Jump to content

చర్చ:విశాఖపట్నం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
విశాఖపట్నం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2024 సంవత్సరం, 04 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
విశాఖపట్నం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


[మార్చు]

In External links section. Do we really need some commercial or general links?? or can we just be conservative adding only websites which will enhance our knowledge about Vizag. Let me know - వైఙాసత్య

మూసలు

[మార్చు]

రవిగారూ, ఈ పేజీలో 1. విశాఖలోని విద్యాసంస్ధల గురించి (ప్రముఖమైనవి), ఆసుపత్రుల గురించి కూడా సమాచార సేకరణ జరుపుతున్నాను. దీనికి అవసరమైన మూసలను ఎలా తయారుచేయడం లేక ఇప్పటికే ఉన్నాయా? సహాయం కోసం ఈ టపా. కామేష్ 03:06, 8 సెప్టెంబర్ 2006 (UTC)

మూసలు పలు రకాలు, సినిమాల పేజీలో ఉండేవి సమాచార పెట్టెలు. మండలాల పేజీల, సంఖ్యానుగుణ వ్యాసములలో క్రింద భాగములో ఉన్నది జాబితా మూస. అనువదించవలసిన వ్యాసాల పైభాగములో ఉన్నది సందేశ మూస. మీ అవసరాన్ని బట్టి కొన్ని ఇది వరకే ఉన్న మూసలను చూసి రూపొందించుకోవడము సులువైన పద్ధతి. మీరు ఎలాంటి మూస తయారు చెయ్యాలంకుంటున్నారో చెబితే నేను కొంత సహాయము చెయ్యగలను.
--వైఙాసత్య 04:26, 8 సెప్టెంబర్ 2006 (UTC)

మండలాలకి సరైన పేర్లు

[మార్చు]

విశాఖపట్నం జిల్లాలోని ఈ మండలాలకి సరైన పేర్లు ఇవి.1.ముంచంగిపుట్టు 2. పెదబయలు 4.డుంబ్రిగుడ 8.చీడికాడ 15.గొలుగొండ 20.బుచ్చెయ్యపేట 36.మాకవరపాలెం 37.కోట ఉరట్ల కనుక సరిదిద్ది తుడిచివేసిన ఈ మండలాలలోని అనువదించిన గ్రామాలను తిరిగి తీసుకురాగలరు.Varmadatla 00:44, 1 అక్టోబర్ 2006 (UTC)

వర్మగారు, ఈ సమస్యను పరిష్కరించాను. మండలాలను తుడిచివేయలేదు. ఈ పేజీలో ఉన్న లింకులకు ఆ మండలాల పేర్లకు జత కుదరలేదు కాబట్టి ఈ లింకులు ఎర్రగా కనిపించాయి. మీరు సూచించిన సరైన పేర్లకు వాటిని తరలించాను. --వైఙాసత్య 01:02, 1 అక్టోబర్ 2006 (UTC)
విశాఖ పట్టణానికి సంబంధించి రెండు శాసన సభ స్థానాలు ఉన్నాయి.----కంపశాస్త్రి 22:35, 8 సెప్టెంబర్ 2007 (UTC)

విశాఖపట్నం లోని 72 వార్డుల గురించి

[మార్చు]

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల రోజులలో పలు పత్రికలలో రాసిన వార్తలు, గెలిచిన అబ్యర్ధుల పేర్లు, ఆ వార్డులలో వున్న గ్రామాల పేర్లు, వోటర్ల వివరాలు, గెలిచిన ఓట్ల వివరాలు, మెజారిటీ వివరాలు నేను సేకరించి వుంచాను. ఆ విషయాలు ,అంకెలు నేను,ఈ విశాఖ పట్నం వ్యాసం లో వార్డులు విభాగంలో చేర్చవచ్చునా ! లేదా చెప్పండి. చేర్చితే ఏమైనా కాపీ రైట్ హక్కు ఉల్లంఘించినట్లు అవుతుందా Talapagala VB Raju 15:37, 4 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ సమాచారం ప్రభుత్వ వెబ్ సైట్లో కూడా ఉంటుంది కనుక కాపీ రైట్ ఉల్లంగన కాకపోవచ్చు. మీరు చేర్చండి. మరీ వ్యాసం పెద్దది అయితే ఆ విషయాలు ఒక ప్రత్యేక వ్యాసంగా వ్రాయవచ్చు. Chavakiran 15:58, 4 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోన్ నంబర్లు విజ్ఞాన సర్వస్వానికి సరియైనవి కాదు

[మార్చు]

‌వ్యాసంలో స్థానిక ప్రభుత్వేతర సంస్థల వివరాలు, ఫోన్ నంబర్లు చేర్చటం విజ్ఞానసర్వస్వానికి సరియైనది కాదు. ఎందుకంటే ఇవీ మారినప్పుడల్లా వ్యాసం మార్చటం వీలయ్యేది కాదు. ఇంగ్లీషులో నగర వ్యాసాలు ఆదర్శంగా తీసుకొని, ఈ సమాచారం చెరిపేయటం మంచిది. -- అర్జున 04:09, 7 నవంబర్ 2011 (UTC)

వ్యాసంలో ఫోన్ నంబర్ల అవసరం నాకూ సరైనదిగా అనిపించడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:38, 7 నవంబర్ 2011 (UTC)

గ్రామనామ వివరణ లో మూలం ఉల్లేఖన

[మార్చు]

YesY సహాయం అందించబడింది

పట్నం నిఘంటువులో దొరికే సాధారణ పదం కాబట్టి, ఇచ్చిన నెల్లురు జిల్లాగ్రామనామాల మూలం అనవసరం. అది కాక విశాఖపట్నం పేరుకు నెల్లూరు జిల్లాకి సంబంధించిన పుస్తకానికి ఏమి సంబంధం అనే ప్రశ్న ఉదయుస్తుంది. చేర్చిన user:Pavan_santhosh.s గారు, ఇతర సభ్యులు స్పందించవలసినది.--అర్జున (చర్చ) 07:09, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున రావు గారూ, పట్నం పోయి వస్తాను అన్న పదానికీ, ఊరి పేరులోని పట్నం అనే పదానికి మధ్య వార ఉంటుంది. అది సాంకేతికమైనది. ఉదాహరణకు శబ్దరత్నాకరం పట్నం అంటే పట్టణము అని అర్థం ఇచ్చింది. ఇది ఏ రకంగానూ ఈ సందర్భంలో పనికి రాదు. పైపెచ్చు ఈ సాధారణార్థాన్ని కాకుండా పై పుస్తకంలో విశేషార్థాన్ని చెప్తున్నారు. భాషాశాస్త్రంలో en:Toponymy అన్నది ప్రత్యేకమైన విభాగం. ఆ విభాగం ప్రకారం ఒక ఊరి పేరు ఎలా పుట్టింది, ఎలా వ్యాప్తి చెందింది అన్నది మూలాల నుంచి వెతికి చెప్తాయి. ఇక్కడ పట్నం అన్నది సఫిక్స్. ఈ సఫిక్సు వాడకం అటు భీమునిపట్నం, విశాఖపట్నం నుంచి ఇటు చెన్నపట్నం దాకా తీరమంతా ఉంది. ఆ వివరాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. నెల్లూరులో వచ్చే ఊరు అన్న పదమూ, కొల్లూరులో వచ్చే ఊరు అన్న పదమూ ఎలా పరస్పర సంబంధం ఉన్నవో, ఇదీ అంతే. చదివి చూడండి. అనవసరం కాదు. అవసరం. --పవన్ సంతోష్ (చర్చ) 09:21, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు విషయం మెరుగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు పూడి అన్న పదం ఉంది. దీనికి ఈనాడు చలామణిలో ఏ అర్థమూ లేదు. ఊరి పేరులో భాగంగా, తత్కారణంగా ఇంటిపేరులో భాగంగానూ, తప్ప వేరే చలామణి కూడా లేదు. ఏమిటో మీకూ, నాకూ తెలియదు కనుక దీని అర్థం "ఏరును పూడ్చి కట్టిన ప్రదేశం" అని గ్రామనామ భాషావేత్తలు చెప్తే మనం అంగీకరించగలుగుతున్నాం. కానీ, పట్నం అన్న పదానికి ఈరోజు మీకూ నాకూ "ఒక అర్థం" తెలుసు. ఆ మేరకు పట్టణం అన్నదానికి రూపాంతరంగా, టౌన్ అన్న అర్థంలో చలామణిలో ఉంది కాబట్టి మీకు ఆ ఊరికి పేరు పెట్టినప్పుడు వేరే సాంకేతికార్థం ఉంది, ఆ అర్థం ఇదీ అని ఒక గ్రామ నామ భాషావేత్త చెప్తే ఒప్పుకోవడానికి ఇబ్బంది కలుగుతుందేమో. అంతమాత్రాన చారిత్రక భాషాశాస్త్రంలో భాగమైన ఈ గ్రామనామ భాషాశాస్త్రం మారిపోదు. సాధారణ నైఘంటుకార్థం తెచ్చి ఇక్కడ పెట్టెయ్యడానికి నాకు క్షణం పని, కానీ అదొక విలువైన సమాచారాన్ని పాఠకులకు అందనీయకుండా చేస్తుంది. ఇదీ నేను చెప్పదలిచింది. --పవన్ సంతోష్ (చర్చ) 09:36, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, మీ వివరణకు ధన్యవాదాలు. నేను వ్యాఖ్య రాసేముందు మూలం కూడా కొంతవరకు చదివాను. వికీపీడియా వ్యాసాలు సాధారణ పాఠకుడిగా సులభంగా అర్ధమయ్యేటట్లుండాలి. కాని మీరు వాడిన మూలం, ఆ తరువాత వివరణ, ఆ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి అని నా అభిప్రాయం. " సముద్రతీరప్రాంతం కావడంతో ఈ నగరం పేరులోని పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసం అనే అర్థం ప్రధానంగా స్వీకరించవచ్చు." అన్నది మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే విధానానికి కూడా వ్యతిరేకం. ఈ మూలం గ్రామనామాలు అన్న ప్రత్యేక వ్యాసంలో వుంచవచ్చు. ఇతరులు అభిప్రాయాలు కూడా పరిశీలిద్దాం.--అర్జున (చర్చ) 07:04, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
"విశాఖ పట్నం అన్న గ్రామనామం విశాఖ అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి." ఇందులో మౌలిక పరిశోధన ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఈ పదానికి ఈ అర్థం ఉందన్న ముక్క ఆ పుస్తకంలో ఉంది. అదలా ఉంచి "పట్నం నిఘంటువులో దొరికే సాధారణ పదం" అని ఈ వాదన మొదలుపెట్టారు మీరు. ఆ విషయం ఏం చేస్తారు. ఒప్పుకున్నట్టేనా గ్రామనామాలు భాషాశాస్త్రపరంగా శాస్త్రీయ పదజాలమనీ, అది నిఘంటువు నుంచి తెచ్చి పెట్టెయ్యవచ్చు అని మీరు రాసినది సరికాదని? --పవన్ సంతోష్ (చర్చ) 09:14, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు మీరు నా వ్యాఖ్య సరిగా అర్థంచేసుకొనలేనట్లుంది. నేను ఉటంకించినది సముద్రతీర జనావాసం అనే అర్ధం ప్రధానంగా స్వీకరించవచ్చు అనేదానిని గురించి, అది మీరు నిర్ణయించినట్లుగా వుంది. అప్పుడు అది మౌలిక పరిశోధన కాదా. ఇక నా తొలి వ్యాఖ్య ప్రకారం, ఈ మూలం ఇక్కడ సరిపోదు.ఏదో బహు కొద్దిమందికి తెలిసిన సాంకేతికార్ధం చేర్చి పాఠకుడిని గందరగోళానికి లోను చెయ్యడమే. --అర్జున (చర్చ) 09:34, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి పరిమాణం పరంగా, మార్పుల పరంగా ఎక్కువగా కృషి చేసిన 10 మంది లోని User:C.Chandra Kanth Rao, User:Chavakiran, User:Chittella, User:Kprsastry,User:Talapagala VB Raju,User:Varmadatla,User:వైజాసత్య, క్రియాశీలంగా వున్న సహసభ్యులందరు కనీసం ఒక పాఠకునిగా వారం అనగా 27 జులై 2020 లోగా స్పందించాలని కోరిక. --అర్జున (చర్చ) 09:44, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
"పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి." - :: "పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి." - ఈ ముక్కలో నేనేమీ ఏ అర్థం ప్రధానమో, ఏది అప్రధానమో రాయలేదు. కాబట్టి, నేనేమీ నిర్ణయించింది లేదు. కాబట్టి, మౌలిక పరిశోధన కాదు. మౌలిక పరిశోధన విషయమై తగు జాగ్రత్త నేనీ వాక్యం రాసేప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను చెప్పగలిగితే చెప్పండి - "పట్నం నిఘంటువులో దొరికే సాధారణ పదం" అన్న మీ మొదటి వాదన తోసిపుచ్చినట్టేనా? ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నానంటే Toponymy గురించి నేనంత కంఠశోష పెట్టుకుని చెప్పాక ఆ పాయింటు మీద మీ సందేహం నివృత్తి అయిందో లేదో చెప్పకుండా మీరింకేదో ముందుకు తెస్తున్నారు. ఒక సమస్య నివృత్తి అయిందంటే ఇంకోటి మాట్లాడవచ్చు. లేదూ గ్రామనామాలకు విశేషార్థం ఉండదన్నది మీ గట్టి నమ్మకమే అయితే నేను వేరే ఉపపత్తి తెచ్చి చూపించి ఆ సందేహాన్ని కొట్టివేస్తాను. అలాకాకుండా ఆ విషయాన్ని (నిఘంటువు చాలు అన్నది) వదిలేసి వేరే విషయం (మౌలిక పరిశోధన), ఆ విషయానికి నేను సమాధానం చెప్తే అది వదిలి ఇంకో విషయం చెప్తే కష్టం. ఇక మనం ఏ కొద్దిమందికో తెలిసిన సాంకేతికార్థాలు వికీలో రాయకూడదు అంటే అప్పుడది విజ్ఞాన సర్వస్వం అవబోదు. ఊరికే అందరికీ తెలిసిన విషయాల పుట్ట అయివూరుకుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 10:22, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ మీరు నా వ్యాఖ్యలు అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు లేదు. బహుశా ఇతర సభ్యులు అర్ధం చేసుకొని వ్యాఖ్యానిస్తారనుకుంటాను. మీ మార్పు. చర్చలు వ్యక్తిగతంగా తీసుకుంటే సరిగా సాగవు. నాకు అలా వుద్దేశ్యం లేదు. నేను ఒకవేళ తప్పనిగ్రహిస్తే క్షమాపణ వ్యాఖ్యలు చేసిన సంగతి మీకు తెలియనిది కాదు. సాంకేతికాలు రాయొచ్చు, దానికి తగిన సందర్భం కావాలి. సాధారణ వ్యాసంలో సాంకేతికాలు చేర్చి వ్యాస ఉపయోగాన్ని, చదవగలిగే ఆసక్తిని తగ్గించటం సరికాదు. ఇప్పటిదాక చర్చలో పాల్గొన్నందులకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 10:51, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
"పట్నం నిఘంటువులో దొరికే సాధారణ పదం" అన్న అభిప్రాయం ఒప్పా తప్పా అన్నది మొత్తానికి చెప్పలేదు. నేనేమీ వ్యక్తిగతంగా తీసుకోలేదు, మీరు ఎత్తి చూపించిన ఆ వాక్యం మూలం లేనిది కాబట్టి తొలగించేశాను. పొరబాటు దొర్లితే ఎడిట్ చేసి దిద్దుకోవడం నాకూ అలవాటైన పద్ధతే మీకులాగానే. ఇప్పుడు చెప్పండి. మీరు మొదట వేసిన సందేహానికి సమాధానం దొరికిందో లేదో. ఈ సబ్జెక్టు నాకు చాలా ఆసక్తి ఉన్న అంశం. వారి అభిప్రాయం వారిని చెప్పనిద్దాం. అంతవరకూ మీ ఉద్దేశం చెప్పండి, మీరు మొదట లేవనెత్తిన విషయం మీద. --పవన్ సంతోష్ (చర్చ) 11:01, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ సవరించినందులకు ధన్యవాదాలు. ఇక మీకు, అందరికీ స్పష్టత కోసం. ఈ వ్యాసానికి సంబంధించి పట్నం నిఘంటువులో దొరికే సాధారణ పదం అన్నది ఒప్పు. ఈ వ్యాస సందర్భంలో ఇక మిగతా మూలం నుంచి తెచ్చి రాసిన వివరాలు, మూలం అనవసరం. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 11:29, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ నామాలు ఎలా వచ్చాయి అన్న దానికి మూలాలివ్వాలంటే అసలు నామానికే ప్రాధాన్యత ఇవ్వాలి గాని సఫిక్సులకు కాదనుకుంటా. గ్రామాలకు లేదా పట్టణాలకు చివరన వచ్చే పట్నం, పల్లి, పూర్, బాద్, నగర్ లాంటివి ముఖ్యం కాదు. ఇక్కడ విశాఖ పేరు ఎలా వచ్చిందన్నదే ముఖ్యం, కాని పట్నం కానేకాదు. విశాఖాబాద్, విశాఖాపల్లి, విశాఖనగర్, విశాఖాపూర్ ... ఇలా కాకుండా పట్నం అని చివరన పెట్టుటకు ప్రత్యేక కారణమేదైనా ఉంటే తప్ప దాన్ని గ్రామనామాల్లో ఉటంకించే అవసరం ఉండరాదు. విశాఖ పేరనేది విశాఖ అనే దేవత మీదుగా వచ్చిందనే అభిప్రాయం చరిత్రకారులలో మరియు గ్రంథకర్తలలో ఉంది కాబట్టి వాటికే మనం మూలం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పట్నంకు మూలం ఇచ్చే అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:03, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేర్లలో చివరన వచ్చే పట్నం, నగరం వంటివి పెద్దగా ముఖ్యం కాదని బాగా సెలవిచ్చారు. ఆ లెక్కన విజయ-వాడకీ, విజయ-నగరానికీ పెద్దంత తేడా లేదు. (ఏడవ లేక నవ్వుకుందుకు జోకు) గ్రామనామాల అధ్యయనం అన్నది ప్రత్యేక శాస్త్రం. దానిలో సుస్పష్టంగా గ్రామం పేరులో పూర్వ భాగానికి, ఉత్తర భాగానికి (ప్రథమావయవానికి, ద్వితీయావయవానికి) కూడా విలువనిచ్చి ఎంతగానో కృషిచేశారు. మీరెవరైనా ఆయా పుస్తకాలు చదివి సశాస్త్రీయంగా గ్రామం పేరులో చివరన వచ్చే పదానికి విలువ లేదని ఉటంకించి చెప్తే బావుంటుంది తప్ప ఈ పాసింగ్ కామెంట్ల వల్ల లాభం లేదు. వాడ అన్న పదం ఆ పట్టణానికి వాణిజ్యపరమైన ప్రాధాన్యతను సూచిస్తోందని శాస్త్రం అధ్యయనం చేసినవాళ్ళు చెప్పారు. అర్జున గారి దృష్టిలో వాడ అన్నది కేవలం ఓ పదం, నిఘంటువు చాలు దాన్ని వివరించడానికి, ఆయన అన్నారు కదాని నేను వెళ్ళి నిఘంటువులు తిరగవేసి ఎదురు వాదం చెప్పాలి. అదే నేను ఏదైనా శాస్త్ర గ్రంథం ఉదహరించి చూసి చెప్పమంటే అది అజీర్తి చేస్తుంది. చదవకుండానే, అధ్యయనం చేయకుండానే ఉటంకింపులు లేకుండానే చర్చిస్తారు. సరేలెండి- చదివి చెప్పడం, అధ్యయనం చేసి మాట్లాడ్డం వంటివి నేను ఆశించకూడదు ఇకనుంచీ. అది నా బాధ్యత. అలా నేను పనిచేశాకా, ఏ మాత్రమూ మూలాలు ఉటంకించకుండా, ఒక ప్రాతిపదికా పాడూ లేకుండా, ఎవరికి తోచిన వ్యాఖ్య వారు చేయవచ్చు- చర్చంటే అలాగే సాగుతుందని నేనిక అర్థం చేసుకోవాలి. --పవన్ సంతోష్ (చర్చ) 11:45, 26 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, కువిమర్శల వల్ల మీరు చేస్తున్న కృషి ఎన్నటికీ పలుచన కాదు. నాకు-సమస్తం-తెలుసు-వాదులు చేసే కువిమర్శలను పట్టించుకోనక్కర్లేదు, అస్సలు పట్టించుకోకూడదు కూడా. వాటి గురించి మీరు బాధ పడాల్సిన పనే లేదు. వికీ విధానాల పట్ల మీకంటే ఎక్కువ అవగాహన కలవారు మన సముదాయంలో నాకు తెలిసి లేరు. మీరు వికీపీడియాకు చక్కటి విలువ చేకూరుస్తున్నారు. మీ కృషి కొనసాగిస్తూనే ఉండండి. __చదువరి (చర్చరచనలు) 12:22, 26 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చను పూర్తిగా అర్థం చేసుకోకుండా, చర్చలోని ఒక వాక్యంగాని, వాక్యంలోని కొంతభాగం కాని తీసుకొని చర్చను వక్రీకరించడం మరియు చర్చను పక్కదారి పట్టిస్తాడనే కారణంతో నేను సదరు సభ్యుడితో ఇటీవల ప్రత్యక్షంగా చర్చలు చేయడం లేదు. ఇదే విషయం గత చర్చలలో పేర్కొన్నాను కూడా. మళ్ళీ అదే పరిస్థితి పునరావృత్తం కావడం శోచనీయమైన విషయం. ఇక్కడ పట్నంపై చర్చ జర్గడం లేదు. విశాఖపట్నం వ్యాసంలో గ్రామనామం ఎలా వచ్చిందనే అంశంపై మూలానికి సంబంధించిన చర్చ మాత్రమే. ఇక్కడ మూలం పెట్టాలంటే విశాఖ పేరు ఎలా వచ్చిందనే ఆధారానికే కాని పట్నంకు కాదని స్పష్టంగానే చెప్పాను. పట్నంకు మూలం ఇవ్వాలంటే విశాఖపట్నంకు చివరన పట్నం ఎందుకు వచ్చిందనే మూలం లభ్యమైతే తప్ప మూలం ఇచ్చే అవసరం లేదు. అది విశాఖపట్నంకు సంబంధించి ఉండాలి, సి. చంద్ర కాంత రావు- చర్చ 19:31, 27 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందించిన అందరికి ధన్యవాదాలు. స్పందించని నిర్వాహకులు( వీవెన్, రాజశేఖర్, User:విశ్వనాధ్.బి.కె., రవిచంద్ర, t.sujatha, కె.వెంకట రమణ, రహ్మానుద్దీన్, ప్రణయ్‌రాజ్, స్వరలాసిక, యర్రా రామారావు) ఎవరైనా నిర్ణయం క్రింది ఉపవిభాగంలో రెండు మూడు రోజులలోపు తెలియచేయవలసినది.అర్జున (చర్చ) 04:32, 28 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

[మార్చు]

విశాఖపట్నం అనే పేరు ఎలా వచ్చిందన్నదానికి వివరణలో పట్నం అనే పదం ఎలా వచ్చిందో వివరించడానికి మూలం చూపారు. పట్నం అనేది చాలా ఊర్ల పేర్లలో ఉంటుంది కదా, జనరిక్ అవుతుంది కదా అని కొద్దిమంది సభ్యులు వాదన లేవదీసారు. విశాఖ అనే పదానికి వివరణ లేదు కదా అన్నారు. మరి ఆ మూలం ఉండాలా వద్దా? ఉండటం వల్ల నష్టం లేదు. తీసేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కాబట్టి అలాగే మూలం అలానే ఉంచాలని నిర్ణయిస్తున్నాను. ఇది ఇంత పెద్ద చర్చ తీయాల్సిన విషయమే కాదని నా అభిప్రాయం. -రవిచంద్ర (చర్చ) 06:02, 28 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం (?) ప్రకటించినందుకు ధన్యవాదాలు!!! కాని ఇది నిర్ణయం లాగా లేదు. కేవలం ఒక అభిప్రాయంలా ఉంది. ఒక చర్చ జరిగిన తర్వాత నిర్ణయం ప్రకటించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గత, భవిష్యత్తులను కూడా ఆలోచించాలి. ఇక్కడ చర్చ జరిగిందంటే కేవలం ఒక్క ఈ వ్యాసపు మూలం గురించే కాదు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే (అంటే ఎవరో ఎల్లయ్య, పుల్లయ్యలు ప్రతీ పట్నాలకు పనికిరాని మూలాలను అంటిస్తే) ఎత్తి చూపడానికి కూడా పనికి రావాలి. ఈ వ్యాసంలోని ఒక్క మూలం తొలగించడం కోసమే ఎవరూ పట్టుబడలేరు కాని చర్చ అంటే చర్చ లాగా ఉండాలి, నిర్ణయం అంటే నిర్ణయం లాగా ఉండాలి. ఇలాంటి చర్చలు భవిష్యత్తులో మునుముందు జర్గబోయే పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకొని చేస్తామేకాని కేవలం చర్చ జరిగే ఒక్క వ్యాసం కోసం కానేకాదు. ఇలాంటి నిర్ణయాల వల్ల వ్యవస్థ భవిష్యత్తు ఘోరంగా దెబ్బతింటుంది. చర్చ మరియు చర్చా ఫలితం అనేది ఒక కోర్ట్ ఆఫ్ రికార్డు లాగా ఉండాలి. భవిష్యత్తులో చూసిననూ నిర్ణయాన్ని మెచ్చుకోదగినదిగా ఉండాలి లేకుంటే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఎదురౌతుంది. చర్చలో వ్యక్తమైన బలమైన అబిప్రాయాలను నిర్ణయం సమయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎలా చూసిననూ ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయంలా ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ప్రస్తుత తెవికీలో సాంకేతిక అంశాలపై అర్జున గారికి మరియు చర్చలను అర్థం చేసుకొనే స్థోమత వెంకటరమణ గారికి తప్ప ఎవరికీ లేదు. కాబట్టి వెంకటరమణ గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించగలరని కోరుచున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:55, 28 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నా నిర్ణయం మీకు నచ్చలేదన్నారు కాబట్టి. ఇంకెవరైనా నిర్ణయం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ కొన్ని విషయాలు చెప్పదలిచాను. విశాఖపట్నం గురించి చర్చిస్తూ అన్ని వ్యాసాల భవిష్యత్తు గురించి కూడా నిర్ణయిస్తామని నేను అనుకోలేదు. ఒకవేళ అది జరగాలంటే మూలాల గురించి సహాయం పేజీలోనో, లేక అన్ని ఊర్ల పేర్ల వ్యాసాలన్నింటి గురించి చర్చలోనే జరగాలి. చర్చలో వచ్చిన బలమైన అభిప్రాయాలను నేను పరిగణనలోకి తీసుకోలేదనడం అబద్ధం. వికీలో తీర్పులు చెప్పడానికి ప్రత్యేకమైన న్యాయశాస్త్రం ఏమీ లేదు. నిర్ణయం గురించి మీరు చెప్పినవన్నీ మీ వ్యక్తిగత అభిప్రాయాలు. అన్నింటికీ నేను అంగీకరించను. ఇంకో విషయమేమిటంటే చర్చల్లో ఎందుకు పెద్దగా పాల్గొనను అంటే మీతో వాదిస్తుంటే నాకు చాలా డిస్కరేజింగా డీమోటివేటింగా ఉంటుంది. మీ వాదనలు ఇంకా చర్చల్లో పాల్గొనాలనే ఆసక్తిని చంపేస్తుంది నాకు. సద్విమర్శలాగా ఉండవు మీ మాటలు. వేలెత్తి చూపిస్తున్నట్లు ఉంటాయి. - రవిచంద్ర (చర్చ) 05:11, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
గౌరవ సభ్యులు నిర్ణయం ప్రకటించారు. కనుక నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. విశాఖపట్నం పేరు ఎలా వచ్చిందో ఈ లింకు లో వివరంగా ఉంది. దీని ప్రకారం "A king had built a shrine in honor of his family deity called Visakeswara to the South of the Lawson’s Bay from which the district has derived its name as Visakheswarapuram which subsequently changed to Visakhapatnam" ఉన్నది. దీని ప్రకారం "విశాఖేశ్వరపురం" కాలానుగుణంగా "విశాఖపట్నం" గా మారినట్లు తెలియుచున్నది. కొన్ని ఓడరేవులకు "పట్నం" అని ఉండవచ్చు. కానీ "పట్నం" అనే ఉత్తరపదం గల అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. అవి అన్నీ ఓడరేవులు, పట్టణాలు కావుకదా. "పట్నం" అని ఉన్న మారుమూల గ్రామాలు అనేకం ఉన్నాయి. అన్నిటికీ "నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన" పుస్తకంలో లింకు వాడలేము కదా. ఉదా: శ్రీకాకుళం లో ఒక మండల కేంద్రం "పాతపట్నం" ఇందులో "పట్నం" ఉన్నదని ఆ మూలం చేర్చలేము కదా. ఓడరేవు కనుక విశాఖపట్నానికి ఆ పేరు వచ్చిందనే మూలం ఏదైనా ఉంటే చేర్చండి. కానీ "పట్నం" అనే పదానికి "ఓడరేవు" అని అర్థం ఉన్నదని ఆ మూలం అవసరం లేదని నా అభిప్రాయం. K.Venkataramana(talk) 05:57, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • రవిచంద్ర గారి నిర్ణయంపై సి. చంద్ర కాంత రావు గారు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారోనని కారణం వెతికితే అది కనబడలేదు. ఆయన వాదనలో ప్రవచనాలు చెప్పారే గానీ, నిర్ణయం తనకు ఎందుకు నచ్చలేదో ఒక్కటంటే ఒక్క కారణం చెప్పలేదు. కాబట్టి ప్రస్తుత రూపంలో ఆ అభ్యంతరంలో పస లేదు. "ఈ నిర్ణయం బాలేదు, మరొకరెవరైనా నిర్ణయం ప్రకటించాలని" ఎవరైనా డిమాండు చేసే పనైతే ఉకదంపుడు కాకుండా సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది.
  • ఇక వెంకటరమణ గారు - రంధ్రాన్వేషణగా మారిన ఈ చర్చకు రమణ గారు ఒక గౌరవాన్ని కల్పించారు. కాకపోతే పట్నాలన్నీ ఓడరేవులే అని ఈ వ్యాసం చెబుతున్నట్టు లేదా ఆ మూలం చెబుతున్నట్టూ రమణ గారు భావించారేమోనని ఆయన అభిప్రాయాన్ని బట్టి నాకు అనిపించింది. పట్నం అంటే రేవుపట్నమే అని ఈ వ్యాసంలో చెప్పలేదు. ఆ మూలం లోనూ చెప్పలేదు. వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే మూడు అర్థాలను చెప్పారు. అంతేతప్ప సముద్ర తీరాన ఉన్నది కాబట్టి పట్నం అనే పేరు వచ్చింది అని చెప్పలేదు.
  • ఈమాటలో వచ్చిన ఈ వ్యాసపు చర్చలో చూడండి. పట్టణం అంటే ఇదే అర్థం చెప్పారు. కొలిచాల గారు ఒక నైఘంటికార్థాన్ని కూడా సూచించారు.
  • మరొక సంగతి వెంకటరమణ గారు ఇచ్చిన మూలంలో "విశాఖేశ్వరపురం" కాలానుగుణంగా "విశాఖపట్నం" గా మారిందన్నారు. దానికి హేతువేంటి?. అది చూడాలంటే పేరులో పూర్వపదం, ఉత్తర పదం అని రెండు ఉంటాయని తెలియాలి. రమణ గారిచ్చిన మూలం "విశాఖ" అనే పూర్వపదానికి హేతువును సూచిస్తోంది. మరి ఉత్తర పదానికి? ఇక్కడ "పట్నం" అనే ఉత్తర పదం ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ మూలం కావాలి. లేదా ఇంతకు మించిన మూలం మరొకటుంటే అది చూపాలి. అంతే తప్ప ఈ మూలాన్ని తొలగించరాదు.__చదువరి (చర్చరచనలు) 07:09, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, ఆ విభాగం "గ్రామ నామ వివరణ" కనుక అందులో పూర్వపదం, ఉత్తర పదానికి కూడా అర్థాలు చేరిస్తే బాగుంటుంది. పూర్వపదం "విశాఖ" ఎలావచ్చిందో అర్థాన్ని మూలంతో చేర్చాలి. అలాగే ఉత్తర పదం "పట్నం" అర్థాలు ఎలానూ మూలంతో ఉన్నాయి. K.Venkataramana(talk) 07:33, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ,మీరు చెపినట్లుగా విశాఖ అనే పూర్వ పదం ఎలా వచ్చిందో చేరిస్తే వ్యాసం విలువ పెరుగుతుందనడంలో ఏ సందేహమూ లేదు. అయితే ఈ "విశాఖేశ్వర" కథనం ఈ వ్యాసంలో ఈసరికే ఉంది. కాకపోతే పేరు అలా వచ్చిందని లేదు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 07:39, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
జనసామాన్యంలో కాలానుగుణంగా కొన్ని ప్రాంతాల పేర్లు మారిపోతూ ఉంటాయి. దానిలో అర్థాలను అన్నింటికీ వివరించలేము. కృష్ణా జిల్లాలోని "శ్రీకాకుళేశ్వరస్వామి" ఉన్న గ్రామం "శ్రీకాకుళం" ఉంది. అదే మా జిల్లా మొదట "చికాకోల్" , చిక్కోలు, కాలానుగుణంగా "శ్రీకాకుళం" గా మారింది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం "విశాఖేశ్వరనగరం" కాలాగుణంగా "విశాఖపట్నం" గా మారిన విషయాన్ని ఆ విభాగంలో రాయవచ్చు. అందులో పదాలకు అర్థాలు అవసరం లేదని నా అభిప్రాయం. K.Venkataramana(talk) 07:59, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పదాలకు వ్యుత్పత్తి తెలియకపోతే ఎలాగూ రాయలేం. మీరు చెప్పినట్టు దాన్ని ఉదహరించం. కానీ, తెలిసినపుడు రాయాలి. పైగా ఊళ్ళ పేజీల్లో ఆ పేరు ఎలా వచ్చిందని చెప్పే వ్యుత్పత్తి, ఆ పేజీల్లో ఒక ప్రధానమైన అంశం కదా. ఏదో కట్టుకథ తెచ్చి రాసేస్తే కుదరదు, తీసెయ్యాలి. ఊళ్ళ పేర్లకు ఆయా పేర్లు (ముఖ్యంగా ఉత్తర పదాలు) ఉత్తినే రాలేదనీ, కొన్ని ప్రత్యేక కారణాల వల్లనే ఆయా పేర్లు వచ్చాయనీ చెబుతూ ఆయా వ్యుత్పత్తులను మూలంలో చూపారు కూడాను. కాబట్టి ఉంచాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 08:12, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఊర్ల పేర్లలో ఉత్తర పదాలు కొన్ని ప్రత్యేక కారణాలతో రావచ్చు. కానీ విశాఖపట్నంలో ఉత్తరపదం ఎలా వచ్చిందో తెలియజేసే మూలం ఏదైనా ఉంటే ఉదహరించాలి. కానీ తెలియజేసిన మూలం ప్రకారం దీనికి కూడా వచ్చిందని తెలియజేయడం సంభావ్యత అవుతుంది. కానీ విశాఖపట్నం పేరు వ్యుత్పత్తికి సరైన మూలం కాదు. K.Venkataramana(talk) 08:40, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మూలం లో కూడా పద వ్యుత్పత్తి ఉంది. K.Venkataramana(talk) 08:51, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
విశాఖ అనే పూర్వ పదానికి మరో మూలం ఇది. ఏది సరైనదో!!? __చదువరి (చర్చరచనలు) 09:00, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
9-11 శతాబ్దంలో విశాఖేశ్వరుని ఆలయం నిర్మించినట్లు ఉంది. కానీ 639-40 AD లో చైనా యాత్రికుడు హ్యూయాంట్ సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి "విశాఖ రాజ్యం" గా రాసాడు. అప్పటికే "విశాఖ" అనే పదం ఉంది. ఈ వివరం మూలంలో ఉంది. K.Venkataramana(talk) 09:06, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పై మూలంలో Muslim saint, Ishaq Madina, revered by all, the Hindus and Muslims, especially those who lived off the sea. And the simplest yet most possible explanation is that the city got its name from its topography; ‘isaka’ is the Telugu word for sand. The vast sand expanses could have contributed to the name." అని కూడా ఉంది. K.Venkataramana(talk) 09:10, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది ఇంకోటి. ఒక్కొక్కళ్ళు రెండు మూడు విధాలుగా వచ్చాయని చెబుతున్నారు. దేనికీ మూలాలు ఇవ్వలేదు. దేనికీ కమిటవ్వడం లేదు. ఖచ్చితంగా ఫలానాది అని చెప్పే వీలు లేదు. __చదువరి (చర్చరచనలు) 09:16, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

visakhapatnam from inscriptions - jstor మూలం లో విశాఖపట్నంలోని శాసనాల గూర్చి వివరణ ఉంది. ఈ శాసనాల ప్రకారం 1102లోని శాసనంలో విశాఖపట్నం పూర్వపు పేరు "కులోత్తుంగ చోళ పట్టిణం" మరియు "విశాఖ పట్టిణం" అని ఉన్నది. అంటే కులోత్తుంగ చోళుడిని పూర్వమే "విశాఖ పట్టిణం" అని ఉన్నట్లు తెలియుచున్నది.మూలం చూడండి ఈ మూలంలోని 153 పుటలో ఉత్తర పదం "పట్టణం" లేదా "పట్టిణం" అనేది ఓడరేవు పట్టణం అయినందున వచ్చినట్లు ఉన్నది. విశాఖపట్నం జిల్లా గజిట్ (pp 2-3) ప్రకారం శివునికుమారుడు "వైశాఖ" (కార్తికేయుడు) పేరు పెట్టినందున "విశాఖ" అనే పూర్వపదం వచ్చినట్లు ఉన్నది. K.Venkataramana(talk) 10:36, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

హ్యుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కూడా విశాఖ అనే రాజ్యం గురించి ప్రస్తావించాడని ఈ మూలం లో ఉంది. కొన్ని మూలాలలో "వైజాగ్ పటం" అని పేరు కూడా ఉన్నది. విశాఖపట్నం పేరు వ్యుత్పత్తి గురించి వివిధ రకాలుగా బి.బి.సి.కాం మూలం లో పూర్తిగా ఉంది. K.Venkataramana(talk) 12:22, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ! సరైన నిర్ణయం ప్రకటించినందుకు కృతజ్ఞతలు. మీకు చర్చలను అర్థంచేసుకొనే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనీ, అవకాశం లభించినప్పుడు తెవికీని ముందుండి నడిపించగలరని తెవికీ సమూహానికి మరోసారి రుజువైంది. రోజంతా బాగా శ్రమబడి మూలాలు వెతకడానికి ప్రయత్నించారు. ఇక్కడ మీరు పునరుద్ఘాటించినట్లు పట్నం మూలం విశాఖకు సంబంధించినదై మాత్రమే ఉండాలి. దీనికి ఎదురులేదు. ఇప్పుడున్న మూలం ఏ మాత్రం సరైనది కాదు. ఎంత స్పష్టంగా చెప్పిననూ కొందరికి అర్థం కావడం లేదు. చదువరి గారు నిర్వాహకుడై ఉండి కూడా రంధ్రాన్వేషణ అంటూ, ప్రవచనాలంటూ, ఊకదంపుడంటూ మాట్లాడటం సరైన పద్దతికాదు. చర్చలలో హుందాతనం లేకుండా ప్రవర్తించడం ఏ మాత్రం సహించరానిది. మునుపటి నిర్ణయానికి (?) అభ్యంతరం చెప్పడానికి సరైన కారణాలు కూడా ఉన్నాయనీ మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. విశాఖ పేరు రావడానికి ఖచ్చితమైన ఆధారం లేనప్పుడు ఆ విషయాలన్నీ పేర్కొంటూ రెండు, మూడు ఆధారాలు (మూలాలు) కూడా ఇవ్వవచ్చు. అంటే ఫలానా రచయిత ఇలా చెప్పాడు, ఫలానా గ్రంథంలో ఇలా ఉంది అంటూ వ్రాయవచ్చు. ఉదా:కు భాగ్యనగర్ పేరు రావడానికి భాగమతి ఒక కారణం కాగా, ఉద్యానవనాలు (బాగ్) మరో కారణం (నగర్ గురించి ఎక్కడా లేదు). ఈ వ్యాసంలో కూడా ఇదే విధంగా మార్పులు చేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:56, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

1908 నాటి బ్రిటిషు ఇండియా వారి ఇంపీరియల్ గజటీర్ విజాగపటం (VIZAGAPATAM) అంటోంది. ఈ గజెట్ మొదటి కూర్పు 1880 లో వెలువడింది. పోతే.. వెంకటరమణ గారు తన అభిప్రాయాల్లో వెల్లడించిన మూలాలనూ, ఇతర మూలాలనూ బట్టి చూస్తే నాకు అవగతమైనదిది:

  1. పేరులో పూర్వపదమైన విశాఖకు కనీసం 4 కథనాలున్నాయి - విశాఖేశ్వర, ముస్లిము పేరు నుండి, ఇసక, బౌద్ధ విశాఖ
  2. ఉత్తర పదమైన పట్నానికి రెండు కథనాలున్నాయి ఒకటి నేరుగా విశాఖపట్నం లో పట్నం అంటే రేవుపట్టణం అని చెప్పేది. రెండోది జనరిక్‌గా చెప్పేది - పట్నం అంటే వ్యాపార పట్టణం, నగరం, రేవు పట్టణం అని మూడు విధాలుగా ఉండొచ్చు అని. పట్నం అంటే రేవు పట్నం మాత్రమే కాదు అని చెప్పడానికి తీరాన లేని అనేక పట్నాలను ఉదహరించవచ్చు. వెంకటరమణ గారు కూడా ఈ మాట చెప్పారు.

పై సంగతులను బట్టి వ్యాసాన్ని కింది విధంగా సవరించాలని నా ప్రతిపాదన:

  1. విశాఖపట్నం పేరులో రెండు పదాలున్నాయి పూర్వ పదం విశాఖ ఈ పేరు ఎలా వచ్చిందని చెప్పేందుకు కింది కథనాలున్నాయి అంటూ అందుబాటులో ఉన్న కథనాలను మూలాలతో సహా ఉదహరిస్తాం. (హ్యూయన్ త్సాంగ్ మూలాన్ని ఉదహరించకూడదని నా అభిప్రాయం ఎందుకంటే దాన్ని ఉదహరించిన వెబ్‌సైటులో, త్సాంగ్ విశాఖ వచ్చాడని చెప్పే మూలం చూపలేదు. ఎక్కడైనా ఉంటే దాన్ని చూపవచ్చు)
  2. పట్నం అనే మాటకు వ్యుత్పత్తి చూపించాలి (ఎందుకు చూపించాలి అంటే విశాఖేశ్వరపురం అనేది పట్నంగా ఎందుకు మారి ఉంటుంది అనే దానికి ఆధారం ఇది కాబట్టి) రెండు ఆధారాలున్నాయి 1. బిబిసి వారి "పట్నం" కథనం. 2. పట్నం అనే ఉత్తర పదానికి చారిత్రికార్థం చెబుతున్న ప్రస్తుత మూలం.

ఫై విధంగా వ్యాసంలో మార్పులు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రవిచంద్ర గారు, తన నిర్ణయం చెప్పిన తరువాత జరిగిన చర్చను కూడా పరిశీలించి, తన నిర్ణయాన్ని తిరిగి పరిశీలించుకుని మార్చాలనుకుంటే మార్చడం, అలాగే ఉంచాలనుకుంటే ఉంచడం చేసి తన తుది నిర్ణయం చెప్పాలని నా అభిప్రాయం. చర్చకు మరింత సమయం ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. ప్రస్తుతానికి ఈ చర్చలో నా ప్రమేయం ముగిసింది -కొత్తగా ఏదైనా విషయం వస్తే తప్ప. రవిచంద్ర గారూ, మీ నిర్ణయం బాలేదు, మరొకరు చెప్పాలి అంటూ చేసిన వాదన నిర్హేతుకం. మీరు దాన్ని గణించవద్దని నా మనవి. __Chaduvari 05:31, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేను నిర్ణయం ప్రకటించింది పట్నం కు సంబంధించిన మూలం ఈ వ్యాసంలో ఉండాలా వద్దా అనే విషయానికి సంబంధించి. అది అలాగే ఉంచాలి. పై చర్చలు జరిగిన తర్వాత కూడా నా నిర్ణయంలో మార్పు లేదు.- రవిచంద్ర (చర్చ) 05:45, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, మీరు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇదివరకు మీరు చేసిన నిర్ణయం తరువాత జరిగిన చర్చలో ఎంతో సమయం వెచ్చించి అనేక మూలాలను అందించాము. నిర్ణయం తీసుకొనే ముందు మేము ఉంచిన మూలాలను పరిగణనలోకి తీసుకున్నారా? చర్చలో సభ్యుల అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోనికి తీసుకోలేదు? మూలాలు దొరకనప్పుడు ఏదైనామూలం చేర్చి ఉంచవచ్చు. ఇక్కడ మూలాలు చేర్చినవారిని, సమర్థించే వారికి ఎవరినీ తప్పుపట్టడం లేదు. సరైన మూలం మేము అందించిన తరువాత మేము అందించిన మూలాల ప్రస్తావన మీ చర్చలో ఎందుకు చేయలేదు? వ్యాసం లో ఆ విభాగం చర్చల తరువాత ఎలా ఉంటే బాగుంటుదో చదువరి గారు కూడా కొన్ని సూచనలు చేసారు. వాటి గూర్చి నిర్ణయంలో ఎందుకు ప్రకటించలేదు. ఇక్కడ వ్యాస అభివృద్ధి దృష్ట్యా ఆలోచించగలరు. ఏదైనా వ్యాసంలో కామన్స్ లోని చిత్రం దొరకనప్పుడు ఫెయిర్ యూజ్ చిత్రం తాత్కాలికంగా చేర్చుతాము. కామన్స్ చిత్రం వచ్చిన తరువాత ఈ చిత్రం అవసరం ఉండదుకదా. మూలం దొరకనప్పుడు ఏదైనా మూలం చేర్చవచ్చు. వ్యాసానికి సంబంధించిన సరైన మూలం దొరికినప్పుడు దానిని చేర్చితే తప్పేముంది? మీ నిర్ణయం సరైనదే అనుకుందాం. అలాంటప్పుడు ఉత్తరపదం "పట్నం" అని ఉన్న గ్రామ వ్యాసాలలో కూడా "నెల్లూరు జిల్లా" సంబంధిత మూలాన్ని చేర్చవచ్చా? తెలియజేయగలరు. ఈ వ్యాసంలో "విశాఖపట్నం" వ్యుత్పత్తి గూర్చి ఎలా చేస్తే బాగుంటుందో తెలియజేయగలరు. K.Venkataramana(talk) 05:24, 31 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ, నాకు సమయం కుదరకపోవడం వల్ల మీరు చర్చించిన మూలాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాను. అందుకు నన్ను మన్నించాలి. నాకు సమయం లేనప్పుడు నేనే చర్చలో దూరి ఉండాల్సింది కాదు. ఇకముందు జాగ్రత్తగా ఉంటాను. ముందుగా చెప్పినట్టుగా నేను తీసుకున్న నిర్ణయం కేవలం "పట్నం" వివరణకు సంబంధించిన మూలం ఈ వ్యాసంలో ఉండాలా వద్దా అని మాత్రమే. ఆ మూలం అలాగే ఉంచవచ్చు అని చెప్పాను. మిగతా విషయాల గురించి మాట్లాడలేదు. ఇక మీరు సమర్పించిన మూలాలు అన్నింటినీ పరిశీలిస్తే ముందుగా సమర్పించిన మూలం అవసరం లేదు అనిపిస్తున్నది. అలాగే ఆ మూలాల్లో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

వ్యాసానికి సంబంధించిన సరైన మూలం దొరికినప్పుడు దానిని చేర్చితే తప్పేముంది? మీరు పరిశోధించిన మూలాలు చేర్చి పేరుకు సంబంధించిన విభాగాన్ని అన్ని కోణాల్లో విస్తరించండి. దానికి నాకు ఏ అభ్యంతరం లేదు. నా నిర్ణయంలో దానిని ఎక్కడా తప్పుపట్టలేదు. అలాంటప్పుడు ఉత్తరపదం "పట్నం" అని ఉన్న గ్రామ వ్యాసాలలో కూడా "నెల్లూరు జిల్లా" సంబంధిత మూలాన్ని చేర్చవచ్చా? ఇది ఈ వ్యాసానికి సంబంధించిన చర్చ కాదు అని నేను ముందే తెలియజేసి ఉన్నాను. అయినా సరే, మీరడిగారు కాబట్టి చెబుతున్నాను. పట్నం చివరన ఉన్న ప్రతి గ్రామానికీ ఈ మూలం అవసరం లేదు. మరి ఈ వ్యాసంలో మాత్రం ఎందుకు అని మీరడగవచ్చు. అందుకు నా సమాధానం; ఏ మూలం లేనప్పుడు పవన్ సంతోష్ గారు ఊరి పేర్ల గురించి కొంత పరిశోధన చేసి కొన్ని మూలాలను పట్టుకొచ్చి ఎక్కడ అవసరమో అక్కడ చేర్చడం జరిగింది. కేవలం ఆయన కృషి మీద గౌరవంతో కేవలం ఈ వ్యాసంలో ఉంచమని చెప్పాను. అది కూడా ముగ్గురం సమర్ధించాం (పవన్, నేను, చదువరి), ముగ్గురం (అర్జున, చంద్రకాంతరావు, మీరు) వ్యతిరేకించాము కాబట్టి ఆ తటస్థ స్థితిలో నిర్ణయం చేయడం కష్టమైంది నాకు. -రవిచంద్ర (చర్చ) 18:10, 1 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ, నిర్ణయం పై సముదాయం నేర్చుకొనదగినవి

[మార్చు]

అర్జున అభిప్రాయం

[మార్చు]

చర్చలో పాల్గొన్న వారికి నా ధన్యవాదాలు. వ్యాసానికి మార్పులు చేసిన వెంకటరమణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చర్చ లేవదీసిన వ్యక్తిగా నా అభిప్రాయం పేర్కొన దలచాను. దీని గురించి చర్చను పొడిగించే ఆసక్తి నాకు ఏమీలేదు. కాకపోతే ఈ చర్చనుండి సముదాయం కొంత నేర్చుకొని ముందు ముందు చర్చలు మెరుగుగా వుండాలని కోరుతున్నాను.

  • నిర్ణయాలనేవి తటస్థ స్థితినుండి బయడపడేసేటట్లుగా వుండాలి, తటస్థస్థతికి చేర్చేవి లాగా వుండకూడదు. సరియైన నిర్ణయం జరగడానికి, సముదాయంలో క్రియాశీలక సభ్యులు చర్చలలో గడువు తేదీలోగానే పాల్గొనాలి.
  • నిర్ణయం చేసే వ్యక్తి విషయం పెద్ద చర్చించదగినది కాదు అనటం సరికాదు. వ్యాసాన్ని మంచి వ్యాసంగా రూపుదిద్దడానికి ఒక వ్యక్తికి సరిగాలేదనిపించే కదా చర్చను లేవనెత్తింది, ఆ చర్చ ఫలితంగానే కదా సొంత పరిశోధన వాక్యాలను తొలగించింది. అప్పుడు పెద్ద చర్చించదగినది కాదు అని ఎలా అవుతుంది.
  • పాల్గొనే ప్రతి ఒక్కరు వికీమర్యాద పాటించాలి. దీనిలో నిర్వాహక, అధికార హోదాలో వున్నవారు మరింత బాధ్యత వహించాలి. అప్పుడే చర్చ సామరస్యంగా జరుగుతుంది.
  • ఎవరో చాలా కష్టపడి మూలం చేర్చారు కాబట్టి ఆ మూలం వుండనిస్తే బాగుంటందనేది కూడా వికీపీడియా వ్యాసాల నాణ్యత పై ధ్యాసతో కాక, వ్యక్తుల కృషి మీద ఇష్టాయిష్టాలపై అధారపడి నిర్ణయించబడిందనే అపవాదుకు కూడా లోనవుతుంది.--అర్జున (చర్చ) 10:20, 2 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఈ నీతులన్నీ వినదగునెవ్వరు చెప్పిన అని బాసింపట్టు వేసుక్కూర్చున్న పవన్ సంతోష్‌, చదువరి, రవిచంద్ర, పాక్షికంగా వెంకటరమణలకే వర్తిస్తాయా, మీకూ, చంద్రకాంతరావు మహాశయులకూ కూడా వర్తిస్తాయా? అహ, ఎందుకు అడుగుతున్నానంటే-
  • చర్చ:వాసి (ప్రసిద్ధి) అనే వ్యాసంలో తటస్థంలోకి తటస్థమైన నిర్ణయమొకటి చేశారు. ఇక్కడ కనీసం వెంకటరమణ గారూ, రవిచంద్ర గారూ తమ నిర్ణయాల ప్రకారం మార్పులు అయినా చేశారు. ఆ వ్యాసంలో తమరు, తమ వెంట చంద్రకాంతుల వారూ కించిత్తు మార్పు కూడా చేయకుండా, తమ నిర్ణయ అమలు బాధ్యత లేకుండా "ఆంగ్ల వికీపీడియా వ్యాసాల మాదిరిలో వ్యాసాన్ని విస్తరించవలసినదిగా సూచించడమైనది" అనేసి తుండు దులుపుకుని వెళ్ళిపోయారు. "ఏమీ లేదు తొలగించడెశె" అన్నవాళ్ళ మాటా కాదు, "లేదు బావుంది ఉంచండి" అన్నదీ లేదు - మరీ మురారేః తృతీయః పంథా అన్నట్టు పోయారు తమరు, మీ వెనుక చంద్రకాంతుల వారూను. నేను అలా గుడ్లప్పగించి చూస్తున్నాను ఆ విస్తరణ అనే అద్భుతం ఎప్పుడు చేస్తారా అని.
  • వందలాది (బహుశా వేలాది) గ్రామాల వ్యాసాల్లో "ఈ ఊళ్ళో రెండువేల ఫలానా సంవత్సరంలో సకల జనుల సమ్మె జరిగింది" అని చంద్రకాంత రావు గారు రాసి పడేసి, తర్వాత ఆ విషయం యర్రా రామారావు గారో, నేనో, చదువరి గారో ముందుకు తెస్తే "అదేమంత పెద్ద విషయం కాదని" కొట్టిపారేసినారు కదా. ఒక్క వ్యాసంలో ఒక వాక్యం తొలగింపుకు మీరు చేసిన చర్చలు సమర్థించదగ్గవి అయితే, అన్ని వందల వ్యాసాల్లో ఆయన చేసిన మార్పులను కొట్టిపారేయడం మీకు చీమ కుట్టినట్టయినా లేదు, ఎప్పుడూ మీరు మధ్యలో కలగజేసుకుని "బహుశా ఇది సరైనది కాదేమోనండీ" అని తమలపాకుతో కూడా తట్టినట్టు లేరు. ఆయనకి వర్తించదా? ఆయన్ను మట్టుకు ఖండించను అంటారా? చెప్పగలరు.
  • //ప్రస్తుత తెవికీలో సాంకేతిక అంశాలపై అర్జున గారికి మరియు చర్చలను అర్థం చేసుకొనే స్థోమత వెంకటరమణ గారికి తప్ప ఎవరికీ లేదు.// చంద్రకాంత రావుగారు మిమ్మల్ని ప్రస్తుతించి, మమ్మల్ని తూలనాడి, చర్చలకు తగము అన్నప్పుడు "ఆయ్, వికీ మర్యాద అని ఒకటుంది. ఇలా సభ్యుల సమర్థతను అంచనా కట్టకూడదు. ఆవటా" అని కాస్త వినయం ప్రకటించే ఉద్దేశం మీకు లేనప్పుడు ఎదుటి వాళ్ళకు మాత్రం బోధించి ఏం ఉపయోగం ఈ వికీ మర్యాదలు. నన్ను గల్లా పట్టుకుని నువ్వు చెప్పావా అని అడగద్దు, నేనెవరికీ ధర్మోపన్యాసాలు చేయట్లేదు వికీ మర్యాదల గురించి, మీరు చేస్తున్నారు కండువా వేసుకుని, మీకు ఆ బాధ్యత ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. పైపెచ్చు మీరు విడిగా ప్రస్తావించినట్టు మీరు అధికార హోదాలో ఉన్నవారు కూడాను.
  • "కష్టపడి మూలం చేర్చాను ఉంచండి బాబూ" అని అడగాల్సిన దుస్థితి నాకు లేదు. అవినయంగా తోచినా ఫర్వాలేదు- నేను అభివృద్ధి పరచిన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, ఘట్టమనేని కృష్ణ, జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947 - వంటి వివిధ అంశాలకు చెందిన వ్యాసాలు చూడండి. అప్పుడు వచ్చి మాట్లాడండి. అవన్నీ పక్కన పెట్టి ఈ వ్యాసం వరకూ చూసినా - మీరు వెళ్ళి ప్రామాణిక భాషావేత్తలతో మాట్లాడి చూడండి, "ఉత్తర పదానికి గ్రామ నామంలో విలువ ఉండదు" అన్నామూ, దానికి ఇచ్చిన మూలాన్ని తిరస్కరించబోయామూ కరెక్టేనా అని. ఆపైన వచ్చి నాకు చెప్పండి. మరోమాటు చెప్తున్నాను, నేను చేసిన ఏ కృషికీ "అయ్యో పాపం" అని ఉంచాల్సిన స్థితి కానీ, "భవిష్యత్తులో ఎవడో వచ్చి విస్తరిస్తాడు లే, పాపం ఉంచండి" అనుకోవాల్సిన స్థితి కానీ లేదు. ఒకవేళ ఉంటే - నేనే తొలగించమంటాను. అయ్యా ఉంచండి అని అర్థించాల్సిన అవసరం లేదు నాకు. మరొక్కసారి చెప్తున్నాను - ఏ గ్రామనామ అధ్యయనకారుడిని కానీ, ఏ భాషావేత్తని కానీ పిలిచి అడిగి చూడండి. మీరెలాగూ పుస్తకం చదవనే చదవరని అర్థమైపోయింది.
క్లుప్తంగా చెప్పవచ్చేదేమంటే మీరు చెప్పిన నీతులన్నిటినీ ఇంతవరకూ మీరే ఉల్లంఘన చేశారు అర్జున రావుగారూ. ఉద్దేశపూర్వకంగా ఒకరికొకరు తోడై మేం చేసే ప్రతీ కృషినీ చిన్నబుచ్చాలని చూస్తున్నారు. మనకు ఏమైనా గట్టు తగువు గత జన్మలో ఉందో ఏమో నాకు తెలియట్లేదు. లేవనెత్తుతున్నారు. వీటన్నిటి తర్వాతా కూడా నాలో వికీ పట్ల ఉన్న నిబద్ధతని, అధ్యయనం చేసి రాయగల నా జీవశక్తినీ ఏమీ చేయలేరు. నేను రాసుకుంటూ వెళ్తాను. మీరూ, చంద్రకాంతుల వారూ లేని తప్పులెన్నే ప్రయత్నం, మేము (ఈ బహువచనంలోకి ఎవరం వస్తామో, మీ ఇద్దరికీ తెలుసు) ఎక్కడ ఎవరి పొరబాటు సరిజేయబోయినా వారిని ఉత్తి పుణ్యానికి సమర్థించే ప్రయత్నం చేస్తూ పోండి. వికీలో ప్రతీదీ రికార్డవుతుంది. భావి తరాలు మనందరి గురించి వారి వారి అంచనా వేయక మానరు. --పవన్ సంతోష్ (చర్చ) 09:12, 4 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యా పవన్ గారూ, చర్చను హుందాతనంతో చేయడానికి మీకు రాదా? లేదా మనసొప్పదా? తెవికీ అంటే పిల్లలాటగా ఎందుకు చేస్తున్నారు? ఇదేచర్చలో హుందాతనం గురించి పైన చదవలేరా? ఇలాగైతేనే ఎవరూ చర్చ చేయరనీ మీరనుకున్నది చేయవచ్చనే అభిప్రాయమా? చర్చను నీతులని ఎందుకు భావిస్తున్నారు? నన్ను గ్రూపిజంలో ఎందుకు పరిగణిస్తున్నారు? అహ, తుండు దులుపుకుని, తొలగించడెశె, గుడ్లప్పగించి, చీమ కుట్టినట్టయినా లేదు, తమలపాకుతో కూడా తట్టినట్టు లేరు, ఆయ్, ఆవటా, గల్లా పట్టుకుని ... ఇవన్నీ ఒక్క చర్చలోనే ... ఇవేమి మాటలు?? ప్రతీదీ రికార్డవుతుందనీ ఒక వైపు చెబుతూనే మరో వైపు ఎందుకీ వెక్కిరింపులు? చర్చ సీదాగా సభ్యతతో చేయడానికి రాదంటే దాన్ని నేర్చుకొని చర్చలు చేయండి, అంతవరకు చర్చలకు దూరంగా ఉండండి, అంతేకాని చర్చలలో మీ ఇష్టమైన విధంగా ఎదుటి వ్యక్తులను వాగ్బాణాలతో సంధించడం మాత్రం సరైన పద్దతికాదు. నేను వెనక్కి పోవడం లేదు. ఇప్పటి సంగతే చెబుతున్నాను. ఈ మధ్య చర్చలలో మీ ప్రవర్తన ఏ మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదు. నిర్వాహకులై ఉండి కూడా ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు తీసుకురావడం లేదు. చర్చలో నా పేరు కూడా తీసుకువచ్చారు కాబట్టి నేను సమాధానం ఇస్తున్నాను.
1) వాసి (ప్రసిద్ధి) వ్యాసంలో మార్పులకు నాకు బలవంతం ఎందుకు చేస్తున్నారు? చర్చ చర్చే, చర్య చర్యే. చర్చించిన వాళ్ళే చర్యలు తీసుకోవాలని ఎందుకు మీ బలవంతం. కొన్ని పాలసీలు చేసి ఏళ్ళు గడుస్తున్నా ఆ పాలసీలను ప్రతిపాదించిన వారు పాలసీలకనుగుణంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? అలాంటివి మీరు అడగరు!! చెప్పాలంటే నాకూ చాలా ఉన్నాయి ఇక్కడ జరిగే పొరపాట్లు!! మీరంతా ఏకపక్షంగా ఆలోచిస్తున్నారు!
2) నా సకల జనుల సమ్మె గురించి చెప్పినా అర్థంచేసుకోక మళ్ళీ మళ్ళీ చర్చలలో ఎందుకు ప్రస్తావిస్తున్నారు? మీలా నేను తొలగింపుకు వ్యతిరేకంగా ఏ మాత్రం పట్టుపడలేను. ఎందుకు చేర్చాను, అసలు దాని ఉద్దేశ్యమేమిటి తెల్సుకోకుండా మాట్లాడటం సరైనది కాదు. అకస్మాత్తుగా సెలవులో ఉండిపోవుటచే చాలాకాలం తర్వాత ఆ సమాచారం అలాగే ఉండి సభ్యుల దృష్టికి వచ్చినప్పుడు నేనేమాత్రం అభ్యంతరపర్చకున్ననూ మళ్ళీమళ్ళీ చర్చలలో లేవనెత్తడం మీ హుందాలేనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏ మాత్రం తెవికీ పరిజ్ఞానం ఉన్న సభ్యుడైనా తొలగింపుకు పట్టుబడని సభ్యుడితో వాదించే అవసరం ఉండరాదు.
3) ప్రస్తుత తెవికీలో సాంకేతిక అంశాలపై అర్జున గారికి... అనడం నేనవర్ని ప్రస్తుతించడం కాదు తూలనాడడం అసలే కాదు. వెనక్కి పోవాల్సిన అవసరం లేదు కాని ఇటీవలి సభ్యుల దిద్దుబాట్లు చూస్తే ఏ సభ్యుడైనా/నిర్వాకుడైనా ఏ సాంకేతిక సమస్య వచ్చినా అర్జునగారికే ఎందుకు అడుగుతున్నారో ఆలోచించండి. సాంకేతిక విషయాలలో అర్జునగారితో సమానంగా కాదుకదా ఆయన దరిదాపుల్లో ప్రస్తుత తెవికీలో ఎవరైనా ఉంటే ఆ పేరైనా చెప్పండి మరి. వాస్తవం చెబితే సహించక ప్రస్తుతించడం, తూలనాడడం మాటలు వాడితే ఎలా?
4) ఎక్కడో దొరికిన ఒక పట్నం మూలాన్ని ఇక్కడ చేర్చడాన్ని అర్జునగారు తప్పుపడితే దాన్ని అప్పుడే తొలగించమని చెప్పడం కాకుండా చర్చను అర్థం చేసుకోకుండా చర్చను రచ్చరచ్చ చేసి, చర్చలను వక్రీకరించి, మళ్ళీ ఎదుటివారిపై వాగ్బాణాలు విసరడం ఘోరమైన చర్యగానే భావించవలసి ఉంటుంది. ఉత్తర పదానికి గ్రామ నామంలో విలువ ఉండదని ఇక్కడ ఎవరూ చెప్పలేరు కాని చర్చను పూర్తిగా అర్థం చేసుకోకపోతే అలాగే అర్థమౌతుంది. అందుకే చెప్పాను చర్చలను అర్థం చేసుకొనే స్థోమత వెంకటరమణ గారికి తప్ప ఎవరికీ లేదని, అది మరోసారి రుజువైంది.
5) చివరగా "లేని తప్పులెన్నే ప్రయత్నం" అని మళ్ళీ నా పేరు ఉటంకించారు. లేని తప్పులు కాదు నేను చెప్పేది ఉన్న తప్పులే. తప్పులు చెబితే సవరించుకోండి అంతే కాని ఎదురుదాడికి దిగడం కాదు.
6) అవర్ తెలుగునాడు డాట్ కామ్‌ చర్చలో "రామారావు గారు ఇన్నిటిని వింగడించి, వెతికి, అర్థం చేసుకుని, రాసి, తెచ్చి తన వెబ్‌సైట్‌లో స్వంత డబ్బు పెట్టి పెట్టుకుని, ఇంతా చేయగలిగినప్పుడు ... లింకులు తీసేయడం సరికాదు, వద్దు" అన్నారు. అక్కడ మీకు పొరపాటు కనిపించలేదా? సదరు సభ్యుడే ప్రారంభంలో తెలియక చేసిన తప్పును ఇప్పుడు తొలగించమని చెబితే మీరు అడ్డుపడడమేమిటి? ఒక సభ్యుడు స్వయంగా తన వెబ్‌సైటు లింకులు వందలాది వ్యాసాలలో చేర్చడాన్ని మీరెలా సమర్థిస్తారు? అది కాపీ సమాచారమే కాని స్వయంగా రూపొందించినది కూడా కాదు. ఇక్కడ నియమాలు చూసే అక్కర్లేదా? నేను ఎవరు పొరపాటు చేసినా చెబుతాను, సరైన పనికే సమర్థిస్తాను కాని మీలా పొరపాట్లను సమర్థంచే అవసరం మాత్రం నాకు లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:35, 4 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
//ఎందుకు చేర్చాను, అసలు దాని ఉద్దేశ్యమేమిటి తెల్సుకోకుండా మాట్లాడటం సరైనది కాదు.// సకల జనుల సమ్మె వివరాలు ఎందుకు చేర్చారు? దాని ఉద్దేశమేమిటి? అది తప్పా, ఒప్పా? సూటిగా, సవివరంగా చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 13:56, 5 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తెలంగాణ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. అది తొలిదశ ఉద్యమమైనా లేదా మలిదశ ఉద్యమమైనా సరే. అలాగే తెలంగాణకు సంబంధించిన మండలాలకు కూడా తెలంగాణ ఉద్యమం చరిత్ర అవసరం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రముఖమైనది సకలజనుల సమ్మె. 42 రోజులపాటు ఊరుఊరునా, వాడవాడన ఉద్యమం హోరెత్తింది. పాఠశాల విద్యార్థులు నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఆ 42 రోజులపాటు సమ్మె పూర్తిగా సఫలమవడం ప్రతిమండలానికి గర్వకారణమైన చరిత్ర. కవులు, కళాకారులు, న్యాయవాదులు, ఉద్యమ సంస్థలు, రాజకీయ నాయకులు కూడా సమ్మెకు తోడైనారు. తెలంగాణ అంతటా అన్ని మండలాలలో 42 రోజులు సమ్మె జరిగింది కాని సమ్మె జరిగిన విధానంలో ఒక మండలానికి మరో మండలానికి తేడా ఉంది. ఏ మండలంలో ఎలా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, ఏయే సంఘటనలు జరిగాయి తదితరాలన్నీ పూర్తిగా ప్రతీ మండలానికి ప్రత్యేకమే. అప్పట్లో అన్ని వార్తాపత్రికల జిల్లా ఎడిషన్ల పేజీలన్నీ సకలజనుల సమ్మెతో కూడిన వార్తలే. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాదు జిల్లాకు చెందిన జిల్లా ఎడిషన్ల పేపర్ క్లిప్పింపులు అప్పట్లో నా వద్ద ఉన్నాయి. మిగితా 6 జిల్లాల సమ్మె వివరాలు అంతర్జాలం ద్వారా సేకరించాను. వీటి ఆధారంగా ఆయా మండలాలలో సమ్మె వివరాలు చేర్చాలనీ, ఒక్కో మండలంలో జరిగిన సమ్మె ప్రత్యేకతలు, సంఘటనలు మండల వ్యాసాలలో చేర్చి మూలాలతో పరిపుర్ణం చేయాలనీ తలంచి ముందుగా AWB ద్వారా విభాగాన్ని మరియు 2 వాక్యాల సమాచారాన్ని చేర్చాను. ఒక్కో మండల వ్యాసంలో మానవీయంగా ఆయా మండలాలకు సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని చేర్చేటప్పుడు ఈ వాక్యాలను మండలాలకనుగుణంగా మార్చుతూ మండల పరిధిలోని గ్రామాలలో జరిగిన సమ్మె వివరాలు, సంఘటనలు, అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాల్గొన్న ప్రముఖులు తదితరాలు ఆయా మండలాలకు సంబంధించి జిల్లా ఎడిషన్ల మూలాలతో సహా సమాచారాన్ని పొడగించడం ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యం ప్రారంభంలోనే ఆగిపోవడం జరిగింది. ఒకవేళ అనుకున్నది జరిగితే ప్రతి మండల వ్యాసానికి ఆ విభాగం మకుటాయమానంగా నిలిచేది. అంతేకాదు తెవికీకి కూడా మంచిపేరు వచ్చేది, పాఠకులకు ప్రయోజనకరంగానూ ఉండేది. కాని ఆ తర్వాత తెవికీ సెలవులోకి వెళ్ళిపోవడం, సంవత్సరం తర్వాత వచ్చిననూ తెవికీ చురుకుదనం తగ్గిపోవడంతో అది అలాగే ఉండిపోయింది. ఇటీవల నా దృష్టికి వచ్చిన తర్వాత తొలగింపుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేను. ప్రారంభంలో చేర్చింది ఆ రెండు వాక్యాలను కూడా అలాగే ఉంచకుండా మండలాలకనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం ప్రణాళికలో భాగం. జరగని పని గురించి నేను బాధపడాలి కాని ప్రతి సందర్బంలో ఈ విషయాన్ని ఉటంకించడం బాగుండదు. తొలగించడాన్ని వ్యతిరేకిస్తే అది నా తప్పు కాని నేనెప్పుడు వ్యతిరేకించలేను. మీ సందేహానికి నేను పూర్తి వివరణ ఇచ్చాను. ఇకముందు నేను అడిగిన వాటికి కూడా మీరు ఇలాగే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:03, 5 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ పవన్ సంతోష్ గారు అడిగింది, మీరు చేసినది తప్పా ఒప్పా? అని. పూర్తి వివరణ ఇచ్చానని రావుగారు అన్నారు. కానీ ఇక్కడ ఆయన ఇచ్చిన వివరణ, గతంలో ఆయనే ఇచ్చిన వివరణకు విరుద్ధంగా ఉంది. గతంలో ఇదే విషయమ్మీద ఒకచోట వివరణ ఇస్తూ - వెంటనే తొలగించేద్దామని ముందే అనుకుని ఆ సమాచారాన్ని చేర్చానని చెప్పారు. ఇంకా తొలగించకపోవడం బాధాకరం అని కూడా అన్నారు. తొలగించాలని ముందే ప్లాను వేసుకుని సమాచారాన్ని చేర్చడం ఏంటి, అసలు తొలగించదగ్గ సమాచారాన్ని చేర్చడం తప్పుకదా అని అప్పట్లో అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా దాటేసారు. ఇప్పుడేమో వెర్షను పూర్తిగా మార్చేసారు. తొలగించేద్దామనేది మొదటి వెర్షను, విస్తరించాలనేది రెండో వెర్షను. ఈ రెండు వెర్షన్లలో ఒక్కటే నిజమయ్యే అవకాశం ఉంది. ఏది అబద్ధం?
సరే ఇప్పుడు ఆయన చెప్పిన రెండో వెర్షనులో ఉన్న లొసుగుల గురించి:
  1. బోల్డంత సమాచారాన్ని సేకరించాను గానీ ఆ తరువాత నేను చురుగ్గా లేనందువల్ల చేర్చలేదు అని అన్నారు. కానీ, తరువాతి సంవత్సర కాలంలో ఆయన చురుగ్గానే ఉన్నారు. 200 పైచిలుకు మార్పులు చేసారు. ఉత్త చర్చలే కాదు ప్రధాన పేరుబరిలో కూడా మార్పుచేర్పులు చేసారు. ఏ పేజీల్లోనైతే సకల జనుల సమ్మె విశేషాన్ని గంపగుత్తగా చేర్చారో ఆ పేజీల్లో కూడా వేరే మార్పుచేర్పులు చేసారు. (ఉదా. చూడుడు: కల్వకుర్తి) కనీసం ఆ పేజీల్లోనైనా తాను సేకరించిన "మకుటాయమానమైన" సమాచారాన్ని చేర్చవచ్చు గదా? పోనీ మొదటి వెర్షను ప్రకారం తొలగించవచ్చు గదా? రెండూ చెయ్యలేదు. ఎందుకు? తరువాత యర్రా రామారావు గారు చేసారాపని.
  2. ఇదే కాలం లోనే, తాను చేసిన పనిలాంటి పనే చేస్తున్నారని - అంటే ఒకే రకమైన సమాచారాన్ని పలు గ్రామాల పేజీల్లో చేరుస్తున్నారని - ఇతర వాడుకరులను ఆయన విమర్శించారు, చర్య తీసుకుంటానని హెచ్చరించారు. ఇతరులను హెచ్చరించడానికి తీరిక చిక్కిందిగానీ తన తప్పును సవరించుకునే సమయం దొరకలేదని అనడం అశ్చర్యంగా ఉంది.
రావు గారు చేసినది ఒకటి కాదు మూడు తప్పులు - 1. గంపగుత్తగా సమాచారం చేర్చడం, 2. అదే పని చేసినవాళ్ళను హెచ్చరించడం/తన తప్పును గుర్తించకపోవడం, 3.సముదాయం దాన్ని లేవనెత్తినపుడు విరుద్ధమైన వివరణలు ఇవ్వడం.
__చదువరి (చర్చరచనలు) 11:04, 6 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించిన ఒక పని సెలవులోకి వెళ్ళిపోవడంతో అర్థాంతరంగా ఆగిపోవడం బాధాకరమే. వెంటనే తొలగించాల్సిన సమాచారం అనేది కేవలం అన్ని మండలాలలో ఒకేలా కనిపిస్తున్న సమాచారం మార్పు మాత్రమే. అంటే AWB ద్వారా చేర్చిన సమాచారాన్ని మండలాలకునుగుణంగా మానవీయంగా మార్పులుచేర్పులు చేస్తూ ఒకేలా కనిపించకుండా చేయడం అనే ఉద్దేశ్యంతో రాసిన సమాచారాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవడంతో చర్చను లాగుతున్నారని భావిస్తున్నాను. ఏకరూపతో ఉన్న సమాచారాన్ని తొలగించడం అంటే చేర్చిన సమాచారాన్ని పూర్తిగా తుడిచివేయడం కాదు. ఉన్న సమాచారాన్ని మార్పులు చేర్పులకనుగుణంగా అభివృద్ధి చేయడం. ఇచ్చిన వివరణలో వైరుధ్యమేమీ లేదు కాకుంటే అర్థం చేసుకోవడంలోనే తేడా ఉంటోంది. "ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో చేర్చాను" అని కూడా అప్పుడే చెప్పాను. తర్వాతి కాలంలో కొందరి పొరపాట్లు తీసినందుకు కక్ష్యతో ఇంతగా లాగుతారని మాత్రం ఊహించకపోయాను. అదే నా పొరపాటు.
  • ఇదే కాదు తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించిన మరికొన్ని పెద్ద పనులు కూడా అర్థాంతరంగా ఆగిపోయాయి. ఉదా:కు ప్రతి గ్రామలో స్వయంగా రూపొందించిన పటాలు పెట్టాలనే ఆలోచన కొన్ని మండలాలకే పరిమితమైంది. (పటానికి ఉదా:నవాల్గ గ్రామవ్యాసం చూడండి).
  • అసలు తొలగించాల్సిన సమాచారం ఎవరైనా ఎందుకు చేరుస్తారు? అలాఅని అర్థం ఎందుకు చేసుకుంటారు? సూటిగా సమాధానం చెప్పకుండా దాటివేశారనేది కూడా నిజం కాదు, నా వివరణ ఇచ్చాను, అర్థం చేసుకున్నారనుకున్నాను. అసలు కారణం ఇప్పుడే తెలుస్తుంది! ఆ తర్వాత నేను చురుగ్గా ఏమీ లేను. కేవలం ప్రధాన చర్చలలో తప్ప వ్యాసం దిద్దుబాట్లలో పెద్దగా దిద్దుబాట్లు చేయడమే లేను. 2016లో కొత్త జిల్లాల అవతరణ అనంతరం జిల్లా వ్యాసాలు సృష్టించడం అదివరకున్న మండలాలలో వర్గాలు, మూసలలో జిల్లాల పేర్లు మార్చడం పని మాత్రం చేశాను. 2019లో గ్రామాల పేర్ల సవరణ ప్రాజెక్టు పనిలో కొంతకాలం పనిచేశాను.
  • తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించి, తర్వాత సెలవులోకి వెళ్ళడం, ఆ తర్వాత కూడా చురుకుగా లేకపోవడం, వ్యాస దిద్దుబాట్లలో ఎక్కువగా పాల్గొనకపోవుట తదితర కారణాలతో అలాగే మిగిలియున్న సమాచారాన్ని ఐదేళ్ల నుంచి చురుకుగా ఉన్న పవన్ పట్టించుకోకపోవడం, పొరపాట్లను తీసిన పిదప మాత్రమే ఈ విషయంపై రచ్చ చేయడం సభ్యులకు విదితమే. మరి ఆ సమాచారం తప్పు అనుకుంటున్నవారు ఐదేళ్ళ నుంచి ఎందుకు చెప్పలేరు? అప్పట్లో చురుకుగా ఉన్న పవన్ ఎందుకు పట్టించుకోలేరు? అలాచూస్తే దానికి పవన్ కూడా బాధ్యత వహించాలి. అప్పుడు కనిపించని పొరపాటు (?) ఇప్పుడెలా కనిపించింది? నేను పొరపాట్లు తీసేవరకు ఈ సంగతి ఎందుకు బయటపెట్టలేరు. సదరు సభ్యులకు నా నుంచి మద్దతు లభించకపోవడమే అసలు కారణంగా తెలుస్తోంది. కాని పొరపాట్లు చేసేవారికి నా మద్దతు ఉండదని సభ్యులకు తెలుసు.
  • ఆ సమాచారం చేర్చడం వల్ల నాకు లభించిందేమిటి? అందులో స్వార్థం ఏముంది? ప్రయోజనం ఏమిటి? ఆ సమాచారం వల్ల నేను ఎలా లాభపడ్డాను? ఆ సమాచారం చేర్చడంలో స్వార్థప్రయోజనాలున్నాయనే వారు దాన్ని నిరూపించాలి.
  • గంపగుత్త సమాచారం అంటే అది AWB ద్వారా చేర్చినది. అన్ని మండలాలలో ఆ విభాగం మరియు కొంత సమాచారం చేర్చాలనే AWB ఉపయోగించాను. అప్పట్లో పలునిర్వాహకులు కూడా చురుకుగా ఉన్నారు కాని ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేవు. ఇప్పటికీ కొందరు నిర్వాహకులు అర్థం చేసుకుంటున్నారు.
  • నేను ఆ పనిని ఇతర సభ్యుల పట్టింపులకు వ్యతిరేకంగా లేదా వద్దన్నా బలవంతంగా చేసినది ఏమీకాదు. ఆగిపోయిన పని వల్ల చేర్చిన సమాచారం కూడా తొలగింపుకు ఏ మాత్రం పట్టుబడలేను. అలాంటప్పుడు ఎన్నిసార్లు చెప్పిననూ పట్టించుకోకుండా దిద్దుబాట్లు చేసే సభ్యులతో నన్ను పోల్చే అవసరం లేదు. తొలగింపుకు వ్యతిరేకత చూపనప్పుడు విజ్ఞతతో ఆలోచిస్తే అసలు చర్చను తీసే అవసరం కూడా ఉండరాదని ఇదివరకే చెప్పాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:05, 6 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

బావుంది సారూ. మీరు ఓ పొరబాటు వేలాది వ్యాసాల్లో చేసేసేసి, ఆ పొరబాటును ఒక నిర్వాహకుడు కొన్నేళ్ళ తర్వాత ఎత్తి చూపితే అప్పట్లో ఒక ఉద్దేశంతో చేశానని తొలగిద్దామనే అనుకున్నానని దాటవేసి, ఇప్పుడు ఆ మాట మళ్ళీ తీస్తే ఓ మహా బృహత్ ప్రణాళికలో భాగంగా చేసేసేశాను (అంత బృహత్ ప్రణాళిక ఉంటే ఎక్కడైనా కనీసంగా ప్రస్తావించారా? ఏవండోయ్ అర్జున రావుగారూ ఇదేనా మీరు ఎప్పుడూ మద్దతిచ్చే వ్యక్తి చేసే డాక్యుమెంటేషన్? దీనిపై మీ ఉద్దేశమేమిటి?) తర్వాతి వాళ్ళు తీసేసేసేసి ఉండాల్సింది, కావున తప్పంతా ఒక రకంగా, చుట్టు చుట్టూ తిప్పి పవన్‌ మీదే పెడతాను. - ఇదే కదండీ మీ వివరణ. ఈ లావు చర్చలో ఇక ఏం చేసుకుంటావో చేసుకోవయ్యా పవనూ అని అనడం ఒక్కటే తక్కువ. మరోమారు చెప్తాను చూడండి. మీరు ఏదో మనసులో పెట్టుకుని కొన్ని వేల మార్పులు చేయవచ్చు, ఆ మనసులో ఏం పెట్టుకున్నారన్నదానిపై ఎక్కడా డాక్యుమెంటేషన్ ఉండనక్కరలేదు (మాలాంటి అర్భకులు చేస్తే డాక్యుమెంటేషన్ తప్పనిసరి), ఆనక వచ్చి మీరందరూ ఇన్నాళ్ళూ ఎందుకు తొలగించలేదూ అని కూడా అడగవచ్చు, పైపెచ్చు తొలగింపుకు అడ్డుపడకపోవడం ఒక్కటీ మీ ఘనకార్యం. మీ తప్పును మీకు తెలియజెప్పడం, అది తప్పు అని ఒప్పించడం వల్ల ఎదుటివారు విజ్ఞత లేనివారు అగుదురు. అంతే కదా. --పవన్ సంతోష్ (చర్చ) 08:16, 7 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]


చంద్రకాంతరావు గారూ నేనే మీరైతే - వేలాది వ్యాసాల్లో ఇలాటి సమాచారాన్ని ఏడబ్ల్యుబి వాడి, యాంత్రికంగా మూలాలు లేకుండా చేర్చే ముందు, అంటే 2015లోనే:

  • సముదాయానికి తెలియపరిచి, చర్చించి, అవసరమైతే ఉపపత్తులూ, మూలాలు చూపించి, ఒప్పించి, ముందుకు వెళ్ళేవాడిని.
  • ఆ కృషికి గాను ఓ ప్రాజెక్టు పేజీ పెట్టి ఇతర సభ్యులను కూడా ఆసక్తి ఉంటే పాల్గొనమని ఆహ్వానించేవాడిని.
  • కనీసం చేసేసిన తర్వాతైనా సముదాయంలో ఇన్ని వేల పేజీల్లో చేసిన మార్పు గురించి చెప్పకుండా ఉండేవాడిని కాదు.
  • ఇవన్నీ ఖర్మం చాలక చేయకపోయి ఉంటే, ఎవరైనా తప్పు పడితే, బహిరంగంగా ఒప్పుకోవడానికి మరోసారి చేయనని చెప్పడానికి కప్పదాట్లు వేసేవాడిని కాదు.

ఒక్క వ్యాసంలో ఒక్క మూలం గురించి ఇంత ఓపికగా, ఇన్ని ఆధారాలు ఇచ్చి చర్చిస్తూ, మధ్యలో సభ్యులు ఒక వాక్యానికి ఆధారం లేదంటే స్వయంగా తొలగించిన నాకు, అన్ని వేల వ్యాసాల్లో ఎక్కడా మూలం ఇవ్వకుండా పొరబాటును ఎదుటివారి మీదకు ఎలా నెడదామా అని చూస్తున్న మీకూ చాలా చాలా తేడా ఉంది. ఇదీ పద్ధతి అనుసరించడమంటే. ఇకనైనా తెలుసుకుంటే మంచిది. --పవన్ సంతోష్ (చర్చ) 08:23, 7 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపుకు అడ్డుపడకపోవడం ఒక్కటీ మీ ఘనకార్యం అన్నారు కదా! అవును అదే అసలు పాయింటు కావాలి మరి. చర్చ హుందాతనంతో మరియు విజ్ఞతతో చేయాలంటే అలాంటి అంశాలే ముఖ్యమని వేరే చెప్పనక్కర్లేదు. ఐదేళ్ళ క్రిందట చేసిన మార్పులు, ఆ తర్వాత చురుకుగా లేకపోవుటచే ఆగిపోయిన ఆ సమాచారం తొలగించుటకు వ్యతిరేకించనప్పుడు (ఆ మధ్యకాలంలో ఆ సమాచారంపై నేను ఎలాంటి ప్రయోజనం కూడా పొందనప్పుడు) అసలు చర్చే జరిగే అవకాశం ఉండరాదని పదేపదే చెప్పే నా వ్యాఖ్యలు అర్థం చేసుకోవడం లేదు. పోనీ ఈ ఐదేళ్ల కాలంలో నేనేమైనా ఆ సమాచార వల్ల లాభం పొందానా? నాకేమైనా ప్రయోజనం కలిగిందా? స్వార్థప్రయోజనాలకని చెప్పిన చదువరి గారు దాన్ని నిరూపించాలి. ఈ సమాచారం బయట పడ్డాక నేను తొలగించమన్నాక కూడా మీ ఇద్దరిలో ఎవరూ ఏమీ వ్యాఖ్యానించలేరు. ఆ తర్వాత ప్రతీ చర్చలో దీన్ని లాగి చర్చను డైవర్ట్ చేసే అవసరం లేదు కాని ఈ చర్చ ఇక్కడే ముగియాలి. దీనికి సమాధానాలు చెప్పండి ...
1) ఈ సమాచారం స్వార్థప్రయోజనాలకోసం అన్నారు. ఏమిటీ స్వార్థప్రయోజనం? ఎలా చెప్పారు? ఎందుకు చెప్పారు? ఏమిటీ ఆధారం? ఆ సమాచారం వల్ల నేను ఏ విధంగా లాభం పొందాను? ఏమి లబ్ది పొందాను? ఇందులో నా స్వార్థప్రయోజనం ఉన్నట్లుగా సరైన కారణంతో నిరూపించండి.
2) రచ్చబండలో నేను పొరపాట్లు తీసిన తర్వాతే దీనిపై చర్చలలో ఈ విషయంపై రచ్చరచ్చ చేస్తూ చర్చను డైవర్ట్ చేయడానికి దీన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటున్నారు. లావు చేయడానికి అసలిందులో ఏముంది? అసలు ఎవరు ప్రయోజనం పొందుతున్నారో తేలికగానే చూడవచ్చు. సమాచారం తొలగించమన్నాక కూడా రచ్చరచ్చ చేసే అవసరం దేనికి?
3) వెనక్కి వెళ్ళను కాని ఇటీవల అర్జునగారు బయటపెట్టిన యర్రాగారి వేలాది వ్యాసాలలో లింకులపై ఎందుకు చెప్పట్లేదు? ఆయన స్వంత సైటుకు ఇచ్చిన వేలాది లింకులు బయటపడ్డాక కూడా ఎందుకు మీ మౌనం? యర్రాగారు తొలగించవచ్చని చెప్పారు కాబట్టి విజ్ఞతతో ఆలోచించి నేను చెప్పట్లేదు. మీరు ఈ విషయంలో విజ్ఞతతో ఆలోచించనప్పుడు రామారావు గారికి కూడా ఖచ్చితంగా చెప్పాల్సింది. ఎందుకు చెప్పట్లేదు? (వివక్ష ప్రదర్శిస్తున్నారని చెప్పడమే తప్ప చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి) పైగా ఒకానొక దశలో (నేను ఆ చర్చలో పాల్గొనే వరకు) ఒకరు మద్దతు కూడా పలికారు. ఇక్కడ వ్యవస్థే ప్రధానం కాని సభ్యులు కాదు కదా! కొందరిపై వివక్ష ప్రదర్శించడానికి సమాధానం ఇవ్వండి.
4) పొరపాట్లు (?) తీయాలన్ననూ ఇటీవలి పొరపాట్లే తీయాలి కాని ఎప్పుడో పాతకాలం నాటి పొరపాట్లు తీయాలంటే నాకూ బోలెడు దొరుకుతాయి. మరి అవన్నీ తీసి రచ్చరచ్చ చేద్దామా? ఇది సరైనదేనా? నేను ఇటీవలి పొరపాట్లు తీసేవరకు దీనిపై చర్చ ఎందుకు ప్రారంభం కాలేదు?
5) అది పొరపాటు అయితే ఒప్పుకోడానికి నాకెలాంటి అభ్యంతరం ఉండేదికాదు కాని ఒక సదుద్దేశ్యంతో, తెలంగాణ మండల వ్యాసాల అభివృద్ధిలో భాగంగా ప్రారంభించిన పని పూర్తికానప్పుడు, దాన్ని తొలగించాలని చెప్పాక కూడా అది మీకెందుకు అభ్యంతరం? పోనీ ఈ కాలంలో ఈ సమాచారంపై నేను ఏ రకమైన ప్రయోజనం పొందానా? అలా పొందిఉంటే చూపించండి. సమాచారం తొలగించడానికి అభ్యంతరపర్చనప్పుడు మళ్ళీ మళ్ళీ బలవంతం చేసే పని ఏముంది? చర్చను ఇంతగా లాగే అవసరం ఏముంది?
6) మాలాంటి అర్భకులు చేస్తే డాక్యుమెంటేషన్ తప్పనిసరి అంటున్నారు దానికి ఆధారం చూపించండి. తొలగించండి అనిగాని, తప్పు జరిగింది అని కాని, క్షమించండి అని గాని అన్నప్పుడు చర్చ అంతటికే ముగుస్తుంది, ముగించాలి కూడా. ఇక్కడ మాత్రం ఉల్టా చర్చ జరుగుతోంది. కారణమేంటి?
చర్చ అనేది ఇంటర్వ్యూ మాదిరిగా కాకుండా ఇరువైపుల నుంచి సమాధానాలు రావాలని నేనెప్పటినుంచో చెప్తున్నాను. నేనడిగిన వాటికి కూడా సూటిగా, చర్చను డైవర్ట్ చేయకుండా హుందాతనంతో సమాధానాలు రావాలని కోరుతున్నాను. చర్చ ఎంతవరకైనా సాగనీ కాని ఇక్కడే అంతం కావాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:45, 8 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
//తప్పు జరిగింది అని కాని, క్షమించండి అని గాని అన్నప్పుడు చర్చ అంతటికే ముగుస్తుంది// తప్పు అని మీరు ఇంతకుముందు ఎక్కడ అన్నారో లింకు తెచ్చి చూపించండి. పైన కూడా నేనదే అడిగాను సింపుల్‌గా తప్పా ఒప్పా అని. తప్పు అని మీరు ఒప్పుకున్నాకా మేం చర్చ తీయలేదు. మీరు ఒప్పుకుంటే గొడవే లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 03:55, 9 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ చర్చ ముగింపు దశలో ఉన్న సారాంశం, తెలంగాణలోని మండలాలలో గంపగుత్తగా ఒకే సమాచారం చంద్రకాంతరావు

గారు చేర్చటం తప్పా, ఒప్పా అని పవన్ సంతోష్ గారు, చంద్రకాంతరావు గారిని అడిగారు.దానికి చంద్రకాంతరావు గారు సూటిగా సమాధానం చెప్పాలి. అంతేగానీ ఇక్కడ సంబంధంలేని విషయం “ యర్రాగారి వేలాది వ్యాసాలలో లింకులపై ఎందుకు చెప్పట్లేదు? ఆయన స్వంత సైటుకు ఇచ్చిన వేలాది లింకులు బయటపడ్డాక కూడా ఎందుకు మీ మౌనం? “ అని చర్చను పక్కదారి పట్టించటం ఎంతమాత్రం సమంజసంగాలేదు.అది జరిగి సుమారు మూడు సంవత్సరాల అయింది. దాని మీద సరైన వివరణ హందాగా ఇచ్చాను. దానిని పదేపదే ప్రస్తావించటం అంత విజ్ఞత కాదు.

నన్ను ప్రస్తావించారు కాబట్టి నా అభిప్రాయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది.

1. నేను సకలజనులసమ్మె విషయం ప్రస్తావనకు రచ్చబండలో “ మన గౌరవ వికీపీడియన్స్ ఎవరు కూర్పుచేసారో ప్రస్తుతం అప్రస్తుతం.అయినా నాకు తెలియదు, అంతలోతుకుకూడా పోదల్చుకోలేదు” అని ప్రవేశపెట్టాను.(66 చర్చాపేజీ)

  • అంతలోతుకు పోయి పేరు ప్రస్తావించలేదు. ఇక్కడ నేను విజ్ఞతతో ప్రవర్తించాను

2. వాస్తవానికి ఇది తెలంగాణ ఉద్యమానికి సంభందించిన విషయం.పోనీ ఈ విషయం తెలంగాణ ఉద్యమం వ్యాసంలో ఉందా లేదా అని నేను పరిశీలించగా, లేకపోతే అక్కడ "సకలజనుల సమ్మె" అని విభాగం పెట్టి తగిన మార్పులుతో సవరించాను. (66 చర్చా పేజీ)

  • నా కెందుకులే అని వదిలివేయలేదు.

ఇక చంద్రకాంతరావు గారి విభిన్న అభిప్రాయాలు చూడండి

4. " సుమారు 4 సం.ల క్రితం నేనే AWB ఖాతా ద్వారా ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో చేర్చాను. ఒకే సమాచారం అన్ని మండలాలలో చేర్చడం అనేది పూర్తిగా సాధారణ సమాచారం క్రిందికే వస్తుంది. కాని అప్పటి పరిస్థితుల దృష్ట్యా వెంటనే తొలగించాలని చేర్చిన సమాచారం ఇప్పటివరకు కూడా కొనసాగడం బాధాకరమే ". (66 చర్చా పేజీలో చంద్రకాంతరావు గారి అభిప్రాయం)

  • ఎవరమైనా వికీపీడియాలో సమాచారం ఉండాలని చేరుస్తారు.తొలగించాలనే ఉద్ధేశ్వంతో సమాచారం చేరుస్తున్నామంటే మనం తప్పు చేస్తున్నట్లే లెక్క.

5. " తెలంగాణ మండల వ్యాసాలలో సమ్మె విభాగాన్ని పరిపూర్ణం చేయాలనే ప్రత్యేక ఉద్దేశ్యంతో అన్ని మండలాలకు చెందిన మూలాలు కూడా సేకరించాను.ఆ తర్వాత ఆ పని జరగలేదనుకోండి. తర్వాత దాన్ని మర్చిపోయాం." (73 వ చర్చా పేజీలో చంద్రకాంతరావు గారి అభిప్రాయం)

  • ఇది ఇంకోరకమైన అభిప్రాయం.

6.తరువాత ప్రస్తుత చర్చలో " అకస్మాత్తుగా సెలవులో ఉండిపోవుటచే చాలాకాలం, తర్వాత ఆ సమాచారం అలాగే ఉండిపోయింది. జిల్లా ఎడిషన్ల పేపర్ క్లిప్పింపులు అప్పట్లో నా వద్ద ఉన్నాయి. మిగతా 6 జిల్లాల సమ్మె వివరాలు అంతర్జాలం ద్వారా సేకరించాను. వీటి ఆధారంగా ఆయా మండలాలలో సమ్మె వివరాలు చేర్చాలనీ, ఒక్కో మండలంలో జరిగిన సమ్మె ప్రత్యేకతలు, సంఘటనలు మండల వ్యాసాలలో చేర్చి మూలాలతో పరిపూర్ణం చేయాలనీ తలంచి ముందుగా AWB ద్వారా విభాగాన్ని మరియు 2 వాక్యాల సమాచారాన్ని చేర్చాను " అని చెప్పారు.

  • ఇది అవసరానికి తగ్గ అభిప్రాయంలాగా ఉంది.

వీటిమీద నేను వివరణ అడగటలేదు.నేను ఈచర్చలో ఇంతవరకు పాల్గొనలేదు.పదే పదే నా పేరును చంద్రకాంతరావు గారు ప్రస్తావిస్తూ ఉంటే ఈ అబిప్రాయాలు చెప్పాల్సి వచ్చింది. ఇకనైనా పవన్ సంతోష్ గారు అడిగినదానికి, చర్చను మరలా పొడిగించకుండా సూటిగా సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:27, 9 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్, నేను చెప్పిన వ్యాఖ్యలను మీరు పూర్తిగా కాకుండా కొంతభాగమే పట్టుకొని వాదిస్తారని పలు సార్లు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు "తొలగించండి అనిగాని, .." ప్రారంభాన్నే వదిలివేశారు. యర్రాగారు మీరూ పూర్తిగా అర్థంచేసుకోలేకపోయారు. నా సమాధానం పూర్తిగా ఉంది. 5వ పాయింటు చదవండి. నా ప్రశ్నలకే సమాధానాలు రావడంలేదు. ఇక్కడ మీపెరెందుకు ప్రస్తావించవల్సి వచ్చిందో పూర్తిగా 3వ పాయింటు చదవండి. అసంపూర్తి వాక్యాలను మళ్ళీ నాకు ఉటంకించే అవసరం లేదు.   సి. చంద్ర కాంత రావు- చర్చ 20:26, 11 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నావైపు నుంచి చర్చను ఇప్పటికి ముగించదలిచాను.
  • మొదటగా - చంద్రకాంత రావు గారికి చెప్పేదేమంటే - మీరు వందలాది వ్యాసాల్లో చేర్చిన ఆ సాధారణ సమాచారం పొరబాటు. అది ఎందుకు చేర్చారో అప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత అడిగితే తీసేద్దామని చేర్చానన్నారు. ఇప్పుడు డబాయిస్తున్నారు. అది ముమ్మాటికీ తప్పే. మీరు ఒప్పుకుని మీ స్టాండ్ దిద్దుకోక పోతే వికీ ప్రపంచంలో ఆ పొరబాటు మిమ్మల్ని విడిచిపెట్టదు.
  • మీరు తప్పు చేసి, దాన్ని మేం తొలగించకపోవడం మా తప్పు అన్నట్టు మాట్లాడడం చాలా నిర్లక్ష్యపూరితమైన ధోరణి. అస్సలు బాగాలేదు.
  • ఈ చర్చలో మొత్తంగా నేను గ్రహించిందేమంటే అర్జున రావు గారూ, చంద్రకాంతరావు గారూ ఉద్దేశపూర్వకంగా మిగిలినవారందరి పనిలోనూ లేని తప్పులు కూడా వెతుకుతారు. ఒకరినొకరు కాచుకుంటూ ఇతరులపై దాడిలానే చేస్తారు. చంద్రకాంతరావు గారి తప్పులను అర్జున గారు, అర్జున గారు అన్నవాటిలో పొరబాట్లేమైనా ఉంటే చంద్రకాంత రావుగారూ మాత్రం కనీసం మృదువుగా కూడా ఎత్తిచూపరు. ఇదొక ధోరణిలా తయారైంది.
  • చివరగా - నామీద మీరెంత దాడి చేసినా, లక్ష్యం చేసుకున్నా, నన్నూ, నా కృషినీ తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేసినా - తెలుగు వికీపీడియాలో పనిచేయడంపై ఉత్సాహం కోల్పోయే ప్రసక్తి లేదు. నేనేమీ కొత్త వాడుకరిని కాదు విసిగింపులకు, వేధింపులకు జడిసి వెళ్ళిపోవడానికి. నేను తెలుగు వికీపీడియాకు భగవంతుడు నాకు శక్తినిచ్చిన మేరకు మరింత మెరుగైన వ్యాసాలు, మరింత ప్రయోజనకరమైన ప్రణాళికలతో నేను చేసే కృషి సాగిస్తూనే ఉంటాను. మీరు మీ బలం కొద్దీ పరీక్షించుకోవచ్చు.
ఇప్పటికి ఇక్కడ నా వైపు నుంచి ముగిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:37, 12 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ బలవంతం చేయడం, భయపెట్టించడం చాలా పొరపాటు. చర్చ చర్చలాగానే సాగాలి. పొరపాటు చేయనప్పుడు ఒప్పుకొనే ప్రశక్తి లేనేలేదు. నిజంగా పొరపాటు ఉంటే అప్పుడు చురుకైన వాళ్ళు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు తొలగించాలని చెప్పిన తర్వాత కూడా పొరపాటు అని చెప్పడం ఏ మాత్రం సరైనది కాదు. ఆ సమాచారం వల్ల నేను ఏమైనా ప్రయోజనం పొందానా అంటే అదీ లేదు. నేను అడిగినవాటికి ఎలాంటి సమాధానాలు రావడం లేదు. ఈ చర్చ యొక్క ఉద్దేశ్యం సభ్యులకు తెలుసు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:07, 15 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]