చర్చ:విజయవాడ
లెనిన్ విగ్రహము
[మార్చు]ఈ వ్యాసములో లెనిను గారి విగ్రమును ఉంచుటలోని ఔచిత్యము నాకు అర్థము కాలేదు
దాని బదులుగా ఏదైనా రైల్వే స్టేషనో, బస్ స్టేషనో, ప్రఖ్యాత వీధి బొమ్మనో ఉంచినచో సబబుగా ఉండును కదా,
లేక లెనిను గారికీ, లేదా లెనిను గారి విగ్రహానికీ విజయవాడకు ఏదయినా ప్రముఖ సంబధము ఉన్నచో తెలుప గలరు!
ఈ బొమ్మ మనము లెనిన్ వ్యాసములో ఉంచుట సబబుగా ఉండును అని నా మతము ! Chavakiran 12:27, 26 డిసెంబర్ 2005 (UTC)
- ఆ విగ్రహము వలన విజయవాడలోని లెనిను సెంటరుకు ఆ పేరు వచ్చిన్నది. కాకపోతే ఆ విగ్రహము గురించి మరియూ విజయవాడలో కమ్యూనిస్టుల ప్రభావం గురించీ ఈ వ్యాసంలో పెద్దగా చెప్పకపోవటం వలన ఆ బొమ్మను ఇక్కడ ఉంచటం ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతానికయితే ఆ బొమ్మను ఇక్కడ ఉంచనవసరంలేదు అని నా అభిప్రాయం కూడా. కాకపోతే ఇంతకు ముందు మార్పుచేసినవారు ఆ బొమ్మను ఇక్కడ పెట్టారు. వాళ్ళుమరలా ఈ వ్యాసమును కొనసాగించవచునేమో. కావాలంటే రెండుచోట్లా అదే ఫొటోను పెడదాము. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 03:59, 27 డిసెంబర్ 2005 (UTC)
- నా ఉద్దేశ్యములో కూడ లెనిన్ విగ్రహం బొమ్మ విజయవాడ వ్యాసంలో దాని గురించి వ్యాసభాగంలో ఏమీ లేకుండా ఉంచటం సబబు అనిపించటంలేదు. వ్యాసంలో కమ్యూనిస్ట్ కేద్రంగా విజయవాడ అన్నపేరా వ్రసినట్లయితే ఆ పేరాపక్క ఈ బొమ్మ సముచితం.ఇంకా మార్క్స్-ఎంజెల్స్‌లకు కూడ ఇద్దరికీ కలిపి ఒక విగ్రహం ఉన్నది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అయిన తరువాత మొదటి మేయర్ శ్రీ వెంకటేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవాడు. కమ్యూనిస్ట్‌లు కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్నప్పుడు, వారి హయాంలో ఈ విగ్రహలు పెట్టబడినవి. ప్రపంచం మొత్తం మీద ఇంకా మిగిలి ఉన్న లెనిన్, మార్క్స్-ఏంజల్స్ ల విగ్రహలుగా కూడ వీటిని ఉదహరించవచ్చు.--SIVA 00:55, 27 డిసెంబర్ 2008 (UTC)
- అలా కాకపోయినా స్థలపరంగా చూసుకొన్నా ఇప్పటికీ లెనిన్ సెంటర్ చాలా ప్రధాన ప్రాంతమే కదా విజయవాడలో. పూర్వపు కమ్యూనిస్టు ప్రభావానికి ప్రతీక - లెనిన్ సెంటర్లో ఉన్న లెనిన్ విగ్రహం అని ఆ బొమ్మ క్రింద వ్రాయవచ్చు --వైజాసత్య 08:15, 27 డిసెంబర్ 2008 (UTC)
ఆంధ్ర రాష్ట్ర రవాణా రాజధాని
[మార్చు]ఉభయ కమ్యూనిష్టు పార్టీలు గతంలో ఉద్యమాలు చేసిన కొన్నిడిమాండ్లు:
- .విజయవాడ-తాడేపల్లి మధ్య కృష్ణా నదిపై ఉన్న పాత రైలు బ్రిడ్జిని సైకిళ్ళు పాదచారుల కోసం రోడ్డుగా మలచాలి.
- .ప్రకాశం బ్యారేజి నుండి లీక్ అయ్యే నీరు కనకదుర్గ వారధి వరకు నిలకట్టాలి.
- .ప్రకాశం బ్యారేజిపై నుండి ఆర్టీసీ మినీ బస్సులు నడిపించాలి.
- .కనకదుర్గ వారధి నుండి ప్రకాశం బ్యారేజివరకు కృష్ణానది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి.
- .విజయవాడ ,కృష్ణాకెనాల్ జంక్షన్( తాడేపల్లి )ని కలిపి జంట నగరాలుగా అభివృద్ధి చెయ్యాలి.--Nrahamthulla 17:36, 7 డిసెంబర్ 2009 (UTC)
ముఖ్యమంత్రికి యలమంచిలి రవి ప్రతిపాదనలు
[మార్చు]- .బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక్కడ ఫ్త్లెఓవర్‌ను ఏర్పాటు చేయాలి. ఫ్త్లెఓవర్‌ను బందరు రోడ్డులో కాకుండా జాతీయ రహదారిపై నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుంది.బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఫ్త్లె ఓవర్‌ను నిర్మించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ట్రాఫిక్ సమస్య తగ్గక పోగా, ఎన్టీఆర్ సర్కిల్, పంటకాల్వ రోడ్డు, పటమటలో ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది.
- కృష్ణానది దిగువన నీటి రెగ్యులేటర్‌ను నిర్మించాలి. వరదలు వచ్చినప్పుడు కృష్ణాబ్యారేజ్ నుంచి నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది, నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండడం లేదు.రెగ్యులేటర్‌ను నిర్మిస్తే దిగువన నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది, వ్యవసాయానికి నీటి సమస్య ఉండదు.
- కాల్వ గట్లను అభివృద్ధి చేసి రోడ్లు నిర్మిస్తే ట్రాఫిక్ నగరంలోకి రాకుండా ఊరిబయట నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.కృష్ణలంక జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ప్రజలు రోడ్డు దాటాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఫుట్‌బ్రిడ్జిలు నిర్మించినా ప్రయోజనం లేదు, జాతీయ రహదారి ఎత్తులో ఉండడం వల్ల, సర్వీసు రోడ్లు కిందకు ఉండడం వల్ల వంతెన ఎక్కి దిగడం కష్టమవుతుంది.అందుకని ఆరు చోట్ల సబ్‌వేలు నిర్మించాల్సిన అవసరం ఉంది. #రామలింగేశ్వరనగర్‌లోని మురుగునీటి శుద్ధి ప్లాంటు నుంచి విడుదలైన మురుగునీరు కృష్ణా నీళ్లలో కలసిపోతున్నాయి, దిగువ ప్రాంత ప్రజలు ఈ నీటిని తాగుతున్నారు.
- గొల్లపూడి నుంచి పెదఅవుటపల్లి వరకు రోడ్డును మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వం అభివృద్ధి చేయాలి, దీని వల్ల జాతీయ రహదారిపై వెళ్లే ట్రాఫిక్ నగరంలో రాకుండా ఉంటుంది.(ఈనాడు 17.2.2010) --Nrahamthulla 09:45, 17 ఫిబ్రవరి 2010 (UTC)
విజయవాడ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ అని ఉన్నది. కాని విజయవాడ భారత దేశంలొనే అతి పెద్ద రైల్వే కూడలి. ఈ క్రింది పేజీలని చూడండి. http://www.vijayawadaonline.com/train-timings/50-train-timings.html నేను http://www.cleartrip.com/trains లొ వెతకి చూసాను. Trains passing through station ద్వారా. విజయవాడ అందులో మొదటి స్తానం లో ఉన్నది. భారత దేశం లో ఉన్న ముఖ్య కూడళ్ళు అయినటువంటి భోపాల్, ఝాన్సీ, ఇటార్సీ, సట్నా లకు కూడా రోజూ ఇన్ని రైళ్ళు రావు.
మురళీ కృష్ణ. kanagalamurali
"విజయవాడ లోని కళాశాలలు" కూర్పుల చరితం
[మార్చు]"విజయవాడ లోని కళాశాలలు" వ్యాసంలోని కొద్ది విషయాన్ని ఈ వ్యాసంలో ఒక ఉపశీర్షికగా విలీనం చేసితిని.----కె.వెంకటరమణ (చర్చ) 15:59, 17 జనవరి 2014 (UTC)
- (ప్రస్తు • గత) 15:57, 17 జనవరి 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (225 బైట్లు) (+128) . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:57, 17 జనవరి 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (97 బైట్లు) (-1,461) . . (విజయవాడ వ్యాసంలో ఉపశీర్షికగా విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:54, 17 జనవరి 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (1,558 బైట్లు) (0) . . (Kvr.lohith విజయవాడ లొని కళాశాల లు పేజీని విజయవాడ లోని కళాశాలలుకి దారిమార్పు లేకుండా తరలించారు: శ...) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:06, 16 డిసెంబర్ 2013 అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,558 బైట్లు) (+45) . . ({{విలీనం|విజయవాడ}}) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 11:45, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,513 బైట్లు) (-8) . . (→విజయవాడ లోని హొటల్స్) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 11:45, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,521 బైట్లు) (+6) . . (→విజయవాడ లోని హొటల్స్) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 11:41, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,515 బైట్లు) (+89) . . (→విజయవాడ లోని హొటల్స్) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 11:27, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,426 బైట్లు) (+30) . . (→పాలా పధార్ధములు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 11:26, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,396 బైట్లు) (+115) . . (→విజయవాడ లోని హొటెల్స్) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 11:21, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,281 బైట్లు) (+83) . . (→పాలా పధార్ధములు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 11:17, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,198 బైట్లు) (+265) . . (→పాలా పధార్ధములు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 11:06, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (933 బైట్లు) (+302) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:53, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (631 బైట్లు) (+45) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:48, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (586 బైట్లు) (+199) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:38, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (387 బైట్లు) (+84) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:35, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (303 బైట్లు) (+31) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:20, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (272 బైట్లు) (+111) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:15, 16 డిసెంబర్ 2013 Bhavani65 (చర్చ • రచనలు • నిరోధించు) . . (161 బైట్లు) (+161) . . (కళాశాలలు) (కృతజ్ఞత తెలుపు)