డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం
స్వరూపం
![]() | |
ఇతర పేర్లు | ఎ.హెచ్.యు.యు |
---|---|
నినాదం | محبت محنت خدمت |
ఆంగ్లంలో నినాదం | లవ్ లేబర్ సర్వీస్ |
రకం | ప్రభుత్వ |
స్థాపితం | 2016 |
విద్యాసంబంధ affiliations | యూజీసి |
బడ్జెట్ | రాష్ట్ర ప్రభుత్వ నిధులు |
ఛాన్సలర్ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
వైస్ ఛాన్సలర్ | పటాన్ షేక్ షావల్లి ఖాన్ |
స్థానం | కర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1] 15°47′N 78°02′E / 15.79°N 78.03°E |
డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలులో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయం. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం - 2016 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించింది. రాయలసీమకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త, దాత, కర్నూలులోని ఉస్మానియా కళాశాల స్థాపకుడు డాక్టర్ అబ్దుల్ హక్ పేరును ఈ విశ్వవిద్యాలయానికి పెట్టారు.
విశ్వవిద్యాలయ లక్ష్యాలు
[మార్చు]ఉర్దూ భాషను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం; ఉర్దూ మాధ్యమం ద్వారా వృత్తి, సాంకేతిక విషయాలలో విద్య, శిక్షణను అందించడం; ఉన్నత విద్య, ఉర్దూ మాధ్యమంలో శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలనుకునే ప్రజలకు క్యాంపస్‌లో, దూరం నుండి బోధన ద్వారా విస్తృత ప్రాప్యతను అందించడం, మహిళా విద్యపై దృష్టి పెట్టడం ఈ విశ్వవిద్యాలయం లక్ష్యాలు.
ద్విభాషా సౌకర్యం
[మార్చు]ఎంఎ (ఉర్దూ) తప్ప, అన్ని తరగతులలో బోధనా మాధ్యమం ఉర్దూ, ఇంగ్లీష్ రెండింటిలోనూ ఉంటుంది.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "About-Dr.Abdul Haq Urdu University, Kurnool". ahuuk.ac.in. Retrieved 17 March 2019.
సాధారణ మూలాలు
[మార్చు]- "Prof. Muzaffar Shahmiri is appointed VC of Dr. Abdul Haq Urdu University". Siasat.com. 2016-03-23. Retrieved 2017-03-29.
- "Dr. Abdul Haq Urdu University". Ruk.ac.in. 2016-08-16. Archived from the original on 2017-03-30. Retrieved 2017-03-29.
- "Shri. Satish Chandra, IAS is appointed as Vice-Chancellor In-charge of Dr. Abdul Haq Urdu University, Kurnool". ahuuk.ac.in. 2021-03-24. Retrieved 2021-06-20.
- "Shri. J. Shyamala Rao, IAS is appointed as Vice-Chancellor In-charge of Dr. Abdul Haq Urdu University, Kurnool". ahuuk.ac.in. 2021-12-06. Retrieved 2021-12-06.
- "Prof. P. Fazul Rahaman is appointed as Vice-Chancellor of Dr. Abdul Haq Urdu University, Kurnool". ahuuk.ac.in. 2022-02-15. Retrieved 2022-02-15.