జషుభాయ్ రథ్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జశుభాయ్ భిలుభాయ్ రథ్వా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు గీతాబెన్ రత్వా
నియోజకవర్గం ఛోటా ఉదయ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-28)1970 డిసెంబరు 28
వసేది
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు భిలూభాయ్ నాయకభాయ్, చంపాబెన్
నివాసం సంత్ కృపా ఫామ్, ఛోట్ ఉదేపూర్, బరోడా, గుజరాత్
వృత్తి రాజకీయ నాయకుడు

జషుభాయ్ రథ్వా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జషుభాయ్ రథ్వా 1971లో జన్మించాడు. ఆయన 1986లో 10వ తరగతి, 1988లో ఇంటర్మీడియట్, 1991లో గుజరాత్ యూనివర్శిటీ కళాశాల ఛోటా ఉదయ్‌పూర్‌లో బి.ఎస్‌సి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జాషుభాయ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఆ తరువాత చోటౌడేపూర్ తాలూకా యువమోర్చా కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, ఛోటాడేపూర్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడిగా, గుజరాత్ ఆదిజాతి వికాస్ నిగమ్ డైరెక్టర్‌గా, గోవింద్ గురు విశ్వవిద్యాలయం డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పని చేసి 2017 శాసనసభ ఎన్నికలలో ఛోటా ఉదయపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[2]

జాషుభాయ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హరియాభాయ్ రథ్వాపై 398777 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (7 June 2024). "Chhota Udaipur election results 2024 live updates: BJP's Jashubhai Bhilubhai Rathva wins". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. TV9 Gujarati (13 March 2024). "Chota Udepur lok sabha Seat: છોટા ઉદેપુરમાં ભાજપે વિધાનસભા હારેલા ઉમેદવાર પર મુક્યો વિશ્વાસ, જાણો કોણ છે જશુભાઈ રાઠવા". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chhota Udaipur". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.