Jump to content

చంద్ర తాల్ సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 32°28′31″N 77°37′01″E / 32.47518°N 77.61706°E / 32.47518; 77.61706
వికీపీడియా నుండి
చంద్ర తాల్ సరస్సు
చంద్ర తాల్ సరస్సు is located in Himachal Pradesh
చంద్ర తాల్ సరస్సు
చంద్ర తాల్ సరస్సు
ప్రదేశంహిమాలయ, లాహౌల్ స్పితి జిల్లా, హిమాచల్ ప్రదేశ్,
అక్షాంశ,రేఖాంశాలు32°28′31″N 77°37′01″E / 32.47518°N 77.61706°E / 32.47518; 77.61706
రకంమంచి నీరు
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట పొడవు1 కి.మీ. (0.62 మై.)
గరిష్ట వెడల్పు0.5 కి.మీ. (0.31 మై.)
ఉపరితల ఎత్తు4,250 మీ. (13,940 అ.)
ద్వీపములు1
అధికారిక పేరుChandertal Wetland
గుర్తించిన తేదీ8 November 2005
రిఫరెన్సు సంఖ్య.1569

చంద్ర తాల్ సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ స్పితి జిల్లాలో కలదు. చంద్ర తాల్ అంటే చంద్రుని సరస్సు అని అర్ధం. పర్యాటకులు, పర్వతారోహకులకు ఇది ఇష్టమైన ప్రదేశం.

విస్తీర్ణం

[మార్చు]

చంద్ర తాల్ సరస్సు హిమాలయాలలో సుమారు 4,300 మీటర్ల (14,100 అడుగులు) లోతు కలిగి ఉంది. దీనికి ఒక వైపు స్క్రీ పర్వతాలు మరొక వైపున సిర్క్ పర్వతాలు ఉన్నాయి.

ప్రయాణం

[మార్చు]

చంద్ర తాల్ పర్వతారోహకులకు ఒక పర్యాటక కేంద్రం. ఇది కున్జుమ్ పాస్ నుండి 8 కిమీ (5.0 మైళ్ళు) దూరంలో ఉంది. కున్జుమ్ పాస్ నుండి చంద్ర తాల్ వరకు సుమారు రెండు గంటలు పడుతుంది. దీని నుండి 30 కి.మీ (19 మైళ్ళు) దూరంలో ఉన్న సూరజ్ తాల్ నుండి కూడా చంద్ర తాల్ ను చేరుకోవచ్చు.[1]

భౌగోళికం

[మార్చు]

సరస్సు ఒడ్డున విస్తారమైన పచ్చికభూములు ఉన్నాయి. వసంతకాలంలో ఈ పచ్చికభూములు వందల రకాల అడవి పువ్వులతో విస్తరిస్తాయి. 1871 లో, కుల్లు అసిస్టెంట్ కమిషనర్ హార్కోర్ట్, చంద్ర తాల్ కు ఉత్తరాన మంచి గడ్డి మైదానం ఉందని గుర్తించాడు. అక్కడికి గొర్రెల కాపరులు కాంగ్రా నుండి మేత కోసం పెద్ద మొత్తంలో గొర్రెల మందలను తీసుకువచ్చేవారని, అతిగా గొర్రెలు మేయటం కారణంగా, గడ్డి భూములు ఇప్పుడు కనిపించకుండా పోయాయనీ, అతడు నివేదించాడు.[2]

పక్షులు

[మార్చు]

రడ్డీ షెల్డక్ వంటి మొదలైన పక్షి జాతులకుసరస్సు నివాస ప్రాంతం.[3]

ప్రత్యేకత

[మార్చు]

సరస్సు భారతదేశంలోని రెండు ఎత్తైన చిత్తడి నేలలలో ఒకటి. వీటిని రామ్‌సర్ సైట్‌లుగా గుర్తించారు. సరస్సు నుండి 5 కిలోమీటర్ల (3.1 మైళ్ళు) దూరంలో గుడారాల వసతి అందుబాటులో ఉంటుంది.[4]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Official Website of Lahaul & Spiti District, Himachal Pradesh, India". Deputy Commissioner, Lahaul and Spiti. Retrieved 28 March 2017.
  2. "Route from NH-505 to Chandra Taal". OpenStreetMap.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-26.
  3. Harcourt, A.F.P. (1871). The Himalayan Districts of Kooloo, Lahoul and Spiti. London: W.H. Allen & Sons. pp. 16-21.
  4. Ali, Salim; et al. (Bombay Natural History Society) (2012). The Book of Indian Birds (13th ed.). Oxford University Press. p. 83. ISBN 0195665236.