Jump to content

తాటకి

వికీపీడియా నుండి
(తాటక నుండి దారిమార్పు చెందింది)
తాటకిని చంపుతున్న రాముడు

తాటకి లేదా తాటక రామాయణ ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు పిల్లల కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన, అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె రాక్షస రాజైన సుందుడుని పెళ్ళిచేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, మారీచుడు, కైకసి. వీరిలో కైకసి విశ్రావసుని వలన రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుల్ని పుత్రులుగాను, శూర్పణఖ అనే పుత్రికను పొందుతుంది.

అగస్త్యుడు సుందుడు, సుకేతుల్ని శపించి మరణానికి కారణమైనందుకు తాటకి ప్రతీకారం తీర్చుకోవడానికి నిశ్చయించుకుంటుంది. అందులకు కోపించిన ముని వికృత రూపాన్ని రాక్షసత్వాన్ని ప్రాప్తిస్తాడు. అప్పటినుండి తాటక సుబాహులు అరణ్యాలలో మునులు జరిపే యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నాయి. విశ్వామిత్ర మహర్షికి దీనిమూలంగా కలిగిన వినాశనానికి కోసల రాజైన దశరథుని అర్ధించి రామలక్ష్మణుల్ని యాగరక్షణ కోసం నియమిస్తాడు. విశ్వామిత్రుని వెంట యాగరక్షణ కోసం వచ్చిన రామలక్ష్మణులు తాటకిని వధిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=తాటకి&oldid=3702881" నుండి వెలికితీశారు