Jump to content

జాతీయ జీవ ఇంధన పాలసీ

వికీపీడియా నుండి
Logo Renewable Energy by Melanie Maecker-Tursun V1 bgGreen.svg
పునరుపయోగ శక్తి చిహ్నం

నూతన, తరగని ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ జీవ ఇంధనము మీద ఒక జాతీయ పాలసీ తయారు చేసింది. 11 సెప్టెంబరు 2008 న కేంద్ర కేబినెట్ కమిటీ దానిని ఆమోదించింది.

జాతీయ జీవ ఇంధన విధి పాలసీలో ముఖ్యమైన అంశములు

[మార్చు]
బయో ఇథనాల్, బయో డీజిల్ వంటి జీవ ఇంధనాలను 2017 నాటికి 20% వరకు కలపాలనే లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతిపాదించబడ్డాయి.
బయోడీజిల్ ఉత్పత్తిని ఆహారంగా ఉపయోగించబడని నూనె విత్తనములు, బీడుగానున్న / పనికిరాని /సాగు చేయని భూములలో పండించవలెనని ప్రతిపాదించబడ్డాయి.
బయోడీజిల్ ఉత్పత్తికి కావలసిన మొక్కలను స్వదేశీయంగా పెంచుకొనుట మీద ప్రణాళికలు కేంద్రీకరించ బడ్డాయి. పామ్, నూనె ఆధారిత ఫ్రీ ఫ్యాట్ ఆసిడ్ మొక్కల దిగుమతి చేసుకోడాన్ని నిరాకరించ బడ్డాయి.
బయోడీజిల్ మొక్కలను ప్రజల / ప్రభుత్వ / వ్యర్థ అటవీ భూములలో పెంపకాన్ని ప్రోత్సాహించుట అదే సమయంలో సారవంతమైన సాగు భూములలో పెంపకాన్ని ప్రోత్సహించకుండుట.
కనీస మద్ధతు ధర, నియమిత కాలంలో బయోడీజిల్ విత్తనాల సవరించిన ధరలను ప్రకటించుట ద్వారా రైతులు చౌకగా విత్తనములు పొందుట. కనీస మద్ధతు ధర వివరముల సంవిధానం, జాతీయ జీవ ఇంధన పాలసీలో సంరక్షించబడి, జాగ్రత్తగా పరిశీలించబడి ఆ తరువాత బయో ఫ్యూయల్ స్టీరింగ్ కమిటీచే ఆమోదించబడుతుంది.
కనీస కొనుబడి ధర, ఆయిల్ మార్కెటింగ్ కమిటీల ద్వారా బయోడీజిల్ కొనబడడమనేది వాస్తవంగా ఉత్పత్తికి అయ్యే ఖర్చు, బయోడీజిల్ ఎగుమతి ధర మీద ఆధారపడిఉంటుంది. బయో డీజిల్ విషయంలో కనీస కొనుబడి ధర డీజిల్ చిల్లర ధరపై ముడిపడి ఉంటుంది.
జాతీయ జీవ ఇంధన పాలసీ, జీవఇంధనాలైన బయో ఇథనాల్, బయో డీజిల్ ప్రభుత్వము ద్వారా “ప్రకటితమైన వస్తువుల” పరిధి క్రిందకు తీసుకునిరాబడి రాష్ట్రాల లోపల, రాష్ట్రాల వెలుపల స్వేచ్ఛగా రవాణా చేయబడుటకు, ప్రభుత్వం పరిశీలన చేస్తుంది.
ఈ విధి, పాలసీలో బయోడీజిల్ పై ఎటువంటి పన్నులు, సుంకములను వేయకూడదని స్పష్టం చేయబడింది.
జాతీయ జీవ ఇంధన సమన్వయ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
జాతీయ జీవ ఇంధన నిర్దేశిత కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షులుగా ఉంటారు.
జీవ ఇంధనములపై పరిశోధన విషయములపై ఒక ఉప కమిటీ, స్టీరింగ్ కమిటీ క్రింద ఏర్పాటు చేయబడి ఆ సబ్ కమిటీ బయోటెక్నాలజీ విభాగము, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల అధ్వర్యములో నడుపబడి, జాతీయ ఇంధనవనరుల మంత్రిత్వ శాఖల ద్వారా సమన్వయముచే పని చేస్తుంది.
ప్రాధాన్యత అంశములైన పరిశోధన, ఆభివృద్ధి, ప్రదర్శనవంటి వాటికి తగిన విలువనిస్తూ మొక్కల పెంపకము, ప్రోసెసింగ్, సాంకేతిక ఉత్పత్తులు తరువాత తరాల సెల్యులోజిక్ జీవ ఇంధనాలతో కలిపి వాటి మీద ధృష్టిని కేంద్రీకరిస్తుంది.

విద్యుచ్ఛక్తి చట్టం 2003 లోని పువరుత్పాదక శక్తికి సంబంధించిన చట్ట నిబంధనలు.

[మార్చు]

సంప్రదాయ బద్ధంకాని శక్తి వనరులు గురించి విద్యచ్ఛక్తి చట్టంలో ఉన్న నిబంధనలు క్రింద పేర్కోనబడినవి. విభాగము 3 (1), 3 (2) :- విభాగము 3 (1), 3 (2)ల ననుసరించి కేంద్ర ప్రభుత్వం సమయానికి జాతీయ విద్యుత్ పథకం, సుంకాల పట్టికను పరిశీలించి, తయారు చేసి, ప్రచురిస్తుంది. ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం, విద్యుచ్ఛక్తి వ్యవస్థ అభివృద్ధి సంస్థ యొక్క సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విద్యుచ్ఛక్తి వ్యవస్థ అభివృద్ధి సంస్థ, తను ఆధారపడే వనరులైన బొగ్గు, సహజ వాయువు, అణు పదార్థాలు, జలవిద్యుత్తు, పునరుత్పాదక శక్తి వనరులు వంటి వాటి పూర్తి వినియోగం పొందగలిగేటట్లు కార్యాచరణ సాగిస్తుంది. విభాగము (4) :- విభాగము (4) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరునాత ఒక జాతీయ కార్యచరణ విధానాన్ని ఏర్పరచి, గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన విద్యుత్ వ్యవస్థలను ప్రకటిస్తుంది. (శక్తి వనరుల పునరుత్పాదకత మరయు సంప్రదాయ బద్ధం కాని శక్తి వనరులను కూడ కలుపుకుని ఈ పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.) విభాగం (61) :- విభాగం 61, 61 (h) 61 (i) ప్రకారం ఒక ప్రత్యేకమైన అధికార సంఘం, ఈ చట్టంలోని నిబంధనలనమసరించి, సుంకం విధింపు (Tariff policy) ని నిర్ణయించడంలో కొన్ని షరతులు, నియమాలను స్పష్టీకరిస్తుంది. ఈ పని చేయడంలో, విద్యుదుత్పత్తి, విద్యుత్తు సహకార ఉత్పత్తి, (శక్తి పునరుత్పాదక వనరుల నుండి) ల తోడ్పాటు;, జాతీయ విద్యుత్ కార్యాచరణ విధానం, (Electricity Policy) సుంత విధానం (Tariff policy) ల సహకారం, మార్గనిర్దేశికత్వం స్వీకరిస్తుంది. విభాగం 86 (i) :- విభాగం 86 (i), 86 (i) (c) ల ప్రకారం రాష్ట్ర అధికార సంఘాలు క్రింద పేర్కొనబడిన విధులను నిర్వహించాలి. శక్తివనరుల పునురుత్పాదన ద్వారా విద్యుదుత్పత్తి, సహాకార విద్యుత్ ఉత్పత్తి అభివృద్ధి పరచడం, విద్యుదుత్పత్తి కేంద్రం (గ్రెడ్) కు, విద్యుత్తును ఎవరైనా వ్యక్తికి గాని, అమ్మే ప్రక్రియలో సరైన విధంగా అనుసంధానించడం, ఇటువంటి అమ్మకపు విధానంలో అప్రాంతపు అనుమతించబడిన పంపిణీ కేంద్రం నుండి వినియోగింపబడే మొత్తం విద్యుత్తులో ఆ వ్యక్తికి యివ్వవలసిన శాతం నిర్ణయించడం.

వనరులు

[మార్చు]

http://te.pragatipedia.in/rural-energy/policy-support/renewable-energy[permanent dead link]