Jump to content

జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్

వికీపీడియా నుండి
(జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ నుండి దారిమార్పు చెందింది)


జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్
జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్
జననం13 జూన్ , 1831
ఎడింబరో , స్కాట్‌లాండ్
మరణం5 నవంబరు , 1879
కేంబ్రిడ్జి , ఇంగ్లాండ్
నివాసంస్కాట్‌లాండ్
జాతీయతస్కాటిష్
రంగములుగణితం, భౌతికశాస్త్రం
చదువుకున్న సంస్థలుకేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిమాక్స్‌వెల్ సమీకరణాలు , మాక్స్‌వెల్ డిస్ట్రిబ్యూషన్
ముఖ్యమైన పురస్కారాలురుమ్‌ఫోర్డ్ మెడల్ , అడామ్ బహుమతి

జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ (13 జూన్, 18315 నవంబర్, 1879) స్కాట్లండులో జన్మించిన ఒక భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు. ఆతని విశేషమైన కృషి వల్ల మాక్స్‌వెల్ సమీకరణాలు ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్ విద్యుత్ ను, అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రతిపాదించెను. మాక్స్ వెల్-బోల్ట్ జ్మెన్ డిస్ట్రిబ్యూషన్, వాయువు లలో గతి శక్తిని వర్ణించడానికి ఉపయోగపడును. ఈ రెండింటి ఫలితముగా నవీన భౌతిక శాస్త్రమునకు ద్వారములు తెరుచుకుని క్వాంటమ్ మెకానిక్స్, ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము (స్పెషల్ రెలేటివిటి ) వంటి చారిత్రాత్మకమైన ఆవిష్కరణలకు పునాదులు పడ్డాయి. 1861 లో మొదటి సారి కలర్ ఫొటోగ్రాఫ్ తీసిన ఖ్యాతి కూడా ఆతనికే దక్కింది.