చమ్మక్ చల్లో
స్వరూపం
చమ్మక్ చల్లో | |
---|---|
దర్శకత్వం | నీలకంఠ |
తారాగణం | వరుణ్ సందేశ్ సంచిత పడుకొణె కేథరీన్ థెరీసా వెన్నెల కిశోర్ అవసరాల శ్రీనివాస్ |
ఛాయాగ్రహణం | గోగినేని రంగనాథ్ |
కూర్పు | నాగిరెడ్డి |
సంగీతం | వారణాసి కిరణ్ |
పంపిణీదార్లు | శ్రీ శైలేంద్ర సినిమాస్ |
విడుదల తేదీ | 15 ఫిబ్రవరి 2013 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
చమ్మక్ చల్లో 2013, ఫిబ్రవరి 15 న విడుదలదైన తెలుగు చిత్రం.
కథ
[మార్చు]కిశోర్ (అవసరాల శ్రీనివాస్) మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. అధ్యాపకుడు అప్పారావు (సయాజీ షిండే) వినిపించిన ఒక ప్రేమ కథ అతడిని ఆకట్టుకొంటుంది. తన శిష్యులైన శ్యాం (వరుణ్ సందేశ్), అన్షు (సంచితా పడుకొనే) ప్రేమకథే ఆ కథ. వీరిద్దరికి వివాహ నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. తర్వాత శ్యాం ఉద్యోగంలో భాగంగా బెంగులూరు వెళ్తాడు. అక్కడ అతనికి సునయన (కేథరీన్) పరిచయమౌతుంది. ఆమె పట్ల శ్యాం ఆకర్షణ పెంచుకుంటాడు. చివరికి ఎవరిని పెళ్ళి చేసుకుంటాడనేది ముగింపు.
నటవర్గం
[మార్చు]- వరుణ్ సందేశ్
- సంచిత పడుకొణె
- కేథరీన్ థెరీసా
- వెన్నెల కిశోర్
- అవసరాల శ్రీనివాస్
- సాయాజీ షిండే
- చిన్మయి ఘట్రాజు
- బ్రహ్మాజీ
- సురేఖా వాణి
- సత్య (నటుడు)