Jump to content

ట్రెవర్ బార్బర్

వికీపీడియా నుండి
ట్రెవర్ బార్బర్
బార్బర్ (1956)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచర్డ్ ట్రెవర్ బార్బర్
పుట్టిన తేదీ(1925-06-03)1925 జూన్ 3
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2015 ఆగస్టు 7(2015-08-07) (వయసు 90)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 80)1956 3 March - West Indies తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC
మ్యాచ్‌లు 1 49
చేసిన పరుగులు 17 2002
బ్యాటింగు సగటు 8.50 23.01
100లు/50లు 0/0 1/14
అత్యధిక స్కోరు 12 117
వేసిన బంతులు 0 12
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 61/2
మూలం: Cricinfo, 2017 1 April

రిచర్డ్ ట్రెవర్ బార్బర్ (1925, జూన్ 3 - 2015, ఆగస్టు 7)[1] న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1956లో వెస్టిండీస్‌తో వెల్లింగ్‌టన్‌లో ఒక టెస్టు ఆడాడు.

జననం, విద్య

[మార్చు]

బార్బర్ 1925, జూన్ 3న వెల్లింగ్‌టన్‌కు ఉత్తరాన ఉన్న కపిటి తీరంలో ఒటాకిలో జన్మించాడు. అక్కడ ఇతని కుటుంబానికి డైరీ ఫామ్ ఉంది. వెల్లింగ్టన్ కళాశాలలో బోర్డర్‌గా చదివాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. బార్బర్ 1945-46 నుండి 1958-59 వరకు వెల్లింగ్‌టన్ తరపున, 1959-60లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున క్రికెట్ ఆడాడు. 1953-54లో వెల్లింగ్‌టన్‌లో ఒటాగోపై తన ఏకైక సెంచరీ (117 పరుగులు) చేశాడు. ఇది అతను వికెట్ కీపింగ్ చేసిన రెండు ప్లంకెట్ షీల్డ్ మ్యాచ్‌లలో ఒకటి.[3] 1950-51, 1951-52, 1955-56 నుండి 1957-58 వరకు వెల్లింగ్టన్, 1959-60లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. వెల్లింగ్టన్ 1956-57లో ఇతని కెప్టెన్సీలో షీల్డ్‌ను గెలుచుకున్నది. 1958 ఫిబ్రవరిలో నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్ మధ్య జరిగిన ట్రయల్ మ్యాచ్‌లో నార్త్ ఐలాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో 51 పరుగులతో యాభై స్కోరు చేసిన ఇరువైపులా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కానీ అతను తదుపరి ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు.[4]

చివరి జీవితం

[మార్చు]

షెల్ ఆయిల్ కంపెనీలో పనిచేశాడు, అక్కడ క్రికెట్, గోల్ఫ్ స్పాన్సర్‌షిప్‌కు బాధ్యత వహించాడు.[2] 2013, మార్చి 1న సామీ గిల్లెన్ మరణంతో, బార్బర్ జీవించివున్న అత్యంత వృద్ధ న్యూజీలాండ్ టెస్ట్ క్రికెటర్‌ అయ్యాడు. 90 సంవత్సరాల వయస్సులో 2015, ఆగస్టు 7న మరణించాడు. ఇతని మరణం తరువాత, జాన్ రీడ్ మనుగడలో ఉన్న న్యూజీలాండ్ టెస్ట్ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడు అయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Former New Zealand batsman Trevor Barber dies at 90". ESPNCricinfo. 10 August 2015. Retrieved 10 August 2015.
  2. 2.0 2.1 (2015). "Obituaries".
  3. "Wellington v Otago, 1953-54". Cricketarchive.com. 1954-01-09. Retrieved 2013-04-06.
  4. "North Island v South Island 1957-58". CricketArchive. Retrieved 2 December 2020.
  5. "List of oldest living Test players". Stats.espncricinfo.com. Retrieved 2013-04-06.

బాహ్య లింకులు

[మార్చు]