Jump to content

టెడ్ బాడ్‌కాక్

వికీపీడియా నుండి
టెడ్ బాడ్‌కాక్
దస్త్రం:Blunt and Badcock.jpg
రోజర్ బ్లంట్ తో టెడ్ బాడ్‌కాక్ (కుడివైపు)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫ్రెడరిక్ థియోడర్ బాడ్‌కాక్
పుట్టిన తేదీ(1897-08-09)1897 ఆగస్టు 9
అబోటాబాద్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ1982 సెప్టెంబరు 19(1982-09-19) (వయసు 85)
సౌత్ పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రఆల్‌రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 1)1930 10 January - England తో
చివరి టెస్టు1933 31 March - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1924/25–1929/30Wellington
1930/31–1936/37Otago
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 7 53
చేసిన పరుగులు 137 2383
బ్యాటింగు సగటు 19.57 25.62
100లు/50లు 0/2 4/13
అత్యధిక స్కోరు 64 155
వేసిన బంతులు 1,608 15995
వికెట్లు 16 221
బౌలింగు సగటు 38.12 23.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 14
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 5
అత్యుత్తమ బౌలింగు 4/80 7/50
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 38/–
మూలం: Cricinfo, 2017 11 April

ఫ్రెడరిక్ థియోడర్ బాడ్‌కాక్ (1897, ఆగస్టు 9 - 1982, సెప్టెంబరు 19) న్యూజీలాండ్ ఫస్ట్-క్లాస్, టెస్ట్ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్‌లో అత్యుత్తమ ఆల్-రౌండర్ గా రాణించాడు. 1930 - 1933 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1930లో న్యూజీలాండ్ ప్రారంభ టెస్ట్ కూడా ఉంది. న్యూజీలాండ్‌ నుండి ఆడిన తొలి ఆటగాడు అతనే.

తొలి క్రికెట్ కెరీర్

[మార్చు]

బాడ్‌కాక్ 1924-25, 1929-30 మధ్య వెల్లింగ్‌టన్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1945లో ఇంగ్లాండ్‌లో ఒటాగో తరపున చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ తో 1936-37 వరకు ఆడాడు.[1]

మంచి బ్యాట్స్‌మన్ గా, బౌలర్ గా, అద్భుతమైన ఫీల్డర్ గా రాణించాడు. న్యూజీలాండ్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా నిలిచాడు. బ్యాటింగ్‌ కూడా ప్రారంభించాడు. దేశీయ క్రికెట్‌లో తన మొదటి మూడు సీజన్లలో బంతితో గొప్ప విజయాన్ని సాధించాడు. 1925–26లో 17.05 బౌలింగ్ సగటుతో నాలుగు మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీసుకున్నాడు. 1926–27లో మూడు మ్యాచ్‌ల్లో 11.69 సగటుతో 23 వికెట్లు తీసుకున్నాడు. 1927-28లో మూడు మ్యాచ్‌లలో 17.94 సగటుతో 17 వికెట్లు తీశాడు.[2] మొదటి మ్యాచ్ లో 65, రెండవ మ్యాచ్‌లో 57 పరుగులు చేశాడు. 1927లో కాంటర్‌బరీకి వ్యతిరేకంగా తన తొలి ఫస్ట్ సెంచరీ సాధించాడు.[3]

1927లో ఇంగ్లాండ్‌లో పర్యటించడానికి న్యూజీలాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[4] బాడ్‌కాక్ 1927-28లో ఆస్ట్రేలియన్ టూరిస్టులపై వెల్లింగ్‌టన్ తరపున 4/82, 4/23 బౌలింగ్ గణాంకాలు సాధించాడు.[5] ఆపై జరిగిన రెండు ప్రాతినిధ్య మ్యాచ్‌లలో న్యూజీలాండ్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. మొదటి మ్యాచ్‌లో 1/121, రెండవ మ్యాచ్‌లో 0/14, 2/33 మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్ లో క్లారీ గ్రిమ్మెట్ చేతిలో రెండుసార్లు స్కోర్ చేయకుండా బౌల్డ్ అయ్యాడు. అతని ఇతర పూర్తయిన ఇన్నింగ్స్‌లో రెండు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.[6][7]

తర్వాత క్రికెట్ కెరీర్

[మార్చు]

మొత్తంగా 53 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 25.62 బ్యాటింగ్ సగటుతో నాలుగు ఫస్ట్-క్లాస్ సెంచరీలు,[8] 13 అర్ధశతకాలు చేశాడు. 1927 జనవరిలో కాంటర్‌బరీతో జరిగిన ప్లంకెట్ షీల్డ్ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ తరఫున టాప్ స్కోర్ 155 (తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీ) చేశాడు. 23.57 సగటుతో 221 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీశాడు. 14 సందర్భాలలో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, ఐదుసార్లు ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీశాడు. 1925 జనవరిలో కాంటర్‌బరీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 7/50తో అత్యుత్తమ బౌలింగ్ చేశాడు.[9]

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]