Jump to content

చిలకమ్మ చెప్పింది

వికీపీడియా నుండి
చిలకమ్మ చెప్పింది
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ఈరంకి శర్మ
తారాగణం రజనీకాంత్,
శ్రీప్రియ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ గోపి ఇంటర్నేషనల్
భాష తెలుగు

ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. నిర్మాత చేగొండి హరిబాబు (రాజకీయనాయకులు చేగొండి హరిరామజోగయ్య), ఈరంకి శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు మలయాళ సినిమా అడిమైకళ్ మాతృక.

చిత్రకథ

[మార్చు]

సంగీత, లక్ష్మీకాంత్ అక్కాతమ్ముళ్ళు. మల్లి(శ్రీప్రియ) పేదమ్మాయి. పల్లెలో చిలక జ్యోస్యం వాడు చెప్పినట్టు తనకు చదువుకొన్న పెద్దింటి వరుడు వస్తాడని కలలు కంటుంది. సంగీత దగ్గర పని కోసం పల్లె నుండి పట్నం వస్తుంది. పేదవాడైన నారాయణరావు కూడా అక్కడే పనిచేస్తుంటాడు. అతడు కొంత చెవిటితనం కలిగి ఉంటాడు. మల్లిని అభిమానిస్తుంటాడు. రజనీకాంత్, లక్ష్మీకాంత్ కు స్నేహితుడు. పాలకొల్లు లాకుల ప్రభుత్వోద్యోగిగా వీరుంటున్న గ్రామానికి వస్తాడు. సంగీత పురుష ద్వేషి, సంగీతం టీచరు. ఆమె రజనీకాంత్ ను 'కుర్రాడి'గా సంబోధిస్తుంది. అతనిపట్ల అయిష్టత ప్రదర్శిస్తుంది. మల్లి పెళ్ళి కాకుండానే గర్భవతి ఔతుంది. ఆమె లక్ష్మీకాంత్‌తో సంభందం కలిగి ఉండటం నారాయణరావు చూస్తాడు, అతడు చూసాడని వీళ్ళూ గమనిస్తారు, సంగీత రజనీకాంత్ ను దీనికి కారణం అనుకుంటుంది. ఆమెకు లోలోపల రజనీకాంత్ పట్ల ప్రేమ. రజనీకాంత్ మల్లి భాద్యతలను నారాయణరావుకు అప్పగించి అతడికి లాకులవద్ద ఉద్యోగం వేయించి బదిలీమీద వెల్లే తాను మళ్ళీ తను వచ్చేవరకూఅతడివద్దే ఉంచమని చెప్తాడు. బిడ్డపుట్తేవరకూ నారాయణరావు దగ్గర ఉన్న మల్లికి తనపై అతడి ప్రేమ తెలుస్తుంది. చివరకు బిడ్డ తండ్రిగా ఒప్పుకున్న లక్ష్మీకాంత్ మల్లిని తీసుకు వెళ్ళాలని వస్తే ఆమె ఒప్పుకోదు. తనకు పేదవాడైన నారాయణరావుతోనే జీవితం అని చెప్పి అతడితో పల్లెకు వెళ్ళీపోతుంది. సంగీత రజనీకాంత్‌ను క్షమించమని తనను పెళ్ళీచేసుకోమని కోరుతుంది.

తారాగణం

[మార్చు]
  • రజనీకాంత్
  • శ్రీప్రియ
  • నారాయణరావు
  • సంగీత
  • సీతాలత
  • హేమ సుందర్
  • రామజోగయ్య
  • లక్ష్మి
  • లక్ష్మీకాంత్
  • పి.ఎల్.నారాయణ
  • బేబీ సులోచన
  • బేబీ సుధ
  • బేబీ లీల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఈరంకి శర్మ
  • పర్యవేక్షణ: బాలచందర్
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
  • గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, గేదెల ఆనంద్, వాణి జయరాం, సూర్యశ్రీ
  • కళ: బాస్కరరాజు
  • నృత్యం: నంబిరాజు
  • కూర్పు: ఆర్.బి.తిలక్
  • నిర్మాణ నిర్వహణ: జి.సత్తిరాజు
  • మాటలు: గణేష్ పాత్రో
  • చిత్రానువాదం: ఈరంకి శర్మ
  • నిర్మాత: చలసాని గోపి
  • నిర్మాణ సంస్థ: గోపికృష్ణా ఇంటర్నెషనల్
  • విడుదల:13:08:1977.

చిత్ర విశేషాలు

[మార్చు]
  • చిత్రం ఎక్కువ భాగం పశ్చిమగోదావరి జిల్లా లంకలకోడేరు గ్రామంలో చిత్రీకరించారు. గ్రామంలో ఉన్న ఎదురు ఎదురుగా కల రెండు మేడలను, ఉన్నతపాఠశాలను చిత్రీకరించారు.

అవార్డులు

[మార్చు]

1977 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రధమ చిత్రంగా ఎంపిక చేసి బంగారు నంది అవార్డు ప్రకటించింది.

పాటలు

[మార్చు]
  • చిట్టి చిట్టి చేపల్లారా సెలయేటి పాపల్లారా, చిలకమ్మ చెప్పింది చల్లని మాట, గానం. పులపాక సుశీల, రచన: ఆచార్య ఆత్రేయ
  • కుర్రాడనుకుని కునుకులుతీసే వెర్రిదానికీ పిలుపు గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,రచన: వేటూరి సుందర రామమూర్తి
  • ఎందుకు నీకీ దాపరికము ఎన్నాల్లు దాస్తావు దాగని నిజము, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, రచన: ఆచార్య ఆత్రేయ

సినిమా సన్నివేశాలు

[మార్చు]