డేవిడ్ టెర్‌బ్రూగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డేవిడ్ టెర్‌బ్రూగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేవిడ్ జాన్ టెర్‌బ్రూగ్
పుట్టిన తేదీ (1977-01-31) 1977 జనవరి 31 (వయసు 47)
లేడిస్మిత్, క్వాజులు-నాటల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 272)1998 26 November - West Indies తో
చివరి టెస్టు2004 18 March - New Zealand తో
తొలి వన్‌డే (క్యాప్ 58)2000 23 January - England తో
చివరి వన్‌డే2000 18 August - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–2005/06Gauteng
2003/04–2005/06Lions
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI
మ్యాచ్‌లు 7 4
చేసిన పరుగులు 16 5
బ్యాటింగు సగటు 5.33 5.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 4* 5
వేసిన బంతులు 1,012 126
వికెట్లు 20 4
బౌలింగు సగటు 25.85 26.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/46 4/20
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 0/–
మూలం: Cricinfo, 2017 25 August

డేవిడ్ జాన్ టెర్‌బ్రూగ్ (జననం 1977, జనవరి 31) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. 1998 - 2004 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు తరపున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. వెన్నుగాయం కారణంగా కేరీర్ మధ్యలోనే పదవీ విరమణ పొందాడు. టెర్‌బ్రూగ్ కుడిచేతి ఫాస్ట్-మీడియం డెలివరీలతో బౌలింగ్ చేశాడు, టైలెండర్‌గా కుడిచేతి బ్యాటింగ్ చేశాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

స్కూల్‌బాయ్ స్థాయిలో ప్రతిభావంతులైన ఆటగాడిగా రాణించాడు. 1995లో దక్షిణాఫ్రికా అండర్-19 ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఉన్నాడు.[1][2] 18 సంవత్సరాల వయసులో గాయం నుండి కోలుకొని పూర్తి అంతర్జాతీయ బౌలర్‌గా మారాడు. 1999లో చీలమండ ఆపరేషన్ అవసరమైంది, కానీ మళ్ళీ కోలుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున ఆడటం కొనసాగించాడు.[1]

2000లో పాకిస్తాన్‌పై తన వన్డే అరంగేట్రంలో 4/20 తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా విజయంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. 2002లో బంగ్లాదేశ్‌పై 5/46 తీసుకున్నాడు. ఇది టెస్ట్ మ్యాచ్‌లో ఇతని అత్యుత్తమ బౌలింగ్. అయినప్పటికీ ఏడాదిన్నరపాటు జట్టు కోసం ఆడలేదు.[3][4] గౌటెంగ్, హైవెల్డ్ లయన్స్ కొరకు దేశీయంగా ఆడాడు.[5][6] 2005లో గాయం కారణంగా 29 సంవత్సరాల వయస్సులో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకున్నాడు.[1][7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 David Terbrugge, CricInfo. Retrieved 2022-12-06.
  2. Chesterfield D (1998) Terbrugge: Face of a new fast bowler, Pretoria News, 1998-11-23. Reprinted at CricInfo. Retrieved 2022-12-06.
  3. David Terbrugge, CricketArchive. Retrieved 2022-12-06. (subscription required)
  4. Terbrugge recalled by South Africa, CricInfo, 2004-03-01. Retrieved 2022-12-06.
  5. David Terbrugge handed one-match suspension, CricInfo, 2004-12-07. Retrieved 2022-12-06.
  6. Lane K (2005) Terbrugge sends a reminder, CricInfo, 2005-08-17. Retrieved 2022-12-06.
  7. David Terbrugge retires from cricket, CricInfo, 2006-10-26. Retrieved 2022-12-06.

బాహ్య లింకులు

[మార్చు]