డా. ఎస్. జి. రామానుజాచార్యులు
డా. ఎస్. జి. రామానుజాచార్యులు | |
---|---|
![]() | |
జననం | |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వృత్తి | ఆచార్యులు |
డా. ఎస్. జి. రామానుజాచార్యులు తెలుగుకవి, రచయిత. హైదరాబాద్ వాసి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓరియంటల్ ఫ్యాకల్టీకి పీఠాధిపతిగా పనిచేశాడు. జూన్ 15, 1944 వ తేదిన హైదరాబాద్లో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఆండాళమ్మ, ఎస్. జి. నరసింహాచార్యులు[1]. ఇతని పూర్వికులు నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని మంగలపల్లి గ్రామానికి చెందినవారు. 1977లో వీరు ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర అను అంశంపై పరిశోధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నారు.
విద్యాభ్యాసం
[మార్చు]శ్రీవెంకటేశ్వర వేందాంత వర్ధనీ సంస్కృత కళాశాల, హైదరాబాదులో బి.ఓ.ఎల్., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.,(తెలుగు), పి.హెచ్డీ. చేశారు.
ఉద్యోగం
[మార్చు]ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గవర్నమెంట్ ఆంధ్ర ఓరియంటల్ కాలేజీ, హైదరాబాద్, తెలుగు శాఖ పీజీ విభాగంలో వీరు ఉపన్యాసకులుగా, రీడర్గా, ప్రధాన ఆచార్యులుగా వివిధ హోదాలలో 33 సంవత్సరాలు పనిచేశారు. 1995 నుంచి 1998 వరకు ఓరియంటల్ ఫ్యాకల్టీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా పనిచేశారు. 2001 జూలై నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ ఫ్యాకల్టీకి డీన్ గాను పనిచేశారు. 1984లో వీరి సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఉత్తమ అధ్యాపక అవార్డు ప్రధానంతో సత్కరించింది. అవార్డును నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా అందుకున్నారు.
రచనలు
[మార్చు]- ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర
- మాయా మానవుని చైతన్య కిరణాలు[2].
- దండి దశకుమార చరిత్ర(ఆంధ్రానువాదం)
- గాలిబ్ కవితాశిల్పం (సాహిత్యవిమర్శనా గ్రంథం)[3]. .
ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రచురణలు తెలుగు కవితా సౌరభాలు, తెలుగు సాహితీ స్రవంతి వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. సాహితీ సేవలో అంతర్భాగంగా వీరు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం నేతృత్వంలో సాగిన ఆంధ్రదేశ చరిత్ర భూగోళ సర్వస్వం- ఒకటి, రెండు, మూడు సంపుటాలలో 38 సాహితీ, చారిత్రక వ్యాసాలను రచించారు. కళాశాల ప్రచురణ- నన్నయ్య ప్రసన్న కథ లోతులు గ్రంథానికి సంపాదకత్వం వహించారు.