చర్చ:ముద్రగడ పద్మనాభం రెడ్డి
స్వరూపం
ఇది వికీపీడియా కాబట్టి వ్యక్తిగత పొగడ్తలు, విమర్శలు లేకుండా రాస్తే మంచిదని అనుకుంటున్నాను. దయచేసి సవరించగలరు. ఉదాహరణకు "ఆయన మరలా ఉద్యమమును భుజాలకు ఎత్తుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్న లెక్కచెయ్యని దీరత్వము కలవాడు" అని ఒకచోట, "పద్మనాభంలోని నిజాయితీ, మొండితనం, గమనించి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో (జీవో నం. 30) జారీ చేయించారు." అని ఒకచోట, ఇలా మొత్తం వ్యాసం అలానే ఉన్నది. —సంతకం చేయకుండా ఈ వ్యాఖ్య రాసిన వారు: Nagasam (చర్చ • మార్పులు)
- వ్యాసమంతా రచయిత దృక్కోణంతో, స్వంత అభిప్రాయాలతో నిండిపోయింది. దాదాపుగా వ్యాసం మొత్తాన్నీ ఆంధ్రజ్యోతి నుండి ఉన్నదున్నట్టుగా కాపీపేస్టు చేసి పడేసారు కాబట్టి, అలా ఉంది. వ్యాసాన్ని నాకు తోచినంతలో సవరించాను. సరైన మూలాలను చూపిస్తూ వ్యాసాన్ని పూర్తిగా తిరగరాస్తే తప్ప, ఆ ఆంధ్ర జ్యోతి వ్యాసపు వాసనలు పోవు. __చదువరి (చర్చ • రచనలు) 09:42, 27 ఆగస్టు 2017 (UTC)