చంపకమాల
(చంపక మాల నుండి దారిమార్పు చెందింది)
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి[1].
చంపకమాల
[మార్చు]నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.
- పాదాలు: 4 పదాలు కలవు
- ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21
- ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
- యతి : ప్రతిపాదంలోనూ 1 వ అక్షరముకు 11 వ అక్షరముకు యతిమైత్రి చెందుతుంది
- ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
గణ విభజన
[మార్చు]న | జ | భ | జ | జ | జ | ర |
I I I | I U I | U I I | I U I | I U I | I U I | U I U |
పదము | లబట్టి | నందల | కుబా టొ | కయింత | యులేక | శూరతన్ |
ఉదాహరణ
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు.
పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం
జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్
వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.
మూలాలు
[మార్చు]- ↑ మిరియాల), Dileep Miriyala(దిలీపు. "చంపకమాల (సరసీ) — తెలుగు ఛందస్సులు". chandam.apphb.com. Archived from the original on 2017-11-24. Retrieved 2019-08-25.
- ↑ "ఛందోపరిచయము : చంపకమాల".
బయటి లింకులు
[మార్చు]- Padmini, K.; Champakamala, B. S. (2017-01-05). "Image Hiding using Least Significant Bit Algorithm Steganography". Third International Conference on Current Trends in Engineering Science and Technology ICCTEST-2017. Grenze Scientific Society. doi:10.21647/icctest/2017/49038. ISBN 9788193111956.