Jump to content

టైమ్‌లెస్ టెస్టు

వికీపీడియా నుండి

టైమ్‌లెస్ టెస్టు అనేది సమయ పరిమితి లేకుండా ఆడే టెస్టు క్రికెట్ మ్యాచ్. అంటే ఏదో ఒక జట్టు గెలిచే వరకూ లేదా మ్యాచ్ టై అయ్యే వరకూ మ్యాచ్ జరుగుతూనే ఉంటుంది. సైద్ధాంతికంగా మ్యాచ్ డ్రా అయ్యే అవకాశమే ఉండదు. సమయం ముగిసినప్పుడు మ్యాచ్ డ్రా అవుతుంది గదా అని డిఫెన్స్‌గా ఆడటం కుదరదు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యం అయినప్పటికీ, స్పష్టమైన ఫలితంతోనే మ్యాచ్ ముగుస్తుంది. ఒక జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవసరం కూడా ఉండదని దీని అర్థం. ఎందుకంటే సమయం అయిపోతోందనే ఒత్తిడి ఉండదు, అది గేమ్‌ను గెలిచే అవకాశాలను ప్రభావితం చేయదు.

ఈ పద్ధతి వలన ఫలితానికి హామీ ఇస్తున్నప్పటికీ, మ్యాచ్ ఎప్పుడు ముగుస్తుందో ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం కావడం, దాంతో షెడ్యూల్ చేయడం, వాణిజ్యపరమైన అంశాలు కుదరక పోవడం వలన దాన్ని పక్కన పెట్టేసారు. ఆధునిక యుగంలో జట్లు తరచుగా కొన్ని వారాల వ్యవధిలో వరసబెట్టి టెస్టులు ఆడతాయి. ఐదు రోజుల సమయ పరిమితి లేనట్లైతే ఇది అసాధ్యం.

చరిత్ర

[మార్చు]

1877 - 1939 మధ్య 99 టైమ్‌లెస్ టెస్టులు జరిగాయి [1]

రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఆస్ట్రేలియాలో అన్ని టెస్టులూ టైమ్‌లెస్ గానే ఉండేవి. [2] 1882లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో రెండు మాత్రమే డ్రా అయ్యాయి. అవి కూడా ప్రయాణించే ఓడన షెడ్యూలు కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయాయి. [3] మ్యాచ్‌ల సమయంలో పిచ్‌లను కప్పకుండా వదిలివేసేవాళ్ళు. ఆస్ట్రేలియా వాతావరణంలో బాగా నీరు ఉన్న పిచ్‌లు ఎండిపోయి, మ్యాచ్ జరుగుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడతాయి. సాధారణంగా నాల్గవ, ఐదవ రోజు నాటికి బ్యాటింగు కష్టతరం అవుతుంది. [4] ఆస్ట్రేలియాలో సుదీర్ఘమైన టెస్టు మ్యాచ్ 1929లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన ఐదవ టెస్టు. ఇది ఎనిమిది రోజుల పాటు సాగింది. ఎనిమిదో రోజు 20,000 మంది ప్రేక్షకుల ముందు ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. [5] [6] [7]

1912 ముక్కోణపు టోర్నమెంట్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన తొమ్మిదో మ్యాచ్, ఇంగ్లండ్‌లో ఆడిన మొదటి టైమ్‌లెస్ టెస్టు. [8] ఆస్ట్రేలియా బయట జరిగిన కొన్ని సిరీస్‌లలో, సిరీస్ ఫలితం చివరి మ్యాచ్ ఫలితం పైన ఆధారపడి ఉన్నట్లైతే, చివరి టెస్టును టైమ్‌లెస్ టెస్టుగా మార్చేవాళ్ళు. ఇది 1930లో కింగ్‌స్టన్‌లో జరిగింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య నాల్గవ (ఆఖరి) టెస్టు ఏడు రోజుల పాటు కొనసాగి, చివరికి ఓడ ప్రయాణం దగ్గరపడడంతో రద్దు చేయవలసి వచ్చింది. 1938లో ది ఓవల్‌లో ఐదవ టెస్టులో ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగులో రెండున్నర రోజులు ఆడి, 7 వికెట్ల నష్టానికి 903 పరుగులు చేసి, డిక్లేరు చేసింది. నాల్గవ రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియాను రెండుసార్లు ఔట్ చేసింది.[9] [10] [11]

దక్షిణాఫ్రికాలో మొదటి టైమ్‌లెస్ టెస్టు 1923 ఫిబ్రవరిలో డర్బన్‌లో జరిగింది. నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్ విజయం ఎవరిదో తేలలేదు. ఐదో మ్యాచ్‌ ఆరో రోజు ఆట ప్రారంభంలోనే ఇంగ్లండ్ విజయం సాధించింది. కొబ్బరి మట్టలలో ఉన్న కప్పలను తొలగించడానికి గ్రౌండ్ స్టాఫ్‌కు కాస్త సమయం పట్టడంతో ఆట ప్రారంభం ఆలస్యమైంది. [12]

1939లో డర్బన్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ఐదవ టెస్టు పన్నెండు రోజుల పాటు సాగింది.[13] అందులో ఆట జరిగింది తొమ్మిది రోజులు, ఆ తర్వాత డ్రాగా రద్దు చేసారు. అప్పుడు కూడా ఇంగ్లండ్ జట్టు స్వదేశానికి వెళ్లే ఓడ మిస్సౌతుంది కాబట్టి అపేయాల్సి వచ్చింది. [14] ఆ మ్యాచ్ మార్చి 3న ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా 696 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్‌కు నిర్దేశించింది. మార్చి 14న ఇంగ్లాండ్ తమ ఓడ ఎక్కేందుకు బయలుదేరాల్సిన సమయానికి, అది 5 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసింది (ఫస్ట్-క్లాస్‌లో నాలుగో ఇన్నింగ్సులో ఏ జట్టైనా చేసిన అత్యధిక స్కోరు అది). [15] ఇది అత్యంత సుదీర్ఘమైన టెస్టు క్రికెట్ మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. మ్యాచ్‌కు ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుందని ఊహించలేదు. కానీ వర్షం వలన, రోలింగు వలన మ్యాచ్ మధ్యలో మూడుసార్లు పిచ్‌కు పునరుజ్జీవం కలిగించారు. మ్యాచ్ రద్దైన రోజున కూడా పిచ్, బ్యాటింగుకు అనుకూలంగా మంచి స్థితిలోనే ఉంది. [16]

ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టైమ్‌లెస్ టెస్టుని అమలు చేయాలని ఐసిసి ఒకప్పుడు పరిశీలించింది. [17]

ఇతర క్రీడలతో పోలిక

[మార్చు]

సమయ పరిమితి లేని కొన్ని ఇతర క్రీడలలో బేస్ బాల్ ఒకటి. బేస్‌బాల్ గేమ్‌లను సస్పెండ్ చేయవచ్చు (పాజ్ చేయవచ్చు). అవి అనేక రోజులలో కూడా ఆడవచ్చు. టైడ్ టైమ్‌లెస్ టెస్టులకు టైబ్రేకర్లుండవు. బేస్ బాల్‌లో అలా కాకుండా, అదనపు ఇన్నింగ్సులు ఉంటాయి.

టైమ్‌లెస్ టెస్టుల జాబితా

[మార్చు]
Test Matches Home team Away team
1876–77 లో 2 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1878–79 లో ఒక టెస్టు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1881–82 లో 4 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1882–83 లో 4 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1884–85 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1886–87 లో 2 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1887–88 లో ఒక టెస్టు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1891–92 లో 3 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1894–95 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1897–98 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1901–02 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1903–04 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1907–08 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1910–11 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  దక్షిణాఫ్రికా
1911–12 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1912 లో ఒక టెస్టు  ఇంగ్లాండు  ఆస్ట్రేలియా
1920–21 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1922–23 లో ఒక టెస్టు  దక్షిణాఫ్రికా  ఇంగ్లాండు
1924–25 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1926 లో ఒక టెస్టు  ఇంగ్లాండు  ఆస్ట్రేలియా
1928–29 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1929–30 లో ఒక టెస్టు  వెస్ట్ ఇండీస్  ఇంగ్లాండు
1930 లో ఒక టెస్టు  ఇంగ్లాండు  ఆస్ట్రేలియా
1930–31 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  వెస్ట్ ఇండీస్
1931–32 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  దక్షిణాఫ్రికా
1932–33 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1934 లో ఒక టెస్టు  ఇంగ్లాండు  ఆస్ట్రేలియా
1936–37 లో 5 టెస్టులు  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు
1938 లో ఒక టెస్టు  ఇంగ్లాండు  ఆస్ట్రేలియా
1938–39 లో ఒక టెస్టు  దక్షిణాఫ్రికా  ఇంగ్లాండు

మూలాలు

[మార్చు]
  1. John Lazenby, Edging Towards Darkness: The Story of the Last Timeless Test, Bloomsbury, London, 2017, p. 180.
  2. Lazenby, p. 5.
  3. Lazenby, pp. 188-89.
  4. Lazenby, p. 229.
  5. Lazenby, p. 5.
  6. "5th Test, England tour of Australia at Melbourne, Mar 8-16 1929". Cricinfo. Retrieved 29 March 2018.
  7. . "Australia wins final Test by five wickets".
  8. Lazenby, p. 59.
  9. Lazenby, pp. 187-88.
  10. "4th Test, England tour of West Indies at Kingston, Apr 3-12 1930". Cricinfo. Retrieved 29 March 2018.
  11. "5th Test, Australia tour of England at London, Aug 20-24 1938". Cricinfo. Retrieved 29 March 2018.
  12. Lazenby, p. 59.
  13. "England in South Africa Test Series – 5th Test". ESPN Cricinfo. Retrieved 20 December 2014.
  14. "Stalemate in the Timeless Test". ESPN Cricinfo. Retrieved 20 December 2014.
  15. Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. pp. 216–217. ISBN 978-1-84607-880-4.
  16. Lazenby, pp. 99-181.
  17. Gollapudi, Nagraj. "ICC could use 'timeless' Test for World Championship final". Cricinfo. Retrieved 29 March 2018.