శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sri Venkateswara Institute of Medical Sciences
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రకంఇన్స్టిట్యూట్ అండర్ స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్
స్థాపితం1993
డైరక్టరుడాక్టర్ బి.వెంగమ్మ
స్థానంతిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
అథ్లెటిక్ మారుపేరుSVIMS - స్విమ్స్
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)
జాలగూడుhttp://svimstpt.ap.nic.in/

శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) అనేది రాష్ట్ర శాసనసభ చట్టం క్రింద ఒక వైద్య సంస్థ, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక ప్రత్యేక ఆసుపత్రి. విశ్వవిద్యాలయ హోదా కలిగిన సంస్థ. ఆధునిక వైద్య శాస్త్రం, సాంకేతిక సేవ, శిక్షణ, విద్య అనేవి దీని ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో, స్వింస్ విద్యా, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలు యందు అసాధారణంగా అభివృద్ధి చెందింది.

స్విమ్స్ వివిధ డిఎమ్, ఎమ్‌సిహెచ్, ఎమ్‌డి కోర్సులు చేసేందుకు 2003 సంవత్సరం నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా [1][2] చే గుర్తింపబడింది. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద [3] 2006లో, భారతదేశ ప్రభుత్వ ఎయిమ్స్, న్యూ ఢిల్లీతో సమానంగా మెరుగుదలలకు ప్రతిపాదించిన సంస్థలలో ఒకటి అయిన స్విమ్స్ చేర్చబడింది

శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల

[మార్చు]

శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో మహిళల కోసం అంకితం చేయబడిన ఒక వైద్య కళాశాల. ఈ కళాశాలను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఈ కళాశాల 2014 సంవత్సరంలో స్థాపించబడింది. దీనికి 150 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది, గుర్తించింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-10. Retrieved 2014-11-14.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-10. Retrieved 2014-11-14.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-18. Retrieved 2014-11-14.