Jump to content

జోయా అగర్వాల్

వికీపీడియా నుండి
జోయా అగర్వాల్
జోయా అగర్వాల్
జాతీయతఇండియన్
విద్యఏవియేషన్
వృత్తిపైలెట్
క్రియాశీల సంవత్సరాలు2004 నుండి ఇప్పటివరకు
ఉద్యోగంఎయిర్ ఇండియా
వెబ్‌సైటుwww.captainzoya.com

జోయా అగర్వాల్ ఎయిర్ ఇండియా పైలెట్. ఈమె భారత ప్రభుత్వం చేపట్టిన 'వందే భారత్ మిషన్ 'లో భాగంగా శాన్ ప్రాన్సిస్కో నుండి బెంగుళూరు వరకు ఉత్తర ధ్రువం (మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ) మీదుగా 17 గంటల పాటు ఏకధాటిగా విమానం నడిపి రికార్డు సృష్టించింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విమాన మార్గాలలో ఒకటి.[1]

చదువు, ఉద్యోగం

[మార్చు]

జోయాకి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, ఆమె దూరదర్శన్ లో రాజీవ్ గాంధీని చూసి స్ఫూర్తి పొంది తాను కూడా పైలెట్ కావాలనుకొంది. డిగ్రీ చేస్తూనే ఏవియేషన్ కోర్సు చేసింది. కోర్సు పూర్తి అయ్యాక ఎయిర్ ఇండియాలో పైలెట్ గా చేరింది. 2004 సంవత్సరములో తన మొదటి విమానాన్ని ఢిల్లీ నుండి దుబాయికి నడిపింది. 2013 సంవత్సరములో బోయింగ్ 777-300ER జెట్ ను నడిపింది.[2] 2021సంవత్సరము ఆగస్టు 12న ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం’ పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా జోయాను నియమించింది.[3]

    "యువ ఔత్సాహిక మహిళా పైలట్లు, యువత, స్వీయ సందేహాలను ఎదుర్కొనే ఎవరైనా తమ

                       రెక్కలను విప్పడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి స్ఫూర్తినివ్వడమే నా లక్ష్యం"

                                                                                    -కెప్టెన్ జోయా

సాధించిన విజయాలు

[మార్చు]
  • మొత్తం మహిళా సిబ్బందితో 2021 లో ప్రపంచంలోని అతి పొడవైన విమాన మార్గాలలో ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించిన మొదటి మహిళా కమాండర్.
  • భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్‌లో భాగంగా కోవిడ్ -19 మహమ్మారి సమయంలో 12 దేశాల నుండి 64 ట్రిప్పులలో 15000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది.[4]
  • ప్రపంచంలోనే బోయింగ్ 777-300ER జెట్‌ని నడిపిన అతి చిన్న వయస్కురాలు.

పురస్కారాలు

[మార్చు]
  • ప్రైడ్ ఆఫ్ ది నేషన్ వారియర్ అవార్డు (2021)
  • వుమెన్ లీడర్స్ 2021 అవార్డు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Air India's Zoya Aggarwal to command world's longest route". Hindustan Times. 2021-01-09. Retrieved 2021-08-15.
  2. "Meet Captain Zoya Aggarwal, pilot flying Air India's first non-stop flight over North Pole". India Today. Retrieved 2021-08-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Air India's record-breaking pilot Zoya Agarwal selected for UN project". Tribuneindia News Service. Retrieved 2021-08-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "ఏదీ సులభంగా రాదు: జోయా అగర్వాల్‌". Sakshi. 2021-05-26. Retrieved 2021-08-15.