చర్చ:కర్మ సిద్ధాంతం
ఈ వ్యాసంలో వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి. నిర్వాహకులు తొలగించగలరు--Svrangarao 04:21, 10 డిసెంబర్ 2008 (UTC)
- హిందూ సిద్ధాంతాలలో ఇది చాలా ముఖ్యమైనది. దీనిని అభివృద్ధి చేయాలి. తప్పులుంటే సవరించండి.Rajasekhar1961 04:56, 10 డిసెంబర్ 2008 (UTC)
- శశికాంత్ గారూ,ఇస్లాంలో క్రైస్తవంలో కూడా ఖర్మ సిద్ధాంతంఉంది.ఆయా మతలేఖనాలతో నేను వ్రాసిన భాగాలను ఎందుకు తొలగించారు?--Nrahamthulla 16:39, 12 ఆగష్టు 2010 (UTC)
karma is not fate
[మార్చు]- Nrahamthulla గారు ,
karma is not fate... ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. karma means an act. It can be good or bad. అలాగే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మ ఫలం అంటారు. మనిషి ఆధీనంలో కర్మ ఉంటుంది మరియు కర్మ ఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. కనుక అబ్రహమిక్ మతాలు నమ్మే fatalismకి కర్మ సిద్ధాంతం వర్తింపచేయరాదు. వాటికి వీటికి చాలా వ్యత్యాసం ఉంది. వాటి గురించి వేరే పేజిలో రాయండి. మరిన్ని వివరాలకు ఆంగ్ల వికీ లో వ్యాసం చదవండి. http://en.wikipedia.org/wiki/Karma
ఇంతకు ముందు ఉన్న వాక్యాలు కొన్ని:
- అలాహ్ మనిషి అత్మను చేసి అందులోకి పాప పుణ్యాలు రెంటినీ ఊదుతాడు.
ఇది కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం. పాప పుణ్యాలు మనుషులు తమ నిర్ణయానుసారం చేస్తారు. దేవుడు చేయించడు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రం నిర్ణయిస్తాడు.
- శిశువు గర్భంలోఉన్నప్పుడే మగా ఆడా , మంచివాడౌతాడా చెడ్డవాడౌతాడా ,అతని పనులు,ఉపాధి,ఆయుషు వ్రాసినతరువాతే అల్లాహ్ ప్రాణం పోస్తాడు.కొంతమంది స్వర్గార్హత కొద్దిలో కోల్పో వచ్చు,నరకాన్ని కొద్దిలో తప్పించుకోనూ వచ్చు(బుఖారీ 59:6,ముస్లిం:1216)
ఇది కూడా కర్మ సిద్ధాంతం కాదు. పైన చెప్పిన వివరణ వర్తిస్తుంది.
పూర్వ వ్యాసంలో మిగిలిన వ్యాఖ్యలకు కూడా కర్మ సిద్ధాంతానికి చాలా వ్యత్యాసం ఉంది. వాటికి వేరే పేజీలు సృష్టించండి.
అబ్రహమిక్ మతాలు సిద్ధాంతాలు హిందూ కర్మ సిద్ధాంతాలకి వ్యత్యాసం ఉంది. అది కర్మ సిద్ధాంతం కాదు. ఆంగ్ల వికీలో రెండో పేరా చదవండి.
ఈ వ్యాసం లో ఇంకా రాయవలసింది ఉంది. నెమ్మదిగా పూర్తి చేస్తా. కర్మ కి ఇంకో నిర్వచనం కూడా ఉంది. కాకపోతే అది వ్యాకరణంలో ఉంటుంది. కర్మ సిద్ధాంతంలో ఉండే కర్మ మరియు వ్యాకరణం లో ఉండే కర్మకి తేడా స్వల్పమే.
--శశికాంత్ 17:12, 12 ఆగష్టు 2010 (UTC)
- ఒక మనిషి జీవితం ముందుగానే దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది.వివిధమతాలలోని నొసటి మీద రాత,తలరాత లలాట లిఖితం,విధి నిర్ణయం,(ప్రిడెస్టినేషన్) ,హిందూ కర్మసిద్ధాంతాలలోని తేడాలు ప్రధాన వ్యాసం లోనే ఉంటే తులనాత్మక పరిశీలనకు ఉపయోగపడేవి.ఆయా మత లేఖనాలను పూర్తిగా తీసివేయకుండా తగినచోట ఉంచగలరు--Nrahamthulla 17:32, 12 ఆగష్టు 2010 (UTC)
- మీరు నేను రాసినది సరిగా చదవలేదనుకుంట. అబ్రహమిక్ మతాలలో కర్మ సిద్ధాంతం అనేది లేదు. కర్మ సిద్ధాంతం కేవలం నాలుగు మతాల వారు నమ్ముతారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు. మీ మత గ్రంధాలలో ఎక్కడైనా కర్మ అనే పదం కనపడితే తప్పకుండా రద్దాం. కేవలం కొన్ని పోలికలు ఉన్నంత మాత్రాన కర్మ సిద్ధాంతం అవదు. పోనీ ఆంగ్ల వికీ లో మీరు చెప్పిన విషయం ఉందా ,... లేదు. మీరేమో మనిషి చేసే పనులని దేవుడు నిర్ణయిస్తాడు అంటున్నారు. కాని కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే పనులు మనిషి నిర్ణయిస్తాడు. ఆ పనులకి ఫలితాలు దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడి నిర్ణయం ప్రకారం మనిషి జీవితం నడుస్తుంది అన్నారు, మరి ఇంక మనిషి తప్పులు ఎందుకు చేస్తాడు? మనిషి కర్మ చేస్తాడు, దేవుడు కర్మ ఫలితాన్ని అందిస్తాడు. అదీ కాక పునర్జన్మలు కూడా కర్మ సిద్ధాంతంలో భాగం. కాని అవేవి అబ్రహమిక్ మతాలలో లేవు. --శశికాంత్ 17:54, 12 ఆగష్టు 2010 (UTC)
- అబ్రహాము మతాలలో కర్మ సిద్ధాంతం ఇలా ఉంటుంది:
"మనలను ముందుగా తనకోసరము నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన మనలను ఏర్పరచుకొనెను.దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు" (ఎఫెసీ 1:5,11)
"విధివ్రాత ప్రకారమే ఏ పనైనాజరుగుతుంది" (ముస్లిం :1218),"ప్రతి మనిషీ తాను దేనికొరకు పుట్టించబడ్డాడో ఆ పనులే చేస్తాడు" (బుఖారీ 82:2).అలాగైతే మనిషి చేసే తప్పులకు దేవుడే కారణం కదాఅని ఆయా మతాలలోని హేతువాదులు ప్రశ్నిస్తున్నారు.హిందూ సోదరులు కూడా అంతా నా తలరాత నా ఖర్మ నొసట రాస్తే నోట పలుకుతుంది,రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...? అంటూ ఉంటారు.ఈ జన్మలోనే తిరిగి జన్మించడం అనేది క్రైస్తవమతంలో కీలక సిద్ధాంతం.--Nrahamthulla 04:05, 13 ఆగష్టు 2010 (UTC)
- మీరు రాసింది కర్మ సిద్ధాంతం అని ఎవరు చేప్పారో తెలియచేయండి. మీ మత గ్రంధాలలో ఎక్కడైనా కర్మ అనే పదం ఉందా?
సింహము , పులి రెండూ మాంసాన్ని తింటాయి. అలాగని రెండూ ఒకటి కాదు.
కింద రాసింది ఒకసారి బాగా పరిశీలించండి.మీకు అర్ధం అవుతుంది.
ధార్మిక మతాల ప్రకారం :
- మనిషికి కష్ట నష్టాలు సుఖాలు కలిగితే అది కర్మ ఫలం, విధిరాత.
- మనిషి తప్పులు చేస్తే అది విధిరాత కాదు. స్వయంకృతాపరాధం.
అబ్రహమిక్ మతాల ప్రకారం :
- మనిషికి కష్టాలు సుఖాలు కలిగినా అది విధిరాత.
- మనిషి తప్పులు ఒప్పులు చేసినా అది విధిరాత.
కర్మ ఫలం మాత్రమే విధిరాత. కర్మ విధిరాత కాదు.
నాకు లాటరీ తగిలినా తల పగిలినా అది కర్మ ఫలం, విధిరాత, తలరాత.
నేను దొంగతనం చేస్తే అది నేను చేసుకున్న కర్మ. అది విధిరాత కాదు, తలరాత కాదు. నేను చేసిన ఈ చెడుకర్మకి భగవంతుడు కర్మ ఫలం అనుభవించేలా చేస్తాడు. అది విధిరాత, తలరాత.--శశికాంత్ 13:30, 13 ఆగష్టు 2010 (UTC)
- నేను లేఖనాలను కోట్ చేశాను.అవి నా సొంత మాటలు కాదు.మీరు రాసింది కర్మ సిద్ధాంతం అని ఎవరు చేప్పారో తెలియచేయండి. మీ మత గ్రంధాలలో ఎక్కడైనా కర్మ అనే పదం ఉందా?దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అదంతా రాసే ఉంచాడు. దేవుడు రాసినది మనిషికి తప్పకుండా లభిస్తుంది.ఏ ఒక్కరూ దీన్ని ఆపడం గాని,పెంచడం గాని చేయలేరు అనేదే అబ్రాహాము మతాల కర్మ సిధ్ధాతం.(ఎఫెసీ 1:5,11),(బుఖారీ 82:2), (ముస్లిం :1218).అవూజు బిక మిన్ షర్రి మా సన-తు అబూఉ లక బిని-మతిక అలయ్య అంటే నా కర్మ యొక్క కీడు నుండి నీ రక్షణలోకి వస్తున్నాను అని దైవ ప్రార్ధన.--Nrahamthulla 08:07, 13 ఆగష్టు 2010 (UTC)
- మీరు లంకెలను ఇవ్వండి ...
మీరు రాసిన వ్యాసానికి మీరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక సారి మీరు రాసిన భారతీయ మతములు వ్యాసం చూడండి. మొదటి లైను చదవండి. అందులో అబ్రహమిక్ మతాలు లేవు.
కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే।
You have a right to “Karma” (actions) but never to any Fruits thereof. You should never be motivated by the results of your actions, nor should there be any attachment in not doing your prescribed activities.
కర్మ సిద్ధాంతం మరియు కర్మ అనే పదాలు వచ్చింది భగవద్గీతలో నుండి. కృష్ణుడు అర్జుణుడికి హితోపదేశంలో చెప్తాడు. అదే కర్మ సిద్ధాంతం అయ్యింది.
మా గ్రంధాలలో కర్మ పదం ఉందా అని అడుగుతున్నారా? బాబోయ్... మీరు ఇప్పుడు మా మతాన్ని కూడా హైజాక్ చేస్తున్నారు. అల్లాహ్ మరియు మహమ్మద్‌లు హిందువులంటే మీకు ఎలా ఉంటుంది? అసలు కర్మ అనే పదం పుట్టిందే హిందూ మతంలో. కర్మ అనే పదం సంస్కృత పదం. సంస్కృతం నుంచి వచ్చిన భారతీయ భాషలలో కూడా చాలా వరకు అవే పదాలు ఉంటాయి. కర్మ సిద్ధాంతం మరియు కర్మ అనే పదం హిందూ మత గ్రంధాలలో ఉంది. సిక్కు మత గ్రంధాలలో ఉంది. బౌద్ధ మత గ్రంధాలలో ఉంది. జైన మత గ్రంధాలలో ఉంది. మీ మత గ్రంధాలలో ఉంటే రాయండి , లేకపోతే రాయద్దు.
ఈనాడు పత్రికలో చక్కటి వ్యాసం రాశారు . eenadu Font install చేసుకుని చదవండి. http://www.eenadu.net/antaryami/antarmain.asp?qry=612anta
నేను మూలాలు పేర్కొన్నాను. మీరు మీ గ్రంధాలలో కర్మ అనే పదం ఎక్కడ వచ్చిందో లంకెను ఇస్తే నేనే నా స్వహస్తాలతో మళ్ళీ అంతా రాస్తాను.
అల్లాహ్ పదాన్ని బైబిల్ లో వాడుకున్నందుకు మలేసియాలో ముస్లిమ్ లు యుద్ధ వాతావరణం సృష్టించారు. కొన్ని పదాలు కొన్ని మతాలకి మాత్రమే పరిమితం. Muslim riots in malaysia for allah word in bible
--శశికాంత్ 13:31, 13 ఆగష్టు 2010 (UTC)
- కర్మ అనేది ఇక్కడ సబ్జెక్ట్ .ఆపదం వాడుకుంటే మతాన్ని హైజాక్ చేసినట్లు బాధపడకుండా ,భారతీయ మతాలలోని అంశాలే విదేశీ మతాలలో కూడా ఉన్నందుకు సంతోషించండి.అల్లాహ్ మరియు మహమ్మద్‌లు హిందువులంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది."భారతీయులంతా హిందువులే. హిందువులు కానివారు భారతీయులేకాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవనవిధానం" అని చెప్పిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నిర్వచనం ప్రకారం మనదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే .భారతీయ ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?నేనూ హిందువునే అని గర్వంగా చెబుతున్నాను.ఈ కర్మ భూమిలో పాకిస్థానీయుడిగా కాకుండా భారతీయుడిగా పుట్టినందుకు సంతోషిస్తాను.హిందూ అనేది నా జాతి.తెలుగు వాడిగా పుట్టటం నాకు లభించిన వరం.ఎంతో తపస్సు చేస్తే గానీ ఈ తెలుగు జన్మ లభించదు. "ఆంధ్రత్వమాంధ్ర భాషాచ నాల్పశ్ఛ తపసః ఫలమ్" అనే వాక్యాలు నా విలువను పెంచాయి.--Nrahamthulla 00:57, 14 ఆగష్టు 2010 (UTC)
- కర్మ సిద్ధాంత ఔన్నత్యం ఎవరు అంగీకరించినా అది హర్షణీయమే కదా ! హిందు అన్న పదం సింధు నదీ పరివాహక సంస్కృతి నుండి ఉద్భవించిందన్న సిద్ధాంతం ఒకటి ఉన్నది. అందుకే మన దేశం హిందూదేశం అయింది. హిందు అన్నది సంస్కృతి. ఆ సంస్కృతిని అనుసరించే వాళ్ళ మతం హిందూ మతం. నేను హిందువునని గర్వంగా చెబుతున్న రహమతుల్లాగారిలాంటి సోదరులు మనకున్నందుకు ఏ భారతీయుడైనా గర్వించాలి కదా ! మనం కొంచం అలోచించి ఈ చర్చకు ముగింపు పలకచ్చేమో ! --t.sujatha 03:01, 14 ఆగష్టు 2010 (UTC)
- Nrahamthulla గారు, మీరు చెప్పింది బాగుంది. కర్మ అనే పదం వాడుకోవడం వల్ల సమస్య రాలేదు కాని ఆ పదం యొక్క అర్ధం మార్చకూడదు. తుడిచి వేసిన విషయాలన్నిటినీ విధిరాత లో రాశాను. అక్కడ అవి వర్తిస్తాయి కాని ఇక్కడ వర్తించవు. భగవంతుడు కర్మ ని నిర్ణయించడు మనిషి మాత్రమే నిర్ణయిస్తాడు అనేది నా వాదన. అలా ఉంటేనే అది కర్మ అవుతుంది. లేకపోతే అర్ధం మారిపోతుంది. ఆ విషయానికి మూలాలు ఇచ్చాను.
ఈ చర్చ ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.
- సోదరి సుజాత గారికి,సోదరుడు శశికాంత్ గారికి ధన్యవాదాలు--Nrahamthulla 15:34, 14 ఆగష్టు 2010 (UTC)