చర్చ:విగ్రహారాధన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విగ్రహారాధన వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


విగ్రహారాధన వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


నిరాధార వాక్యం తొలిగించబడినది

[మార్చు]

హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు

పూర్వం అరేబియాలో హిందూ మతం ఉండేదనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. Even the proto Indo-Iranian religion (that was origin of hinduism and zoroastrianism) never extended up to Arabia. During the times of Muhammad, Mecca was abode of pagans (cult image worshipers) and Medina was abode of jews. Neither proto Indo-Iranian religion nor hinduism extended upto Arabia in history.

విగ్రహారాధన ను బహుదేవతారాధన ను ఖండిస్తూ అద్వితీయుడైన ఒకే దేవుడిని పూజించాలనే విశ్వాసం తో మొదలయిన మతాలన్నిటికి అబ్రాహాము (ఇబ్రాహీం ) మూలపురుషుడు. అంటే యూదులు , క్రైస్తవులు , ముస్లిములు అందరూ తమ విశ్వాసానికి ఆద్యుడు, పితరుడు అబ్రాహామేనని అంగీకరిస్తారు. ఆ అబ్రాహాము ఏ దేవుడిని ఆరాథించాడో ఆయనే మనందరి దేవుడు. ఆదాము, అవ్వలని ఏ దేవుడు తయారు చేశాడో ఆయనే మనందరి దేవుడు. ఆయన పేరు హెబ్రూ లో ' ఎలోహిమ్ ' అరమిక్ లో" ఎలాహా " , అరబిక్‌ లో "ఇలాహ్ లేదా అల్లాహ్ " .శిలువ మీద ఏసు ఏలోయి అని దేవుణ్ణి పిలుస్తాడు. 'హల్లెలూయా ' అని క్రైస్తవులు నేటికీ చేసే స్థోత్రంలో 'ఇలాహ్' ఉన్నాడు. 'యహ్‌వహ్ ' అనే హెబ్రూ పదం పలకలేక, వ్యర్థంగా ఆ పేరును ఉచ్చరించకూడదనే భయంతో 'ఎదొనాయ్ ' లోని అచ్చుల్ని "యహ్ వహ్" లోకలుపుకొని మనవాళ్ళు సృష్టించిన పేరే 'యెహోవా '. ఇక ఆ యెహోవా అల్లా ఒకరేనా అంటే ఒకరే అనే చెప్పాలి. దేవదానం గారిని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేవదానం అనే పిలవాలి. అమెరికా వాళ్ళు ఆయన్ని గిఫ్ట్ ఆఫ్ గాడ్ గా పేరు మార్చి పిలిస్తే తప్పేమీ లేదు గానీ ఆయన ఒక్కొక్క భాషలో ఒక్కోరకంగా పిలువబడతాడు.కాకపోతే ఆయన పేరు ఆయనకే అర్ధం కాక పిలిస్తే పలుకడు. దేవుడి పరిస్థితి కూడా ఈ రోజు అలాగే తయారయ్యింది.

విశ్వాసులకు తండ్రి ' అని బిరుదు పొందిన అబ్రాహామును బట్టి మనమంతా కలిసిపోవాలి. ఏసుక్రీస్తు , ముహమ్మదు , ఇద్దరూ ఆరాథించింది ఒక్క దేవుడినే. చిన్న చిన్న కారణాలతో ప్రత్యేక మతాలుగా ఉండాలనే కోరికతో విడిపోతున్నారే తప్ప ఆ ఆది దేవుని అంగీకరించి కలిసిపోయే ప్రయత్నాలు చేయటం లేదు. దేవుడు ఏకత్వమా, ద్విత్వమా, త్రిత్వమా అనే సిద్థాంత బేదాలతో క్రైస్తవం అనేక శాఖలుగా విడిపోయింది. యూదుల్లో 72 అపవిశ్వాసపు తెగలుంటే, ముస్లిములు 73 అపవిశ్వాసపు తెగలుగా చీలిపోతారని ముహమ్మదు ప్రవక్త గారే చెప్పారు. దర్గాలు , జెండాలు ,గ్యార్మీ లు, పీర్లు , మొహరం పండుగ లాంటివన్నీ ఇస్లాం చెప్పిన విశ్వాసాలు కాదుగదా? ఇవన్నీ సాయిబులు కల్పించుకోలేదా? కల్పనలవల్లనే మూల విశ్వాసం చీలిపోయింది.

యూదులకు ఒంటె తో పాటు పంది కూడా నిషిధ్ధమే.ముస్లిములకు పంది మాత్రమే నిషిద్థం.అది కూడా ప్రాణం నిలుపుకోవటానికి తినొచ్చు. క్రైస్తవులకు అపవిత్రజంతువు అనేదేదీ లేదు. మనస్సాక్షి నిమిత్తం విచారించకుండా కటిక వాడి అంగడి లో అమ్మేదేదైనా తినొచ్చు. ఇంతమందికి ఇన్ని రకాలుగా ఒకే దేవుడు చెబుతాడా అని సందేహించకుండా "మన అందరి దేవుడూ ఒక్కడే" అనే సందేశాన్ని బలపరిచే వివరాలను బయటికి తీసి ప్రచారం చెయ్యాలి. బ్రహ్మ మొక్కటే, పరబ్రహ్మ మొక్కటే అనే పాటలోని దేవుని ఏకత్వాన్ని మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే "శ్రీమంతుడును అద్వితీయుడైన ఆయన మాత్రమే దురవగాహమైన తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడై యున్నాడు" అని పౌలు చెబుతున్నాడు(1తిమోతీ 6:15,16)

నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నాడట. ఒక మతం వాళ్ళు మరో మతం గ్రంథాలను ఒకందుకు పరిశీలిస్తారు. ఏకత్వవాదులం, సమైక్యవాదులం, మానవతావాదులం,శాంతిప్రియులం అయిన మనకు వీళ్లందరూ చేసే పరిశీలనా గ్రంథాలు మరొకందుకు ఉపయోగపడతాయి. ఉత్తరోత్తరా ఈ పరిశీలనా గ్రంథాలే మనమంతా కలిసిపోటానికి మెట్లుగా ఉపయోగపడతాయనీ పరిశీలకులు ఆ దిశగా కృషి చెయ్యాలనీ ఆశిద్దాం. ఒక్కడైన ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం.

  • హిందూ మతంలో విగ్రహారాధన చాలా ఎక్కువగా కనిపిస్తుంది. .

Regards Praveen the Atheist

  • ప్రవీణ్ నాస్తిక్ గారూ

వికీ సొంత అభిప్రాయాలు రాసుకునే వేదిక కాదని అనేకసార్లు నాకు నిర్వాహకులు సలహా ఇచ్చారు.అందువలన హేతువాది నాస్తికులు వ్యాసాల్లో ప్రముఖులను చేర్చి వారిమాటలు రాయండి.--Nrahamthulla 13:52, 3 నవంబర్ 2008 (UTC)

"యూదా క్రైస్తవమతాలు విగ్రహారాధనకు వ్యతిరేకం" సెక్షన్ లో నేను వ్ర్రాసినవి సొంత అభిప్రాయాలు కావు. బైబిల్ పాత నిబంధనలు చదివితే తెలుస్తుంది మోషే విగ్రహారాధకులని ఎలా చిత్రహింసలు పెట్టి చంపాడో.

నాస్తిక ప్రవీణ్

ప్రవీణ్, మతాలను విమర్శించడానికి , స్వంత అభిప్రాయాలు వెల్లడించడానికి ఇది వేదిక కాదు. అలా అనుకుంటే ప్రతి మతంపై ఆధారాలతో సహా విమర్శలు చేయవచ్చు, గమనించండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:43, 3 నవంబర్ 2008 (UTC)
  • చంద్రకాంత్ గారూ , నిజమే ప్రతి మతాన్నీ విమర్శించవచ్చు. మనకు కావలసింది మానవత్వమే .నాస్తిక ప్రవీణ్ మాటల్లోని "విగ్రహారాధనని వ్యతిరేకిస్తే మొదట ప్రపంచములోని అత్యంత హాస్యాస్పద పాగన్ మతమైన హిందూ మతాన్ని విమర్శించాలి" అనేవి తీసేసిన మీరు మోషే విగ్రహారాధకులని చిత్రహింసలు పెట్టి చంపాడు అనే మాటలు కూడా తీసెయ్యాల్సింది.--Nrahamthulla 16:16, 3 నవంబర్ 2008 (UTC)
రహతుల్లా గారు, కులాల గురించి, మతాల గురించి విమర్శించే వాటికి నేను గట్టిగా వ్యతిరేకిస్తా. సున్నితమైన విషయాలపట్ల చాలా జాగ్రతగా ఉండాలి. వేలాది ప్రజలు చదివే విజ్ఞానసర్వస్వంలో వీటికి చోటు ఉండరాదు. కాబట్టే నేను హిందూమతంపై ఉన్న విమర్శను హైడ్ చేశాను. "మోషే..." మాటలు మతానికి విమర్శగా ఉంటే మీరు తొలిగించవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:36, 3 నవంబర్ 2008 (UTC)

ఇక్కడ నేను సొంత అభిప్రాయాలు రాయడం లేదు. I am using common sense and none other than it. Hindus believe 3 crores (30 millions) of deities. How much population did India had some thousands of years ago to be resort for so many deities? According to 1870 census, British India (that includes former territories i.e. Pakistan, Bangladesh and Burma) had 20 crores of population. It is not difficult to imagine that India's total population didn't exceed 3 crores some thousands of years back. Should we believe that 3 crores of deities existed in those days when there was no possibility for total population itself to exceed 3 crores? గుర్రాలు, గాడిదలు మీద తిరిగే రోజులనుంచి రాకెట్లు లాంచ్ చేసే రోజులకి వచ్చాము. ఇప్పుడు కూడా ఈ అజ్ఞానపు నమ్మకాలని చూసి నవ్వాలా? ఏడవాలా? మనం తిని తొంగుంటే సరిపోదు. మనలో మానసిక వికాసం కూడా పెంచుకోవాలి. దేవుడు, దెయ్యాలు లాంటి నమ్మకాలు మన కల్చర్ లో భాగం అంటూ ఇప్పుడు కూడా నాన్ సెన్స్ కొనసాగించడం ఎందుకు?

అయ్యా! మీ ఆలోచలు, అభిప్రాయాలు ఖచ్చితంగా నా అభిప్రాయాల్లానే ఉన్నాయి..కానీ వికీకి నా నమ్మకాలు, మీ నమ్మకాలు, నా అభిప్రాయాలు, మీ అభిప్రాయాలతో అవసరం లేదు. ఇందుకు ముందుకూడా చెప్పినట్టు ఎటువంటి నమ్మకాలను పొగడదు, తెగడదు. వికీ సంఘసంస్కరణా ఉద్యమం కూడా కాదు. ఇలాంటి ఉద్యమాలు ఎంత మంచివైనా, చెడ్డవైనా వాటికి తోడ్పటం వికీ లక్ష్యం కాదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రతిఫలించే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. చరిత్రంతా జరిగిపోయింది కదా అని తుడిచివెయ్యటం ఏ మాత్రం సమంజసం. --వైజాసత్య 06:03, 5 నవంబర్ 2008 (UTC)

మతాలపై విమర్శలు వద్దు

[మార్చు]

విగ్రహారాధన తప్పు.రాయి,చెట్టు దైవాలు కాదు.రాయి లో జీవం లేదు.జీవం కలిగిన యెసుని నమ్ముదాం. jesus is a real god. మతాలకు విరుద్ధంగా విమర్శలు, అభిప్రాయాలు చేయరాదని నేను ఇది వరకే తెలియజేశాను. మళ్ళీ చర్చ లాగడం బాగుండదు. ఇది చాలా సున్నితమైన వ్యవహారం అంతేకాకుండా మత నమ్మకాలనేవి వారి వారి వ్యక్తిగతమైనవి. నమ్మకాలను నమ్మే వారు నమ్ముతారు అంతే కాని నమ్మవద్దని ఒకరిమీద బలవంతం చేయరాదు. వికీపీడియా అనేది మన వ్యక్తిగత అభిప్రాయాలుతెలియజేయడానికి వేదిక అసలే కాదు. కేవలం తమ వాదనలను వినిపించడానికే వికీలో వ్యాసాలు వ్రాయడం తగదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:24, 4 నవంబర్ 2008 (UTC)


దయచేసి గమనించండి

(1) విగ్రహారాధన అనే ఈ వ్యాసం ఆంగ్ల వికీలో en:Cult image అనే వ్యాసం ఆధారంగా రూపొందినట్లుగా తెలుస్తున్నది. ఆ పేరే సరైన అనువాదం కాదు. విగ్రహారాధనకు సంబంధించి ఆంగ్ల వికీలో en:Idolatry అనే వ్యాసం ఉన్నది. దయచేసి పరిశీలించండి.

(2) ఈ చర్చలో వివాదం, అయోమయం పెరుగుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. చంద్రకాంత్ గారు చెప్పినవే అయినా మళ్ళీ స్పష్టత కోసం కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

  • వికీపీడియా ఒక Tertiary Reference source ( చూడండి en:Wikipedia:Reliable sources). అంటే ఇంతకుముందు ప్రచురించిన విషయాలు ఆధారంగానే ఇక్కడ వ్యాసాలు వ్రాయాలి. వ్రాసినదానికి తగు రిఫరెన్సులు చూపాలి. ఆ రిఫరెన్సులు కూడా "నిర్ధారింప దగినవి మరియు విశ్వసనీయమైనవి" అయి ఉండాలి. అంటే
    • scholarly, peer reviewd articles మాత్రమే ఆమోదింపదగిన రిఫరెన్సులుగా పరిగణింపబడుతాయి.
    • సభ్యులు తమ స్వంత అభిప్రాయాలనూ, ఋజువులనూ ఇక్కడ ఉంచ రాదు. అది నిస్సందేహంగా నిజమే అని వారు అనవచ్చును. కాని అది ఇంతకుముందు ప్రచురింపబడనిది కాకపోతే చెల్లదు. citation required, not proof.
    • ఒకవేళ మీరు వ్రాసే విషయం కొందరు విభేదించేలా ఉన్నాగాని తగిన ఆధారాలు, విశ్వసనీయత ఉంటే దానిని వ్రాయవచ్చును. అయితే భాష, భావం కూడా సార్వజనికమైనవిగానూ, విభేదాలను గౌరవించేలాగానూ, దూషణకు చోటివ్వకుండానూ ఉండాలి.
  • ఇప్పటికి వ్రాసిన చాలా వ్యాసాలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చును. కాని వ్రాసిన విషయం సున్నితమైనది, లేదా వివాదానికి చోటిచ్చేది అయినా, జీవించి ఉన్నవారి గురించి అయినా అయితే ఈ ప్రమాణాలు పాటించవలసిన అవుసరం పెరుగుతుంది.
  • "తటస్థ దృక్కోణం" గురించి చాలా సార్లు చెప్పబడింది. అంటే ఒక దృక్కోణం నుండి వ్యాసాన్ని వ్రాసినపుడు అందుకు భిన్నమైన అభిప్రాయాలను కూడా సమదృష్టితో ఉట్టంకించాలి.

ఇంత పకడ్బందీగా ఉండాలా? అవును. విషయం గాఢమైనది అయితే అందుకు ఆధారాలు కూడా గట్టిగానే ఉండాలి. సభ్యులు మరొక సంగతి గమనించాలి. వ్రాసే విషయం సముచిత ప్రమాణాలలో లేకపోతే ఆ వ్రాతకు విలువ ఉండదు. అనేకానేక బ్లాగులలాగా చెత్త వ్రాతగా పరిగణింపబడుతుంది. అది వివాదాస్పదం కూడా అయ్యేలా ఉంటే నిస్సందేహంగా తొలగింపబడుతుంది.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:51, 4 నవంబర్ 2008 (UTC)

  • చంద్రకాంత్,కాసుబాబు గార్లూ

ఈ బొమ్మలకొలుపు రచ్చ ముందు నాపంచలోనుండి ప్రధాన వీధి లోకి తీసుకొచ్చినందుకు థాంక్స్.--Nrahamthulla 16:06, 4 నవంబర్ 2008 (UTC)

వ్యాసం పరిధిలో లేనందువళ్ల తొలగించిన విషయం

[మార్చు]
ముహమ్మదు ప్రవక్త బొమ్మ విగ్రహం ఉండదెందుకు?

అల్లాహ్ కు సమానంగా ఇతరుల్ని జతచేసే ఏ ఆరాధనా మార్గాన్నయినా ఇస్లాం మూసివేస్తుంది.ఈ ( షిర్క్ ) లో ప్రతిమలు విగ్రహాలుంటాయి.కానీ వాటిని ఈస్లాం నిషేదించింది.విగ్రహాలను చేసే వాళ్ళను శపించింది.అబిసీనియా చర్చిలో ఇలాగే ప్రతిమలున్నట్లు వాటినిర్వాహకుల్ని ప్రవక్త శపించినట్లు ఆయెషా ఇలా చెప్పారు:

  • "వారిలో ఒక నీతిమంతుడు చనిపోతే వారు అతని సమాధి మీద అతని విగ్రహాన్నుంచి ప్రార్ధనాలయాన్ని నిర్మిస్తారు.వీళ్ళు అల్లా సృష్టిలో అత్యంత దుష్టులుగా పునరుత్థాన దినాన తేలిపోతారు".(బుఖారీ5:409).
  • ప్రవక్త ప్రయాణం చేసి వచ్చారు.నాగదితలుపుకు బొమ్మలున్న కర్టెన్ కట్టాను.అది చూసి ఆయన దాన్ని చింపేశారు."అల్లా సృష్టితాలను పోలిన వాటిని చేశె వాళ్ళే పునరుత్థాన దినాన అతి తీవ్ర శిక్షను పొందుతారు అన్నారు.కాబట్టి దాన్ని రెండు దిండులు గా మార్చుకున్నాము.(బుఖారీ:5:496).
  • పునరుత్థాన దినాన అతి తీవ్ర శిక్షను పొందేవాళ్ళు విగ్రహాలు చేశేవాళ్ళే.(బుఖారీ:5:494)
  • ఇక ప్రవక్త తనబొమ్మను ఎలా తయరుచేయనిస్తారు?అందుకే ఏశిష్యుడూ అందుకు దైర్యంచెయ్యలేదు.బొమ్మలు హరాం అనుకున్నారు.
  • లేఖనాలుగల ప్రజలారా(క్రైస్తవులు) మీమతంలో హద్దులు మీరకండి అని అల్లా హెచ్చరించాడు (ఖురాన్ 4:171)
  • ప్రవక్తకూడా తన పట్ల ఎవరూహద్దులు మీరకుండా హెచ్చరించాడు."మరియం కుమారుడైన ఈసా గురించి క్రైస్తవులు హద్దులు మీరినట్లు మీరు నాగురించి హద్దులు మీరకండి.నేను కేవలం బానిసను.అందుకనే నన్ను అల్లా దాసుడు సందేశకుడు అని పిలవండి.(బుఖారీ:3:189)
  • "మీరు మీ దేవతా విగ్రహాలు వద్ద్,సువా,యాగూత్,యావూక్,నస్ర్ లను వదలకూడదు అంటారు వాళ్ళు"(ఖురాన్ 71:23)
  • నోవహు కాలంలో నీతిమంతులైనవాళ్ళు చనిపోతే వాళ్ళు కూర్చున్న చోట రాతి బలిపీఠాలు కట్టమని,వారి పేర్లతో పిలవమనీ సైతాను ప్రజల్ని ప్రేరేపించేవాడు.వారు అలాగే పిలిచారు గానీ ఆరాధించలేదు.ఆ తరం గడిచాక జ్ఞానంకోల్పోయిన జనం నీతిమంతుల ఆరాధన ,సమాధుల దగ్గరకు పదేపదే వెళ్ళటం,వారి విగ్రహాలు పెట్టటం,కాలంగడిచేకొద్దీ వారినే పూజించటంమొదలుపెట్టారు.(కితాబుల్ తౌహీద్ 219)

అందుకే ఈ పద్ధతి షిర్క్ కు దారితీయకుండాప్రవక్త తన చిత్రాలను నిషేధించారు.నాతరువాత వచ్చే నా అనుచరులే నాకు అత్యంత ఇష్టులు.వారిలో ప్రతి ఒక్కరూ తమ యావదాస్థినీ ఖర్చుచేసైనాసరే నా రూపాన్నిచూడాలని తహతహ లాడుతారు.సైతానుమాత్రం నారూపాన్ని పొందలేడు అన్నారు ప్రవక్త.(ముస్లిం)