నుంచి వేరు చేసి పొడవుగా ఉన్న కాడలను చిన్నవిగా కట్ చేసి మొడిదలతో సహ కాడలను కూడా వేసి కూర చేసుకుంటారు. కాడలన్నా మొడిదలు బాగా రుచిగా ఉంటాయి.
పుట్టగొడుగుల కూర తయారీ విధానం
[మార్చు]పుట్టగొడుగుల కూరను మసాలాలు వేసి పులుసు చేసుకుంటారు. ఈ కూర తయారీ విధానం మొత్తం మాంసం కూర తయారీ విధానాన్ని పోలి ఉంటుంది. రుచి కూడా మాంసం కూరను పోలి ఉంటుంది.
శాకాహారం
[మార్చు]పుట్టగొడుగుల కూర శాకాహారం అయినప్పటికి కొంతమంది శాఖాహారులు ఈ కూరకు ఉండే మాంసాహారపు రుచి కారణంగా ఈ కూరను మాంసాహారంగా భావించి తినరు.
వింతమొక్కలు
[మార్చు]సృష్టిలోని వింతమొక్కలలో ఒకటిగా ఈ పుట్టగొడుగులను పేర్కొనవచ్చు.
చిత్రమాలిక
[మార్చు]
ఇవి కూడా చూడండి
[మార్చు]