చర్చ:రావణుడు
స్వరూపం
వ్యాసం ఎత్తుగడ
[మార్చు]రామునకు రావణాసురుడు శత్రువు అని అనే కంటే రామాయణానికి ప్రధాన ప్రతి నాయకుడు అనడమే ఉత్తమము అని నాకు అనిపిస్తోంది. రావణాసురుడు రాముడితొ యుద్ధము చేసేటప్పుడు అలసిపోయి అస్త్రాలు స్పురణకు రాక పోతే రాముడు రావణాసురుడిని ఇంటికి పోమ్మంటే ఇంటికి వెళ్ళి తరువాత రోజు వస్తాడు, ఆ తరువాత రోజు యుద్ధములొ నిహతుడౌతాడు. రాముడికి శృత్వతము ఉంటే అప్పుడే చంపి ఉండేవాడు. రాముడు శరణాగత వత్సలుడు అందువలన అ వాక్యాన్ని మరిస్తే బాగుటుందని నా అభిప్రాయము--మాటలబాబు 23:10, 26 జూన్ 2007 (UTC)
- ఎవరు నామాట వినక పోవడం వల్ల నేనా మెదటి వాక్యాన్ని మార్చాను--మాటలబాబు 22:29, 6 ఆగష్టు 2007 (UTC)
- వికీపీడియాలో మీరు మొదట మార్చేసేయండి. ఆ తరువాత దానిని చర్చకు పెట్టండి. ఎవరికయినా అభ్యంతరాలుంటే చర్చిస్తారు. వికీపీడియాలో సాధారణంగా ఇలాగే చేయాలి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 22:37, 6 ఆగష్టు 2007 (UTC)
రావణుని వ్యక్తిత్వం గురించి
[మార్చు]02:54, 14 ఫిబ్రవరి 2008 సభ్యులు:Numbsyd వ్రాసిన విషయం. ఇది చర్చ:రావణుడు/వ్యాఖ్యానాలు అనే ఉప వ్యాసంలో వ్రాయబడింది. ఉప వ్యాసం అవుసరం లేదనిపించి ఆ చర్చను ఇక్కడికి మార్చి, ఉప వ్యాసాన్ని తొలగిస్తున్నాను. (--కాసుబాబు 09:03, 24 ఫిబ్రవరి 2008 (UTC))
- రావణబ్రహ్మ తాను జయించిన రాజ్యాల రాకుమరులను బలవంతంగా తెచ్చుకున్నాడని ఏ పురాణంలొ రాసుందొ చెప్పి ఆయన స్త్రిలొలత్వం గురించి శీర్షిక రాస్తే సబబుగా వుంటుందిగాని, ఇలా ఒకట్రెండు ఉదాహరణలు చూపించి పండితుడు, పరాక్రమవంతుడు, అపర శివ భక్తుడు అయిన దశకంఠుడ్ని కించపరచడం భావ్యంకాదు. సీత తన స్వయంవరంలొ శివధనుస్సు యెత్తబోయి కింద పడ్డ రావణున్ని చూసి నవ్వితే, ఆ ఉక్రొషం పట్టలేక సీతను యెత్తుకుపోయాడే కాని పేళ్ళయిన స్త్రిలను అవమానించాడని ఏ పురాణంలోను వ్రాయలేదు. రావణడు స్వతహాగా అహంకారి, ఆ అహంకారంతో మహాశక్తిసంపన్నులైన వాలి మరియు మైరావణడు తదితరులతో తలపడి వోడిపోయి సంధి చేసుకుని స్నేహితుడవుతాడు. బహుశా మీకు తెలుసోలేదో, రామరావణ యుద్ధం మొదలైన తరువాత మైరావణడు హనుమంతుని సంరక్షణ నుంచి రామలక్ష్మణులను తస్కరించి తీసుకుపోతాడు రావణుడి కోసం. అలాగే రావణడు నల్లటి అందవిహీనుడు కాదు, బ్రాహ్మణుడు ఎ సిద్దాంతం ప్రకారం నల్లగా వుంటాడో ఆయన చిత్రాలు వేసిన చిత్రకారులు మాత్రమే చెప్పాలి!. ఆయన ఎంతటి వీరుడంటే, ఆయన్ను భయంకరుడుగా చూపించటానికి ఆయన చిత్రాన్ని వికారంగా వేయటం తప్ప ఆయన వ్యక్తత్వంలో క్రూరత్వం చూపించలేనంత. రావణుడి గురించి రాసేముందు, ఆయన గురించి పరిశోధన చేయడం చాలా ముఖ్యం, యెందుకంటే రాముడు ఒక్కడే ఢీకొట్టి గెలవగల అశక్తుడు కాదు రావణుడు(వాల్మీకి రామాయణం చదవండి). వాల్మీకి రామాయణం అనువాదాలు అన్నీ రాముని భక్తులు తమ తమ భాషలలో అనువాదం చేసినవి, వాల్మీకి వలే నిస్పక్షపాతంగా చరిత్రవలే రాసినవి కాదు.