Jump to content

జాన్ ట్రైకోస్

వికీపీడియా నుండి
జాన్ ట్రైకోస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అథనాసియోస్ జాన్ ట్రైకోస్
పుట్టిన తేదీ (1947-05-17) 1947 మే 17 (వయసు 77)
జగాజిగ్, ఈజిప్ట్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఆఫ్ స్పిన్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 235/11)1970 5 February 
South Africa - Australia తో
చివరి టెస్టు1993 13 March 
Zimbabwe - India తో
తొలి వన్‌డే (క్యాప్ 11)1983 9 June 
Zimbabwe - Australia తో
చివరి వన్‌డే1993 25 March 
Zimbabwe - India తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1968–1979Rhodesia
1993/94Mashonaland
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 7 27 122 125
చేసిన పరుగులు 19 88 1,198 331
బ్యాటింగు సగటు 3.16 11.00 11.40 10.34
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 5* 19 43 21*
వేసిన బంతులు 1611 1524 25,267 7,059
వికెట్లు 18 19 289 104
బౌలింగు సగటు 42.72 51.94 34.60 38.73
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 8 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/86 3/35 6/66 4/20
క్యాచ్‌లు/స్టంపింగులు 8/0 3/0 109/0 42/0
మూలం: CricketArchive, 2017 31 January

అథనాసియోస్ జాన్ ట్రైకోస్ (జననం 1947, మే 17) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు, జింబాబ్వే క్రికెట్ జట్టులకు ప్రాతినిధ్యం వహించాడు.[1] ప్రధానంగా ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. ఒకటి కంటే ఎక్కువ దేశాలకు అత్యున్నత స్థాయిలో ఆడిన కొద్దిమంది క్రికెటర్లలో ఒకడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

ఇతడు రోడేషియాలో పెరిగాడు, ఆ దేశం తరపున క్రికెల్ ఆడాడు. నాటల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు ట్రెవర్ గొడ్దార్డ్[2] చే శిక్షణ పొంది 1967, జూన్ 24న ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయాలకు ప్రాతినిధ్యం వహించాడు, మొదటి ఇన్నింగ్స్‌లో 5-54 సాధించాడు.[3] 1968, జనవరి 27న రోడేషియా అరంగేట్రం చేయడానికి ముందు మరో రెండు సందర్భాలలో దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయాల జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[4]

దక్షిణాఫ్రికా క్రికెట్

[మార్చు]

దక్షిణాఫ్రికా కెప్టెన్ అలీ బాచర్ అభ్యర్థన మేరకు ఎంపిక చేయబడిన విద్యార్థిగా ఉండగానే 1970 ఫిబ్రవరిలో డర్బన్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తరపున తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[5] అరంగేట్రం టెస్టులోనే నాలుగు క్యాచ్‌లు, మూడు వికెట్లు తీశాడు. అయితే, అతను ఈ సిరీస్‌లో మూడుసార్లు ఆడిన తర్వాత, వర్ణవివక్ష కారణంగా దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ నుండి నిషేధించబడింది.

జింబాబ్వే క్రికెట్

[మార్చు]

ఆ తరువాత రోడేషియా కోసం ఆడటం కొనసాగించాడు. 1980లో దేశం పేరు మార్చబడిన తర్వాత 1982, 1986, 1990 ఐసీసీ ట్రోఫీ టోర్నమెంట్‌లలో జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించాడు. 1983 క్రికెట్ ప్రపంచ కప్‌లో జింబాబ్వే తరపున కూడా ఆడాడు.[6] 1987 ప్రపంచ కప్‌లో జింబాబ్వే ఆరు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు, 1992 ప్రపంచ కప్‌లో కూడా ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Where are they now? Zimbabwe's 1992 World Cup win over England". The Cricket Paper. 19 January 2016. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 3 April 2021.
  2. "Spinning at the Top". Sport in Greece. Archived from the original on 16 July 2011. Retrieved 14 January 2010.
  3. "First Class Matched played by John Traicos (122)". Retrieved 9 May 2012.
  4. "First Class Matched played by John Traicos (122)". Retrieved 9 May 2012.
  5. Rodney Hartman, Ali: The Life of Ali Bacher, Penguin, Johannesburg, 2006, p. 132.
  6. "Zimbabwe stun feeble Australians". ESPNcricinfo. Retrieved 18 July 2007.

బాహ్య లింకులు

[మార్చు]