ఎఖిడ్నా

వికీపీడియా నుండి
(టాకీగ్లాసిడే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఎఖిడ్నాలు[1]
Temporal range: Miocene–Recent
Western Long-beaked Echidna
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
టాకీగ్లాసిడే

Gill, 1872
జాతులు

Genus Tachyglossus
   T. aculeatus
Genus Zaglossus
   Z. attenboroughi
   Z. bruijnii
   Z. bartoni
   †Z. hacketti
   †Z. robustus
Genus †Megalibgwilia
   †M. ramsayi
   †M. robusta

A Short-beaked Echidna curled into a ball; the snout is visible on the right.
In Australia the Short-beaked Echidna may be found in many environments, including urban parkland such as the shores of Lake Burley Griffin in Canberra, as depicted here.
A French Island echidna building a defensive burrow (0:43s)
Short-beaked Echidna

ఎకిడ్నా లేదా ఎఖిడ్నా (ఆంగ్లం: Echidnas), also known as spiny anteaters, [2] టాకీగ్లాసిడే (Tachyglossidae) కుటుంబానికి చెందిన జీవులు. ఇవి ప్లాటిపస్ వలె మోనోట్రిమేటా క్రమానికి చెందిన గుడ్లు పెట్టే క్షీరదాలు. ఇవి న్యూ గినియా, ఆస్ట్రేలియా దేశాలలో జీవిస్తున్నాయి.

వివరాలు

[మార్చు]

వీని ప్రధానమైన ఆహారం చీమలు, చెదపురుగులు. వీటి నోటిలో పళ్ళు ఉండవు. సుమారు 15 సెం.మీ. పొడవైన నాలుక ఉంటుంది. నాలుకపై ఉన్న జిగట పదార్థం వల్ల చీమలు మొదలైన చిన్న క్రిములు దానికి అంటుకుంటాయి. వెంటనే నోటిలోపలికి తీసుకొని వాటిని చప్పరించి మింగేస్తుంది.

ఫ్రెంచ్ ఐలాండ్ నేషనల్ పార్క్ (43 సెకన్లు)లో ఒక చిన్న-ముక్కు గల ఎకిడ్నా రక్షణాత్మక బురోను నిర్మిస్తోంది

వీటిని చిన్న పాదాలు ఉంటాయి. వాటితో పరిగెత్తలేదు కాని గోతులు మాత్రం తవ్వుతుంది. ఏదైన ఆపద ఎదురైతే గుండ్రంగా బంతిలా చుట్టుకుపోయి ముఖాన్ని, పాదాల్ని దాచేసుకుంటుంది. వేగంగా పరుగెత్తలేకపోయినా ఇవి నీటిలో ఈదగలవు.

ఆడ ఎఖిడ్నా ఏడాదికి ఒక చిన్న గుడ్డును మాత్రమే పెడుతుంది. కంగారు మాదిరిగా ఈ గుడ్డు ఓ సంచిలాంటి దానిలో ఉంచుకుని పొదుగుతుంది. పదిరోజుల తరువాత గుడ్డు నుండి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల కేవలం 2 సెం.మీ. పొడవుంటుంది. సంచిలోని ప్రత్యేకమైన గ్రంథుల ద్వారా ఇది తల్లి పాలు తాగుతుంది. ఇలా సంచిలోనే 53 రోజులుంటుంది. తరువాత తల్లి దానిని బయటకు తీసి గొయ్యిలో ఉంచుతుంది. పదిరోజులకొకసారి వచ్చి ఆహారం పెడుతుంది. ఇలా ఏడు నెలను పెంచాక పిల్ల గొయ్యిని వదిలి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకోవడం ప్రారంభిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. గ్రోవ్స్, సి. (2005). విల్సన్, డి.ఇ; రీడర్, డి. ఎమ్ (eds.). మామల్ స్పీసీస్ ఆఫ్ ది వరల్డ్ (3rd ed.). బాల్టిమోర్: జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రెస్. pp. 1–2. OCLC 62265494. ISBN 0-801-88221-4.
  2. "Echidna/Spiny Anteater Printout- EnchantedLearning.com". www.enchantedlearning.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-21.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎఖిడ్నా&oldid=3848151" నుండి వెలికితీశారు