Jump to content

ఘరానా దొంగలు

వికీపీడియా నుండి
ఘరానాదొంగలు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.ఎం.సమీనుల్లా
నిర్మాణం దామిశెట్టి సూర్యనారాయణ,
జొన్నల నరసింహారావు
తారాగణం ఉదయకుమార్,
శ్రీనాథ్,
ఆరతి
సంగీతం విజయ్ భాస్కర్
వేలూరి కృష్ణమూర్తి
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ సుదర్శన పిక్చర్స్
భాష తెలుగు

ఘరానా దొంగలు 1971, డిసెంబరు 11న విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమా ఠక్క బిట్రె సిక్క అనే కన్నడ చిత్రానికి అనువాదం.

నటీనటులు

[మార్చు]
  • ఉదయకుమార్ - రాజు
  • నరసింహరాజు (కన్నడ నటుడు) - జోగులు
  • సి.ఐ.డి.ఇన్‌స్పెక్టర్ - శ్రీనాథ్
  • ఆరతి - జయంతి

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ.ఎం.సమీనుల్లా
  • నిర్మాతలు: దామిశెట్టి సూర్యనారాయణ, జొన్నల నరసింహారావు
  • సంగీతం: విజయ్ భాస్కర్, వేలూరి కృష్ణమూర్తి
  • గీతరచన: అనిసెట్టి

సంక్షిప్తకథ

[మార్చు]

రంగయ్య త్రాగుబోతు జూదరి. భార్య ప్రసవ సమయంలో మందుల కోసం ఆమె తాళిబొట్టును అమ్మి ఒక స్నేహితుని ప్రోద్బలంతో ఆ డబ్బుతో జూదం ఆడి, తగాదా వచ్చి స్నేహితున్ని చంపి జైలుకు వెళతాడు. రంగయ్య కొడుకులు రాజు, జోగులు తమ చెల్లెలు జయంతిని పెంచి పెద్దదాన్ని చేయడం కోసం ఘరానా దొంగలుగా తయారవుతారు. జయంతి ఒక సి.ఐ.డి.ఇన్‌స్పెక్టర్‌ని ప్రేమిస్తుంది. ఆ సి.ఐ.డి. ఇన్‌స్పెక్టర్ ఘరానా దొంగలకోసం అన్వేషిస్తూ ఉంటాడు. రాజు, జోగులు ఒక రాకుమారి నెక్లెస్‌ను దొంగిలించడానికి ప్రయత్నించి జైలు పాలౌతారు. జైలులో ఉన్నప్పుడు మరికొంతమంది సహాయంతో జైలు నుండి తప్పించుకుని ఒక బ్యాంకును దోపిడీ చేస్తారు. దోపిడీ చేసిన డబ్బు, నగలు వారికి దక్కుతాయా? సి.ఐ.డి. వారిని పట్టుకుంటాడా? అనే విషయాలు పతాక సన్నివేశంలో తెలుస్తాయి[1].

మూలాలు

[మార్చు]
  1. వి. (17 December 1971). "విడుదలైన చిత్రాలు - ఘరానా దొంగలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 21 March 2020.[permanent dead link]