Jump to content

చంద్రగిరి కోట

అక్షాంశ రేఖాంశాలు: 13°34′57″N 79°18′20″E / 13.58250°N 79.30556°E / 13.58250; 79.30556
వికీపీడియా నుండి
చంద్రగిరి కోట
ఆంధ్రప్రదేశ్ లో భాగం
చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
Raja Mahal of Chandragiri Fort
చంద్రగిరి కోట is located in ఆంధ్రప్రదేశ్
చంద్రగిరి కోట
చంద్రగిరి కోట
చంద్రగిరి కోట is located in India
చంద్రగిరి కోట
చంద్రగిరి కోట
భౌగోళిక స్థితి13°34′57″N 79°18′20″E / 13.58250°N 79.30556°E / 13.58250; 79.30556
రకముFort
స్థల సమాచారం
నియంత్రణGovernment of Andhra Pradesh
పరిస్థితిRuins
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరం11th century
కట్టించిందిYadava rulers of Vijayanagara Kingdom
వాడిన వస్తువులుGranite Stones and lime mortar
Battles/warsYadava rulers, Reddy dynasty

చంద్రగిరి కోట, ఇది ఒక చారిత్రక కోట, ఇది 11 వ శతాబ్దంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చంద్రగిరిలో నిర్మించబడింది.విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ, దీనిని 11 వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు.

చంద్రగిరి గురించి మూడు శతాబ్దాలు యాదవ నాయక్కార్ పాలనలో, నియంత్రణలోకి వచ్చింది విజయనగర యాదవులు 1367 లో పాలకులు. సాలూవ నరసింహ రాయలు పాలనలో ఇది ప్రముఖమైంది. తరువాత, అత్యంత ప్రసిద్ధ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయను పెనుకొండలో పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా ఈ కోటలో పరిమితం చేశారు. ఈ కోటలో తన కాబోయే రాణి చిన్న దేవిని కలిశారని కూడా అంటారు. విజయనగర సామ్రాజ్యం యొక్క 4 వ రాజధాని చంద్రగిరి,[1] గోల్కొండ సుల్తాన్లు పెనుకొండపై దాడి చేసినప్పుడు రాయలు తమ రాజధానిని ఇక్కడికి మార్చారు. 1646 లో ఈ కోట గోల్కొండ భూభాగానికి అనుసంధానించబడింది, తరువాత మైసూర్ పాలనలో వచ్చింది. ఇది 1792 నుండి ఉపేక్షలోకి వెళ్ళింది. రాజా మహల్ ప్యాలెస్ ఇప్పుడు పురావస్తు మ్యూజియం. ఈ ప్యాలెస్ విజయనగర కాలం నాటి ఇండో-సర్సెన్ నిర్మాణానికి ఒక ఉదాహరణ. కిరీటం టవర్లు హిందూ నిర్మాణ అంశాలను సూచిస్తాయి. ఈ ప్యాలెస్ రాయి, ఇటుక, సున్నం మోర్టార్, కలప లేనివి ఉపయోగించి నిర్మించబడింది.ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోసం బ్రిటిష్ వారికి భూములు ఇచ్చే ఒప్పందం ఆగస్టు 1639 లో సంతకం చేసిన ప్రదేశం ఈ కోట.[1]

చంద్రగిరి కోట

[మార్చు]
విజయనగర చక్రవర్తులు కట్టించిన చంద్రగిరి కోట
చంద్రగిరి కోటలోని ప్రధాన భవనం, రాజ మహల్
చంద్ర గిరి కోట రెండో ద్వారం

చంద్రగిరిలో 1640లో కట్టబడిన కోట ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములో వుండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచే వారు. ఇలా నిర్మించుట వలన కోట రక్షణ కొండ ప్రాంతమువైపుగా తగ్గగలదనీ కొండపైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించుట సులభం కనుక కొండ ప్రక్కగా నిర్మించారనీ మ్యూజియంలో సమాచారముద్వారా తెలుస్తున్నది.కోట చుట్టూ దాదాపు కిలో మీటరు దృఢమైన గోడకలదు ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన రాళ్ళ పరిమాణం చాలా పెద్దది. దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది.ఈ గోడ పొదల తుప్పల మధ్య ఇప్పటికీ చెక్కు చెదరక ఉంది. ఈ గోడననుసరిస్తూ బయటి వైపుగా పెద్ద కందకము ఉంది. ప్రస్తుతము పూడిపోయిననూ అప్పటి కాలమందు ఇందులో మొసళ్ళను పెంచే వారట. విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది.కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహనిర్బంధములో ఉంచారు.సా.శ.1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాక విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ళ పాటు పెనుకొండకు మార్చారు. పెనుకొండ తర్వాత ఇంకొన్నేళ్ళకు చంద్రగిరికి మారిపోయింది.[2] చంద్రగిరి నుండి పాలించిన చిట్టచివరి విజయనగర రాజు పెద వేంకట రాయలు, తన సామంతుడు దామెర్ల చెన్నప్ప నాయకుడు 1639 ఆగస్టు 22లో బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి చందిన ఫ్రాన్సిస్ డేకి చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతిచ్చింది.ఈ కోట నుండే ఇప్పటికీ ఆనాటి దస్తావేజులను మ్యూజియంలో చూడవచ్చు. కొండ పై భాగమున ఒక సైనిక స్థావరము నిర్మించారు. వారి అవసరముల నిమిత్తము పై భాగమున రెండు చెరువులను నిర్మించి క్రింది నున్న పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోటలో మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తుంది.(ఇప్పటికీ కొండపైకి నీటిని పంపించుట అనేది పెద్ద మిస్టరీ).అప్పుడు పైకి పంపించేందుకు ఉపయోగించిన సాధనాలు పాడయిపోయాయి.అయితే పైన చెరువు, క్రింద చెరువు ఇప్పటికీ మంచి నీటితో కనిపిస్తాయి. రాణీ మహల్ రెండు అంతస్తులుగానూ, రాజ మహల్ మూడు అంతస్తులుగానూ ఉంది. రాణీ మహల్ చాలా వరకు పాడైపోయింది. రాణీ మహల్ పేరుకే రాణీమహల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. కానీ దీని వాస్తునుబట్టి ఇది ఒక గుర్రపు శాల కావచ్చని అక్కడి బోర్డునందు వ్రాసి ఉంది. పురావస్తు శాఖ అధీనములోకొచ్చిన తరువాత కొంత వరకూ బాగు చేశారు. రాణీమహల్ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాలకోసం ఒక దిగుడు బావి ఉంది. దీనినుండే అంతపుర అవసరాలకు నీటిని సరఫరా చేసే వారని తెలియ చేయబడింది. ఈ బావికి కొద్ది దూరములో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు ఆరు స్తంభాలు కలిగి ఉపరితలమునకు నాలుగు రింగులు ఉన్న చిన్న మండపము ఉంది. రాజమహలులో మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో ఉన్నాయి. రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడచ్చు. మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజలజీవన విధానం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజప్రముఖుల గదులు ఉన్నాయి. చాలా వరకూ పాడైన దేవాలయాలు వదిలేసి కొంత బాగున్న రాణీమహల్, రాజమహలు, వీటివెనుక ఉన్న చెరువు మొదలయినవాటిని బాగుచేసి కొంత వరకూ తోటను వేసి అన్ని చోట్లా మొక్కలు పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు. రాజమహలుకు వెనుక ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ దియేటర్ మాదిరిగా మార్చి, దృశ్య కాంతి శబ్ధ (సౌండ్, లైటింగ్ షో) ప్రదర్శనం చేస్తారు. ఈ ప్రదర్శనకు 45/- రూపాయలు సామాన్య రుసుము ఉంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఐదు కోట్ల రూపాయల మొత్తముతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ద్వారా పెనుకొండ, చంద్రగిరి సంస్థానాలు ఎలా నాశనమయిపోయాయో కళ్ళకు కట్టినట్లుగా కాంతి, శబ్దాల ద్వారా వివరిస్తుంది.ఈ ప్రదర్శన తెలుగు, ఆంగ్లభాషలో అమితాబ్ బచ్చన్ స్వరంలో వ్యాఖ్యానం వినవచ్చు.

చంద్రగిరిలోని దేవాలయాలు

[మార్చు]
నిటారుగా ఉన్న కొండపై కోట గోడ
  1. ములస్తానమ్మతల్లి దేవస్తానం
  2. మిట్ట గంగమ్మ తల్లి దేవస్తానం
  3. పంచ పాండవులు, ద్రౌపతీదేవి దేవాలయం
  4. సువర్ణముఖీ నది ఒడ్డున ఉన్న పాడుబడ్డ దేవాలయాలు
  5. తొండవాడకు వెళ్లే మార్గంలో ఎడమవైపున పొలాల్లో పురావస్తువేత్తలు భద్రపరచిన పాడుబడ్డ దేవాలయం
  6. చంద్ర గిరి కోట పరిసరాల్లోని అనేక పాడుబడ్డ దేవాలయాలు (వీటినే సౌండ్ అండ్ లైట్ షోలో అధ్బుతంగా ఉపయోగించుకున్నారు)
  7. నర్శింగాపురం/శ్రీనివాసమంగాపురం దారిలోని శివాలయం.
  8. చంద్ర గిరి సెంటర్ లో నమాజ్ టైంలో మోగించే పెద్ద అలారం స్తంభం!

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Moulana, Ramanujar (16 April 2018). "Day-trip down history lane". Metro Plus. Chennai: The Hindu. p. 4.
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]