జాతీయ రహదారి 1డి (పాత సంఖ్య)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 1డి
1డి
జాతీయ రహదారి 1డి
పటం
Map of National Highway 1D in red
Nh1d.PNG
మార్గ సమాచారం
Length422 కి.మీ. (262 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరశ్రీనగర్, జమ్మూ కాశ్మీర్
Major intersectionsశ్రీనగర్‌లో ఎన్‌హెచ్ 1ఎ
తూర్పు చివరలేహ్, లడఖ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుజమ్మూ కాశ్మీర్: 422 కి.మీ. (262 మై.)
ప్రాథమిక గమ్యస్థానాలుశ్రీనగర్ - జోజి లా - కార్గిల్ - లేహ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 1ఎ ఎన్‌హెచ్ 21

నేషనల్ హైవే 1డి ( ఎన్‌హెచ్ 1డి ), జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. ఇది శ్రీనగర్‌ను లడఖ్‌లోని లేహ్‌కు కలుపుతుంది. దీన్ని శ్రీనగర్-లేహ్ హైవే అని కూడా అంటారు. 2006 లో శ్రీనగర్-లేహ్ హైవేను జాతీయ రహదారిగా ప్రకటించారు.[1] [2] ఇది ఇప్పుడు జాతీయ రహదారి 1 లో భాగం. ఇది పశ్చిమాన ఉరి వరకు విస్తరించింది.

మహారాజా రణబీర్ సింగ్, థామస్ డగ్లస్ ఫోర్సిత్ ల మధ్య 1870లో [3] కుదిరిన వాణిజ్య ఒప్పందం తర్వాత, పాత మధ్య ఆసియా వాణిజ్య మార్గమైన శ్రీనగర్-లేహ్-యార్కండ్‌ను ట్రీటీ రోడ్ అని కూడా పిలుస్తారు. [4]

కొత్త సంఖ్య

[మార్చు]

2010 లో, పాత ఎన్‌హెచ్1ఎ (ఉరి-శ్రీనగర్), పాత ఎన్‌హెచ్1డి (శ్రీనగర్-లేహ్) లను కలిపి కొత్తగా జాతీయ రహదారి 1ని రూపొందించారు. [5]

భౌగోళికం

[మార్చు]

ఎన్‌హెచ్ 1డి చాలా వరకు, ప్రమాదకరమైన భూభాగం గుండా వెళ్తుంది. సింధు నది వెంబడి ఉన్న చారిత్రిక వాణిజ్య మార్గాన్ని ఇది అనుసరించింది. తద్వారా ఆధునిక ప్రయాణికులకు చారిత్రికంగా, సాంస్కృతికంగా ముఖ్యమైన గ్రామాల సంగ్రహావలోకనం ఇస్తుంది. [6] ఈ రహదారి సాధారణంగా జూన్ ప్రారంభం నుండి నవంబరు మధ్య వరకు ట్రాఫిక్ కోసం తెరిచి ఉంటుంది. ఎన్‌హెచ్ 1 మొత్తం పొడవు 422 కి.మీ. (262 మై.) . [7]

చరిత్ర

[మార్చు]

17, 18 శతాబ్దాలలో, ఈ రహదారి ఒక చిన్న బండ్ల బాట లాగానే ఉండేది. గుర్రాలపై పోయేందుకు కూడా కష్టంగా ఉండేది. ప్రధానంగా కాశ్మీర్ శాలువ పరిశ్రమకు అవసరమైన పాష్మినా ఉన్ని వంటి వస్తువులను, యార్కండ్, టిబెట్ ల నుండి పోర్టర్లు తీసుకువెళ్ళేవారు. [8]

19వ శతాబ్దంలో, జోరావర్ సింగ్ లడఖ్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత డోగ్రా పాలనలో, గుర్రాలపై వెళ్ళేలా మార్గాన్ని మెరుగుపరచారు. [8] 1870లో, జమ్మూ కాశ్మీర్ మహారాజా రణబీర్ సింగ్, బ్రిటిష్ రాజ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ రాజ్యం, మధ్య ఆసియా సరిహద్దు (బహుశా కారకోరం పాస్ ) వరకు రహదారి నిర్వహణ చేపట్టింది. దీని కోసం వార్షిక నిధులను కేటాయించింది. ఈ రహదారికి "ట్రీటీ రోడ్" అని పేరు వచ్చింది. [8]

1950లలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా రహస్యంగా జిన్జియాంగ్ నుండి పశ్చిమ టిబెట్ వరకు, దాదాపు 1,200 కి.మీ. (750 మై.) దూరం సైనిక రహదారిని నిర్మించింది. దీన్ని 1957 లో భారతీయులు కనిపెట్టారు. 1958లో ఈ రహదారిని చూపుతున్న చైనీస్ మ్యాపులతో ఇది నిర్థారణైంది. రాజకీయ పరిస్థితులు క్షీణించాయి, 1962లో చైనా-ఇండియన్ యుద్ధంతో ఇది పరాకాష్ఠకు చేరుకుంది.

చైనా వైపు ఉన్న రహదారి చైనా సైన్యానికి నమ్మకమైన సరఫరా మార్గంగా మారింది. భారత సైన్యం కూడా తమ దళాలకు సరఫరా, సమీకరణల కోసం రహదారిని నిర్మించడానికి ఇది ప్రేరణనిచ్చింది. 1962లో శ్రీనగర్‌లో ప్రారంభమైన ఈ నిర్మాణం రెండేళ్లలో కార్గిల్‌కు చేరుకుంది. ఆధునిక శ్రీనగర్-లే హైవేకి ఇది ఆధారం. భౌగోళిక సవాళ్ళ కారణంగా ఈ రహదారిని నిర్మించడం ప్రమాదకరమైన పని. ఈ రహదారి నిర్వహణ ఇప్పటికీ సవాలే.[9]

1974లో పౌరుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేసారు.

1999 లో కార్గిల్‌పై పాకిస్తాన్ దురాక్రమణ చేసిన సమయంలో భారత సైన్యం ఈ రహదారిని సమీకరణ మార్గంగా ఉపయోగించింది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Government of Jammu and Kashmir, Ladakh Autonomous Hill Development Council Kargil (April 2006). "Monthly News Letter". Archived from the original on 17 July 2011. Retrieved 2009-06-30.
  2. ExpressIndia.com (23 April 2006). "Srinagar-Leh road gets National Highway status". ExpressIndia.com.
  3. Jyoteeshwar Pathik (1997). Glimpses of History of Jammu & Kashmir. New Delhi, India: Anmol Publications. p. 117. ISBN 81-7488-480-7. Retrieved 2009-06-30.
  4. Henry Osmaston (Editor), Philip Denwood (Editor) (1993). Recent Research on Ladakh 4 & 5: Proceedings of the Fourth and Fifth International Colloquia on Ladakh. Delhi, India: Motilal Banarsidass. p. 236. ISBN 978-81-208-1404-2. Retrieved 2009-06-30. {{cite book}}: |last= has generic name (help)
  5. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 28 Apr 2018.
  6. [1] Ladakh, the Road journey
  7. "Archived copy". Archived from the original on 10 April 2009. Retrieved 2011-07-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Details of National Highways in India-Source-Govt. of India
  8. 8.0 8.1 8.2 Warikoo, K. (1995), "Gateway to Central Asia: The transhimalayan trade of Ladakh, 1846–1947", in H. Osmaston; P. Denwood (eds.), Recent Research on Ladakh, 4 and 5, Motilal Banarsidass, p. 236, ISBN 978-81-208-1404-2
  9. Thaindian.com (28 March 2008). "Srinagar-Leh highway to reopen after remaining closed for six months". Retrieved 2009-06-30.