Jump to content

జినా హికాకా

వికీపీడియా నుండి
జినా హికాకా
జినా హికాకా

జినా హికాకా


పదవీ కాలం
2014 – 2019
ముందు జయరామ్ పంగి
తరువాత సప్తగిరి శంకర్ ఉలక
నియోజకవర్గం కోరాపుట్

పదవీ కాలం
2009 మే 19 – 2014 మే 16
ముందు అనంతరామ్ మాఝి
తరువాత కైలాష్ చంద్ర కులేసిక
నియోజకవర్గం లక్ష్మీపూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
జీవిత భాగస్వామి కౌసల్య హికాకా
సంతానం రోహిత్ హికాకా, కిరణ్ హికాకా, దివ్యాన్షు హికాకా
వృత్తి రాజకీయ నాయకుడు

జినా హికాకా (జననం 1 జనవరి 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోరాపుట్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయా జీవితం

[మార్చు]

జినా హికాకా బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 ఒడిశా శాసనసభ ఎన్నికలలో లక్ష్మీపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బిజెడి అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో హౌస్ కమిటీ, ఎస్సీ/ఎస్టీ/ఓబిసి స్టాండింగ్ కమిటీ, పునరావాసం & పరిశ్రమ కమిటీ, గిరిజన సలహా కమిటీ, లైబ్రరీ కమిటీలలో సభ్యుడిగా పని చేశాడు.

జినా హికాకాను 2012 మార్చి 24న తన సొంత జిల్లా కోరాపుట్‌లో మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే స్వేచ్ఛకు బదులుగా ఒడిశా జైళ్లలోని 29 మంది ఖైదీలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 33 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న ఆయనను మావోయిస్టులు నారాయణపట్న సమీపంలోని బలిపేటలో విడుదల చేశారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Jhina Hikaka". The Times of India. 2024. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
  2. "Koraput Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
  3. "Odisha MLA Jhina Hikaka released by Maoists". The Times of India. 2012-04-26. Archived from the original on 2012-07-01. Retrieved 2012-05-21.