డీ.కే. శివ కుమార్
డి. కే. శివకుమార్ | |||
డి. కే. శివకుమార్ | |||
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 11 మార్చి 2020[1] – ప్రస్తుతం | |||
ముందు | దినేష్ గుండురావు | ||
---|---|---|---|
జల్ శక్తి మంత్రి
| |||
పదవీ కాలం 6 జూన్ 2018 – 23 జులై 2019 | |||
ముందు | ఎం. బి. పాటిల్ | ||
తరువాత | రమేష్ జర్కిహోళి | ||
వైద్య విద్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 6 జూన్ 2018 – 22 డిసెంబర్ 2018 | |||
ముందు | శరన్ ప్రకాష్ పాటిల్ | ||
తరువాత | ఈ . తుకారాం | ||
విద్యుత్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 11 జులై 2014 – 19 మే 2018 | |||
ముందు | కే.ఎస్. ఈశ్వరప్ప | ||
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2008 – 2010 | |||
ముందు | నూతనంగా ఏర్పాటు | ||
తరువాత | ఈశ్వర ఖణ్డరే | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2008 | |||
ముందు | పి. జి. ఆర్. సింధియా | ||
నియోజకవర్గం | కనకపుర | ||
పదవీ కాలం నవంబర్ 1989 – మే 2008 | |||
ముందు | కే .ఎల్. శివలింగేగౌడ | ||
తరువాత | నియోజకవర్గం పునర్విభజన జరిగింది | ||
నియోజకవర్గం | సాతనూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కనకపుర, కర్ణాటక, భారతదేశం | 1962 మే 15||
జాతీయత | భారతీయుడి | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కెంపేగౌడ, గౌరమ్మ | ||
జీవిత భాగస్వామి | ఉష | ||
బంధువులు | డీ.కే. సురేశ్ (తమ్ముడు) | ||
సంతానం | 3 |
డీ.కే. శివ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు.[2][3][4]
ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తరువాత కర్నాటక ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5][6]
జననం, విద్యాభాస్యం
[మార్చు]డీ.కే. శివ కుమార్ కర్ణాటకలోని రామనగర్ జిల్లా కనకపుర తాలూకా దొడ్డఆలహళ్ళి గ్రామంలో కెంపేగౌడ, గౌరమ్మ దంపతులకు 1962 మే 15న జన్మించాడు. ఆయన ఓపెన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]డీ.కే. శివ కుమార్ విద్యార్థి దశలోనే కాంగ్రెస్ పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ప్రవేశించి 18వ ఏటనే కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐలో చేరాడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం కోసం బెంగళూరుకు వచ్చి ఆర్‌సీ కళాశాలలో చేరి ఆ తరువాత ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాడు. శివ కుమార్ 1985లో సాతనూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి జేడీఎస్ అభ్యర్థి దేవేగౌడపై పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1987లో సాతనూరు నియోజకవర్గం నుంచి బెంగళూరు గ్రామీణ జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఎంపికయ్యాడు.
డీ.కే. శివ కుమార్ 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరఫున సాతనూరు నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై ఎస్. బంగారప్ప మంత్రివర్గంలో జైళ్ల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 1994లో కాంగ్రెస్ టికెట్ దక్కనందున స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు, ఆ తరువాత 1999లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఎస్‌ఎం కృష్ణ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.
డీ.కే. శివ కుమార్ 2013లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సిద్దరామయ్య మంత్రివర్గంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ సాధ్యం కాకపోవడంతో, జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగా కుమారస్వామి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.
నిర్వహించిన భాద్యతలు
[మార్చు]సంవత్సరం | పదవి | ఇతర |
---|---|---|
1989 - 1994 | ఎమ్మెల్యే
|
[7] |
1994 - 1999 | ఎమ్మెల్యే
|
[7] |
1999 - 2004 | ఎమ్మెల్యే | |
2004 - 2008 | ఎమ్మెల్యే | |
2008 - 2013 | ఎమ్మెల్యే
|
|
2013 - 2018 | ఎమ్మెల్యే
|
[8] |
2018 - 2023 | ఎమ్మెల్యే
|
|
2023[9] | ఎమ్మెల్యే |
ఎన్నికల్లో పోటీ
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్లు | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓట్లు | ఇతర |
---|---|---|---|---|---|---|---|---|
1989 | సాతనూర్ | కాంగ్రెస్ పార్టీ | గెలుపు | 44,595 | యూ. కే. స్వామి | జనతా పార్టీ | 30,945 | [10] |
1994 | సాతనూర్ | స్వతంత్ర | గెలుపు | 48,270 | యూ. కే. స్వామి | జనతా దళ్ | 47,702 | [10] |
1999 | సాతనూర్ | కాంగ్రెస్ పార్టీ | గెలుపు | 56,050 | హెచ్. డి. కుమారస్వామి | జనతా దళ్ (సెక్యూలర్) | 41,663 | [10] |
2004 | సాతనూర్ | కాంగ్రెస్ పార్టీ | గెలుపు | 51,603 | విశ్వనాధ్ డిఎం | జనతా దళ్ (సెక్యూలర్) | 37,675 | [10] |
2008 | కనకాపుర | కాంగ్రెస్ పార్టీ | గెలుపు | 68,096 | విశ్వనాధ్ డిఎం | జనతా దళ్ (సెక్యూలర్) | 60,917 | [11] |
2013 | కనకాపుర | కాంగ్రెస్ పార్టీ | గెలుపు | 1,00,007 | పి.జి.ఆర్. సింధియా | జనతా దళ్ (సెక్యూలర్) | 68,583 | [11] |
2018 | కనకాపుర | కాంగ్రెస్ పార్టీ | గెలుపు | 1,27,552 | నారాయణ గౌడ | జనతా దళ్ (సెక్యూలర్) | 47,643 | [12] |
2023 | కనకాపుర | కాంగ్రెస్ పార్టీ | గెలుపు | 1,42,156 | బి. నాగరాజు | జనతా దళ్ (సెక్యూలర్) | 20,561 | [13] |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (11 March 2020). "కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా డీకే శివకుమార్". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
- ↑ 2.0 2.1 Sakshi (2 July 2020). "కీలక బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
- ↑ Sakshi (11 March 2020). "సింధియా రాజీనామాతో మేలుకున్న కాంగ్రెస్". Retrieved 15 April 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Eenadu (14 May 2023). "అధిష్ఠానానికే ఆపద్బంధువు". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Zee News Telugu (20 May 2023). "కర్ణాటకలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, 8 మందితో తొలి కేబినెట్.. జాబితా ఇదే". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
- ↑ BusinessLine (18 May 2023). "Five lesser-known facts about DK Shivakumar, the new Deputy CM of Karnataka" (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
{{cite news}}
:|last1=
has generic name (help) - ↑ 7.0 7.1 "Meet DK Shivakumar, Congress' Last 'Resort' for Tricky Trust Votes". News18. Retrieved 6 August 2018.
- ↑ "Shiva Kumar and Roshan Baig sworn-in as ministers in Karnataka cabinet" (in ఇంగ్లీష్). 2014. Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
- ↑ Eenadu (13 May 2023). "కనకపురాలో శివకుమార్ విజయం". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
- ↑ 10.0 10.1 10.2 10.3 "Sathanur Assembly Constituency Election Result". resultuniversity.com. Retrieved 25 Oct 2021.
- ↑ 11.0 11.1 "Kanakapura (Karnataka) Assembly Constituency Elections". elections.in. Archived from the original on 28 అక్టోబరు 2021. Retrieved 25 Oct 2021.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.