జాతీయ రహదారి 19

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 19
19
జాతీయ రహదారి 19
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 19
Durgapur Xpressway.jpg
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వే - ఎన్‌హెచ్ 19
మార్గ సమాచారం
Part of AH1
AH20
Length1,323 కి.మీ. (822 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరఆగ్రా, ఉత్తర ప్రదేశ్
తూర్పు చివరదంకుని, పశ్చిమ బెంగాల్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్
ప్రాథమిక గమ్యస్థానాలుఎటావా, కాన్పూర్, ఫతేపూర్, ప్రయాగరాజ్, వారణాసి, ముఘల్‌సరాయ్, సాసారం, ఔరంగాబాద్, గోబింద్‌పూర్, అసన్‌సోల్, దుర్గాపూర్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 44 ఎన్‌హెచ్ 16

జాతీయ రహదారి 19 (ఎన్‌హెచ్ 19) భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులలో ఒకటి.[1] దీనిని గతంలో ఢిల్లీ-కోల్‌కతా రోడ్ అనేవారు. జాతీయ రహదారి సంఖ్యలను పునర్వ్యవస్థీకరించిన తరువాత, ఢిల్లీ నుండి ఆగ్రా మార్గం ఇప్పుడు జాతీయ రహదారి 44 గాను, ఆగ్రా నుండి కోల్‌కతా మార్గం జాతీయ రహదారి 19గానూ మారాయి. [2] [3] ఇది చారిత్రిక గ్రాండ్ ట్రంక్ రోడ్‌లో ఒక ముఖ్యమైన భాగం. జపాన్ నుండి టర్కీ వరకు ఉన్న ఆసియా హైవే నెట్‌వర్క్ లోనిAH1 లో ఇది ఒక భాగం.

2010లో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల సంఖ్యలను పునర్వ్యవస్థీకరించే ముందు దీనిని ఎన్‌హెచ్ 2 (పాతది) అని పిలిచేవారు.

పొడవు

[మార్చు]

1,269.7 కి.మీ. (789.0 మై.) పొడవున్న ఈ రహదారి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా వెళుతుంది.[4][2]

ఆయా రాష్ట్రాల్లో ఎన్‌హెచ్ 19 పొడవులు:

జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు

[మార్చు]
భారత జాతీయ రహదారుల స్కీమాటిక్ మ్యాప్

మార్గం

[మార్చు]
ఎన్‌హెచ్-19, ఖాగా, ఫతేపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ .

జాతీయ రహదారి 19, ఆగ్రాను కోల్‌కతాను కలుపుతుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా పోతుంది.[2][4]

ఆగ్రా వద్ద ఉన్న ఎన్‌హెచ్-44తో కూడలి వద్ద మొదలై, ఎన్‌హెచ్ 19 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్, అలహాబాద్, వారణాసి, మోహనియా, ససారం, డెహ్రీ ఆన్ సోన్, బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్, జార్ఖండ్ రాష్ట్రంలోని బర్హి, బగోదర్, గోవింద్‌పూర్‌లను కలుపుతూ పోతుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసన్సోల్, పల్సిట్ గుండా వెళ్ళి, కోల్‌కతా సమీపంలో ఎన్‌హెచ్-16తో కలిసి ముగుస్తుంది.

టోల్ ప్లాజాలు

[మార్చు]

ఆగ్రా నుండి కోల్‌కతా వరకు టోల్ ప్లాజాలు క్రింది విధంగా ఉన్నాయి:

ఉత్తర ప్రదేశ్
తుండ్ల, గురౌ సెమ్రా అతికాబాద్, అనంతం, బరజోడ్, బదౌరి, కటోఘన్, ప్రయాగ్‌రాజ్ బైపాస్ (ఖోఖ్‌రాజ్), లాలానగర్, డాఫీ, వారణాసి
బీహార్
మోహనియా, ససారం, సౌకలా
జార్ఖండ్
రసోయా ధమ్నా, ఘంగ్రి, బెలియాడ్
పశ్చిమ బెంగాల్
దుర్గాపూర్, పల్సిట్, దంకుని. [6]

ఎన్‌హెచ్ 19 పై ఉన్న ప్రధాన నగరాలు

[మార్చు]
ఉత్తర ప్రదేశ్
జార్ఖండ్
  • బర్హి
  • బర్కత
  • బాగోదర్
  • ఇస్రీ
  • గోవింద్‌పూర్
  • ధన్‌బాద్
పశ్చిమ బెంగాల్

కూడళ్ళు

[మార్చు]
పశ్చిమ బెంగాల్
ఎన్‌హెచ్ 419 - కల్తీ సమీపంలో
ఎన్‌హెచ్ 14 - రాణిగంజ్ దగ్గర
ఎన్‌హెచ్ 114 - బర్ధమాన్ సమీపంలో
ఎన్‌హెచ్ 116A - బర్ధమాన్ సమీపంలో
ఎన్‌హెచ్ 16 - కోల్‌కతా సమీపంలో టెర్మినల్. [2]


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 2.2 2.3 "Route substitution (amendment) for national highways 9, 19, 44 and 48 dated February 2017" (PDF). The Gazette of India. Retrieved 6 Dec 2018.
  3. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 18 April 2019.
  4. 4.0 4.1 "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 18 April 2019.
  5. 5.0 5.1 [1] Archived 25 ఫిబ్రవరి 2009 at the Wayback Machine National Highways-Source-National Highways Authority of India (NHAI)
  6. "Toll Calculator". Toll between. Retrieved 25 January 2017.