Jump to content

వింత మొక్కలు

వికీపీడియా నుండి
(వింతమొక్క నుండి దారిమార్పు చెందింది)
కొన్ని సంవత్సరాల పాటు జీవించే ఈ చిత్రంలోని కలబంద చెట్టు తన జీవితకాలంలో ఒకే ఒక్కసారి పుష్పించి అంతటితో అంతరిస్తుంది. మామూలుగా ఐదు అడుగులు ఉండే ఈ చెట్టు పూతకు వచ్చినప్పుడు ఇరవై అడుగుల పైన పెరిగి పై భాగాన పుష్పిస్తుంది.

నేలలో దుంప రూపంలో ఆహారాన్ని దాచుకునే మొక్కలు

[మార్చు]

చిలగడ దుంప, బంగాళ దుంప

చెట్టు మీదనే మొలకెత్తి చెట్ల పైనే పెరిగే చెట్లు

[మార్చు]

ఎంతో పెద్దవిగా పెరిగే మఱ్ఱి, రావి చెట్లు కూడా ఒక్కోసారి ఏ చెట్టు మీదనో పెరగటం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత క్రమ క్రమంగా వేళ్ళను నేలలోనికి దింపి పాతుకు పోతాయి.

నేలకింద దాక్కుని అర్ధాంతరంగా ఊడి పడే కాయలు గింజలు లేని మొక్కలు

[మార్చు]

ఇలాంటివే పుట్ట గొడుగులు ఇవీ మొక్కలే. చిన్నవిగా ఉండటాన, మిగిలిన మొక్కల్లాగ కనిపించక పోవటాన, వీటిని అసలు మొక్కలనే అనుకోరు.

ఈ జాతి మొక్కల్లో ఒకటైన ట్రఫుల్స్ రకం పుట్టగొడుగులు నేలలోపలే పెరిగి, వ్యాపించి, పుష్పిస్తాయి. నేలమీదకు కనిపించకపోవటాన ఇవి పెరిగినట్లు, పుష్పించినట్లు, అసలు ఉన్నట్లే ఎవరికీ తెలియదు.

నీళ్ళలో దాక్కునే మొక్కలు

[మార్చు]

నాచు, పాచి మొక్కలు , తామర, బుడగ తామరలు నీళ్ళల్లో తప్పిస్తే బయట పెరగవు.

ఎడారుల్లో పెరిగే మొక్కలు

[మార్చు]

బ్రహ్మజెముడు, నాగజెముడు, సర్వి లాంటి మొక్కలు ఇసుక నేలల్లో పెరుగుతాయి.

కంటికి కనిపించనివి మొక్కలు

[మార్చు]

పెరుగు తోడుకునేది సూక్ష్మజీవుల వల్లనే. ఆహార పదార్ధాలను తడి తగిలే చోట నాలుగు రోజులు ఉంచితే చెడిపోయి వాసన పట్టేది ఇవి పెరగటానే. నీళ్ళు తగిలితే పచ్చళ్ళ మీద, బ్రెడ్ మీద పట్టే బూజు కూడ ఈ మొక్కల వలనే. ఈచిన్న మొక్కలు కొన్ని పెద్ద మొక్కలపై పెరగటం వల్లనే ఆ మొక్కలకు తెగుళ్ళు పడతాయి. కల్లు కుండల్లో నుండి నురుగు వచ్చేది వాటిలో ఒక రకం మొక్క పెరగటం వల్లనే. మనకు మందుల్ని అందించే "పెనిసిలియం" కూడ ఈ మొక్కల్లో ఒకటే. ఇలాగే మనకు ఉపయోగ పడేవి, హాని కలిగించేవి ఎన్నెన్నో చిన్న మొక్కలయిన సూక్ష్మజీవులు ఉన్నాయి.

ఆకాశాన్ని అంటే చెట్లు

[మార్చు]

సెకోయియా చెట్లు, యూకలిప్టసు చెట్లు కొన్ని ప్రాంతాలలో మూడువందల అడుగుల పొడవు పెరుగుతాయి.

పడిపోకుండా ఊడల రూపంలో కొత్త కాండాన్ని తయారు చేసుకునే చెట్లు

[మార్చు]

మర్రిచెట్టు

లావెక్కే చెట్లు

[మార్చు]

ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తాయి ఇలాంటి చెట్లు. డెబ్బై అడుగులు ఎత్తు పెరిగే బెబిల్ అనబడే చెట్లు 25 అడుగుల లావెక్కుతాయి.


బయటి లింకులు

[మార్చు]