జస్టిన్ వాఘన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జస్టిన్ వాఘన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జస్టిన్ థామస్ కాల్డ్‌వెల్ వాఘన్
పుట్టిన తేదీ (1967-08-30) 1967 ఆగస్టు 30 (వయసు 57)
ఇయర్‌ఫోర్డ్, ఇంగ్లాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 183)1992 నవంబరు 27 - శ్రీలంక తో
చివరి టెస్టు1997 జనవరి 24 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 82)1992 డిసెంబరు 4 - శ్రీలంక తో
చివరి వన్‌డే1996 డిసెంబరు 8 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 6 18 70 90
చేసిన పరుగులు 201 162 3,159 1,635
బ్యాటింగు సగటు 18.27 18.00 31.59 24.04
100లు/50లు 0/0 0/0 2/16 0/8
అత్యుత్తమ స్కోరు 44 33 127 94
వేసిన బంతులు 1,040 696 8,089 2,745
వికెట్లు 11 15 132 123
బౌలింగు సగటు 40.90 34.93 26.06 22.31
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 3 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/27 4/33 8/27 6/26
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 4/– 66/– 31/–
మూలం: Cricinfo, 2017 మే 4

జస్టిన్ థామస్ కాల్డ్‌వెల్ వాఘన్ (జననం 1967, ఆగస్టు 30) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1992 - 1997 మధ్యకాలంలో ఆరు టెస్ట్ మ్యాచ్‌లు, 18 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇతను వృత్తిరీత్యా వైద్యుడు.

క్రికెట్ రంగం

[మార్చు]

వాఘన్ ఆల్ రౌండర్ గా, ఎడమ చేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా రాణించాడు. 1990 నుండి 1997 వరకు న్యూజీలాండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1992లో గ్లౌసెస్టర్‌షైర్‌తో ఇంగ్లాండ్‌లో ఒక సీజన్‌ను కూడా కలిగి ఉన్నాడు.[1]

1996 జనవరిలో ఆక్లాండ్ కాంటర్‌బరీని ఓడించినప్పుడు వాఘన్ అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు 127.[2] 1997 మార్చిలో ఒటాగోను ఆక్లాండ్ మూడు వికెట్ల తేడాతో ఓడించినప్పుడు 27 పరుగులకు 8 వికెట్లు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.[3] ఈ రెండు మ్యాచ్‌లలో ఆక్లాండ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 1993-94 నుండి 1996-97 వరకు నాలుగు సీజన్‌లకు జట్టుకు నాయకత్వం వహించాడు. 1995 డిసెంబరులో ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా ప్రభావవంతమైన బౌలర్ గా నిలిచాడు.[4][5]

2007 ఏప్రిల్ లో న్యూజీలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్థానానికి నియమితుడయ్యాడు. మార్టిన్ స్నెడెన్ నుండి 2007, జూన్ 5న బాధ్యతలు స్వీకరించాడు.[5] 2011 నవంబరులో కుటుంబ కారణాలను పేర్కొంటూ పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. నటాలీ, జెమీమా, బ్రూనో అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.[6]

బ్రెయిన్‌జెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నాడు.[5] 2013లో, ప్రముఖ ఆస్ట్రేలియన్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎన్ఐబిలో ఎగ్జిక్యూటివ్ రోల్ కోసం సిడ్నీకి వెళ్ళాడు. 2020లో ఆ పదవిని వదిలేశాడు. 2021లో ఎమర్జింగ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ బయోఐకి సీఈఓగా ప్రారంభించాడు.

మూలాలు

[మార్చు]
  1. "First-Class Matches played by Justin Vaughan". CricketArchive. Retrieved 17 April 2022.
  2. "Canterbury v Auckland 1995-96". Cricinfo. Retrieved 17 April 2022.
  3. "Otago v Auckland 1996-97". Cricinfo. Retrieved 17 April 2022.
  4. "Auckland v Otago 1995-96". CricketArchive. Retrieved 17 April 2022.
  5. 5.0 5.1 5.2 "Justin Vaughan". Cricinfo. Retrieved 17 April 2022.
  6. "Vaughan stands down as New Zealand CEO".